అన్వేషించండి

UK Student Visa Rules: ఇకపై యూకేలో చదువులు మరింత ప్రియం.. విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు!

UK Student Visa Rules: యూకేలో ఉన్నత చదువులు చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్ తగలింది. నవంబర్ 30 నుంచి మెయింటనెన్స్ ఫండ్స్ పెంచుతున్నట్లు హోమ్ ఆఫీస్ ప్రకటించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యూకే విద్యార్థి వీసా నిబంధనలు నవంబర్ 30, 2026 నుండి మారుతాయి.
  • విద్యార్థులు చూపించాల్సిన నిర్వహణ నిధుల మొత్తాన్ని బ్రిటన్ పెంచింది.
  • లండన్‌లో తొమ్మిది నెలలకు రూ.18 లక్షలు నిధులు చూపాలి.
  • నవంబర్ 29 లోపు దరఖాస్తు చేస్తే పాత నిబంధనలు వర్తిస్తాయి.


UK Student Visa Rules:  యూకేలో ఉన్నత చదువులు చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు బ్రిటన్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. నవంబర్ 30, 2026 నుండి అమల్లోకి వచ్చేలా యూకే స్టూడెంట్ వీసా నిబంధనలలో కీలక మార్పులను యూకే హోమ్ ఆఫీస్ ప్రకటించింది. ఈ కొత్త విదేశాంగ విధానం ప్రకారం.. అంతర్జాతీయ విద్యార్థులు వీసా పొందేందుకు తమ వద్ద ఉన్నట్లు చూపించాల్సిన మెయింటనెన్స్ ఫండ్స్‌ మొత్తాన్ని పెంచారు. ఈ నిర్ణయం వల్ల విదేశీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

పెరిగిన మెయింటనెన్స్ ఫండ్స్

విద్యార్థులు తమ కాలేజీ ట్యూషన్ ఫీజులు, వీసా ఫీజులు, హెల్త్ సర్‌ఛార్జీలతో సంబంధం లేకుండా ఈ నిర్వహణ నిధులను బ్యాంకు ఖాతాల్లో చూపించాల్సి ఉంటుంది. కోర్సు చదివే కాలన్ని బట్టి గరిష్టంగా 9 నెలల జీవన వ్యయాలను నిరూపించాలి.

Also Read: విదేశాల్లో చదువులకు తెలంగాణ సర్కార్ సాయం.. బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్!.. పూర్తి వివరాలు ఇవే!

లండన్‌లో చదివే విద్యార్థులకు ప్రస్తుతం నెలకు సుమారు రూ.1.95 లక్షలు మెయింటనెన్స్ ఫండ్స్ ఉండగా, నవంబర్ 30 నుంచి ఇది సుమారు రూ.2.01 లక్షలు పెరగనుంది. దీని ప్రకారం 9 నెలల కాలానికి గరిష్టంగా రూ.18.06 లక్షలు నిధులు అకౌంట్‌లో చూపించాలి.  లండన్ బయట చదివే విద్యార్థులకు ప్రస్తుతం నెలకు రూ.1.49 లక్షలు ఉండగా, నవంబర్ 30 నుండి రూ.1.53 లక్షలకు పెరిగింది. దీనితో 9 నెలల కాలానికి మొత్తం రూ.14 లక్షలు అకౌంట్‌లో చూపించాలి. 

Also Read:  నీట్ పీజీ ఎగ్జామ్, మారథాన్ నిర్వహణ.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు 

నవంబర్ 30 నుంచి 

నవంబర్ 29, 2026 లోపు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు పాత నిబంధనలే వర్తిస్తాయి. నవంబర్ 30 లేదా ఆ తర్వాత దరఖాస్తు చేసుకునే వీసాలకు మాత్రమే ఈ కొత్త ఫండ్ నిబంధనలు అమలవుతాయి. యూకేలోని స్థానిక విద్యార్థుల రుణాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రతీ ఏటా ఈ సమీక్ష చేస్తారని, విదేశీ విద్యార్థుల విసా నిబంధనలు దుర్వినియోగం కాకుండా అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని యూకే హోమ్ ఆఫీస్ స్పష్టం చేసింది.

Also Read: మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది

Frequently Asked Questions

యూకే విద్యార్థి వీసా నిబంధనలు ఎప్పటి నుండి అమలవుతాయి?

నవంబర్ 30, 2026 నుండి కొత్త యూకే విద్యార్థి వీసా నిబంధనలు అమల్లోకి వస్తాయి. నవంబర్ 29, 2026 లోపు దరఖాస్తు చేసుకునే వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి.

కొత్త యూకే విద్యార్థి వీసా నిబంధనలలో ప్రధాన మార్పు ఏమిటి?

అంతర్జాతీయ విద్యార్థులు వీసా పొందేందుకు తమ వద్ద ఉన్నట్లు చూపించాల్సిన మెయింటనెన్స్ ఫండ్స్ మొత్తాన్ని పెంచారు. ఈ నిర్ణయం వల్ల విదేశీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

లండన్‌లో చదివే విద్యార్థులకు ఎంత మెయింటనెన్స్ ఫండ్స్ అవసరం?

నవంబర్ 30 నుండి లండన్‌లో చదివే విద్యార్థులు నెలకు ₹2.01 లక్షలు చూపించాలి. 9 నెలల కాలానికి గరిష్టంగా ₹18.06 లక్షలు నిధులు అకౌంట్‌లో చూపించాలి.

లండన్ బయట చదివే విద్యార్థులకు ఎంత మెయింటనెన్స్ ఫండ్స్ చూపించాలి?

నవంబర్ 30 నుండి లండన్ బయట చదివే విద్యార్థులు నెలకు ₹1.53 లక్షలు చూపించాలి. 9 నెలల కాలానికి మొత్తం ₹14 లక్షలు అకౌంట్‌లో చూపించాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Yashasvi Jaiswal Selection Mystery: రెండు సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి..
2 సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి మారిన స్టార్ ఓపెనర్..!
Embed widget