UOH: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు- దరఖాస్తు వివరాలు ఇలా
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వివిధ కోర్సుల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు జూన్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
UOH Admissions: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 2024 జులై సెషన్‌కు సంబంధించి వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
సీట్ల సంఖ్య: 34.
* పీహెచ్‌డీ ప్రోగ్రామ్- 2024 జులై సెషన్
విభాగాల వారీగా సీట్లు..
⏩ ట్రాన్స్‌లేషన్ స్టడీస్: 04
సీట్ల కేటాయింపు: జనరల్- 2 సీట్లు, ఎస్సీ- 01 సీటు, ఓబీసీ- 01 సీటు.
అర్హత: కనీసం 55% మార్కులతో పీజీ(ట్రాన్స్‌లేషన్ / ట్రాన్స్‌లేషన్ స్టడీస్ / లింగ్విస్టిక్స్ / అప్లైడ్ లింగ్విస్టిక్స్/ కంపారిటివ్ లిటరేచర్/ ఇంగ్లీష్) లేదా కనీసం 60% మార్కులు/తత్సమాన గ్రేడ్‌తో ఏదైనా ఇతర విభాగంలో పీజీ ఉండాలి.
⏩ ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్: 08
సీట్ల కేటాయింపు: జనరల్- 03 సీట్లు, ఎస్సీ- 01 సీటు, ఎస్టీ- 01 సీటు, ఓబీసీ- 02 సీట్లు, ఈడబ్ల్యూఎస్- 01 సీటు.
అర్హత: కనీసం 55% మార్కులతో ఇంగ్లీష్ లేదా లింగ్విస్టిక్స్/అప్లైడ్ లింగ్విస్టిక్స్ (ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్)లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
⏩ హెల్త్ సైన్సెస్ (ఆప్టోమెట్రీ అండ్ విజన్ సైన్స్): 02
సీట్ల కేటాయింపు: జనరల్- 01 సీటు, ఎస్సీ- 01 సీటు.
అర్హత: కనీసం 55% మార్కులు/తత్సమాన గ్రేడ్‌తో మాస్టర్స్ డిగ్రీ (ఆప్టోమెట్రీ, విజన్ సైన్సెస్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ఇన్ ఆప్టోమెట్రీ అండ్ విజన్ సైన్సెస్), మాస్టర్స్ డిగ్రీ (ఏదైనా హెల్త్ సైన్సెస్ స్ట్రీమ్), అంతర్జాతీయ పీర్ రివ్యూడ్ జర్నల్స్‌లో ప్రచురణలు మరియు కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండటం మంచిది. బీఎస్సీ ఆప్టోమెట్రీతో పాటు క్లినికల్, ఇండస్ట్రియల్ లేదా రీసెర్చ్ అనుభవం అండ్ ఎంబీఏ/ఎంపీహెచ్, క్లినికల్ రీసెర్చ్, ఎంటెక్ ఆప్తాల్మిక్ ఇంజినీరింగ్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఆప్టిక్స్, /ఎంఎస్సీ(ఆప్టిక్స్), విజువల్ ప్రాసెసింగ్‌లో పరిశోధన కొనసాగించడానికి ఆసక్తి ఉన్నవారు అర్హులు.
⏩ మెటీరియల్స్ ఇంజినీరింగ్: 16
సీట్ల కేటాయింపు: జనరల్- 06 సీట్లు, ఎస్సీ- 02 సీట్లు, ఎస్టీ- 02 సీట్లు, ఓబీసీ- 04 సీట్లు, ఈడబ్ల్యూఎస్- 01 సీటు, పీహెచ్- 01 సీటు.
అర్హత: ఎంఈ/ఎంటెక్ లేదా మెటలర్జీలో సమానమైన మాస్టర్స్ డిగ్రీ, మెకానికల్ (ప్రొడక్షన్ / మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్), మెటీరియల్స్ ఇంజినీరింగ్, సిరామిక్ ఇంజినీరింగ్ /టెక్నాలజీ లేదా ఇంజినీరింగ్ ఫిజిక్స్, కెమికల్ ఇంజినీరింగ్, నానోసైన్స్ అండ్ టెక్నాలజీ లేదా సంబధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉండాలి.
⏩ నానోసైన్స్ అండ్ టెక్నాలజీ: 04.
సీట్ల కేటాయింపు: జనరల్- 02 సీట్లు, ఎస్సీ- 01 సీటు, ఓబీసీ- 01 సీటు.
అర్హత: ఎంఈ/ఎంటెక్ లేదా మెటలర్జీలో సమానమైన మాస్టర్స్ డిగ్రీ, మెకానికల్ (ప్రొడక్షన్ / మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్), మెటీరియల్స్ ఇంజినీరింగ్, సిరామిక్ ఇంజినీరింగ్ /టెక్నాలజీ లేదా ఇంజినీరింగ్ ఫిజిక్స్, కెమికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్*, నానోసైన్స్ అండ్ టెక్నాలజీ లేదా సంబధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.600, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.550, ఓబీసీ-నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు రూ.400. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీఈ(పీహెచ్) అభ్యర్థులకు రూ.275.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
పరీక్ష కేంద్రం: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్.
ముఖ్యమైనతేదీలు..
✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.06.2024.
✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.06.2024.
✦ హాల్‌టికెట్ల డౌన్‌లోడింగ్ తేదీ: 28.06.2024.
✦ ప్రవేశ పరీక్ష తేదీ: 07.07.2024.