By: ABP Desam | Updated at : 01 Mar 2023 03:58 PM (IST)
Edited By: omeprakash
నేచర్ ఇండెక్స్ ర్యాంకింగ్లో HCU అగ్రస్థానం
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అరుదైన గుర్తింపు లభించింది. దేశంలోని యూనివర్సిటీల విభాగంలో మొదటి స్థానంలో నిలిచినట్లు నేచర్ ఇండెక్స్ సంస్థ తాజాగా ప్రకటించింది. అంతర్జాతీయ జర్నల్‌గా ప్రపంచంలోనే పేరొందిన ఆ సంస్థ పలు పరిశోధన పత్రాలను ప్రచురించడంతోపాటు విశ్వవిద్యాలయాలు, సాంకేతిక పరిజ్ఞాన సంస్థల పనితీరును విశ్లేషిస్తుంది. ఇందుకోసం ఆయా విశ్వవిద్యాలయాలు, సాంకేతిక పరిజ్ఞాన సంస్థల పరిశోధన పత్రాల ర్యాంకింగ్‌లను పరిగణనలోకి తీసుకుంటుంది.
విభిన్నంగా, నాణ్యంగా ఉన్న పత్రాలను అన్నికోణాల్లో పరిశీలించి అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేస్తుంది. వాటి ద్వారా సమాజానికి జరిగిన, జరగనున్న మేలు, భవిష్యత్తులో రాబోయే మార్పులను విశ్లేషిస్తుంది. ఈ నివేదికలో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతా, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వంటి దిగ్గజ విశ్వవిద్యాలయాలను వెనక్కినెట్టి హెచ్‌సీయూ అగ్రస్థానంలో నిలవడం విశేషం.
నేచర్ ఇండెక్స్ సంస్థ.. పరిశోధనలను, వాటి ఫలితాల ఆధారంగా ఆయా సంస్థలు, విశ్వవిద్యాలయాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ నుంచి 300 వరకూ స్థానాలను ప్రకటిస్తుంది. ఈ సంస్థ ద్వారా పొందిన స్థానాలు చాలా విలువైనవి. వీటి ద్వారా విదేశీ వర్సిటీలు, పరిశోధన సంస్థలు, పరిశ్రమలు ఆయా విశ్వవిద్యాలయాలతో మరిన్ని పరిశోధనలకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. నేచర్ ఇండెక్స్ ఈ స్థానాలను ఇచ్చేందుకు 2021 డిసెంబరు 1, నుంచి 2022 నవంబరు 30 వరకు మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకుంది. 12 నెలల్లో విశ్వవిద్యాలయాలు, సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో జరిగిన పరిశోధనలను పరిశీలించింది.
తొలిస్థానం దక్కించుకోవడం గర్వకారణం - వీసీ
దేశంలోని వంద విశ్వవిద్యాలయాల్లో తొలిస్థానం దక్కించుకోవడం గర్వకారణమని హెచ్‌సీయూ ఉపకులపతి ప్రొ. బీజేరావు అన్నారు. అన్ని విభాగాలు, శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో ఆచార్యులు, అధ్యాపక బృందం, విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శిస్తున్నారు. గతేడాదితో పోల్చితే నేచర్ ఇండెక్స్ తీసుకున్న విభాగాల్లో మా విశిష్టత పెరిగింది. ఇంతేకాదు.. నాలుగేళ్ల నుంచి వరుసగా ప్రథమస్థానంలోనే ఉన్నాం. ఈ విజయంతో వచ్చే ఏడాది ప్రతి విభాగంలోని ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి విశ్వవ్యాప్త గుర్తింపునకు కృషిచేస్తామని ఆయన పేర్కొన్నారు.
Also Read:
టీఎస్ ఎంసెట్-2023 నోటిఫికేషన్ విడుదల, చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!
టీఎస్ ఎంసెట్-2023 (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023) నోటిఫికేషన్‌ను జేఎన్‌టీయూ హైదరాబాద్ ఫిబ్రవరి 28న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 3 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.250 - రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ ఎంసెట్ పూర్తి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
నీట్ పీజీ-2023 అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ పీజీ)-2023 అడ్మిట్ కార్డులను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) ఫిబ్రవరి 27న విడుదల చేసింది. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నీట్ పీజీ-2023 పరీక్ష యథాతదంగా మార్చి 5న కంప్యూటర్ ఆధారిత విధానంలో జరగనుంది.పరీక్ష వాయిదా వేయాలంటూ దేశ వ్యాప్తంగా మెడికల్ విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నా అందుకు కేంద్రం ససేమిరా అంది. తాజాగా సుప్రీం కోర్టులో కూడా నీట్ పీజీ-2022 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిని విచారించిన అత్యున్నత ధర్మాసనం పరీక్షను వాయిదా వేయడం వల్ల విద్యార్ధుల్లో గందరగోళం, అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉందని తీర్పునిచ్చింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్టికెట్లు అందుబాటులో!
APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
రెండు మూడు రోజుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్టు
TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!
GAT 2023 Application: గాట్-2023 దరఖాస్తుకు మార్చి 26తో ఆఖరు, పరీక్ష ఎప్పుడంటే?
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్‌కు రెండో స్వర్ణం!
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా