అన్వేషించండి

Mahatma Jyothiba Phule Overseas Vidya Nidhi: విదేశాల్లో చదువులకు తెలంగాణ సర్కార్ సాయం.. బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్!.. పూర్తి వివరాలు ఇవే!

Mahatma Jyothiba Phule Overseas Vidya Nidhi: బీసీ, ఈబీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించేందుకు మహాత్మా జ్యోతిబా ఫులే ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణ బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఓవర్సీస్ విద్యానిధి పథకం.
  • ₹20 లక్షల గ్రాంట్, విమాన ఛార్జీలు, వీసా రీయింబర్స్‌మెంట్ ఇస్తారు.
  • 35 ఏళ్లలోపు, ₹5 లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉన్నవారు అర్హులు.
  • 2026 సెప్టెంబర్ 1 నుండి దరఖాస్తులు; 350 మందికి అవకాశం.

Mahatma Jyothiba Phule Overseas Vidya Nidhi: తెలంగాణ ప్రభుత్వం బీసీ, ఈబీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. విదేశాల్లో ఉన్నత విద్య (మాస్టర్స్, పీహెచ్‌డీ) చదవాలనుకునే విద్యార్థుల కోసం మహాత్మా జ్యోతిబా ఫులే ఓవర్సీస్ విద్యానిధి (Mahatma Jyothiba Phule Overseas Vidya Nidhi) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి సెప్టెంబర్ 1,2026 నుంచి అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నారు. ఈ పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులు ఆగస్టు,సెప్టెంబర్‌ ఫాల్‌ సెషన్‌ కోసం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సెప్టెంబర్‌ 1 నుంచి 30వ తేదీ వరకు కొనసాగుతాయి.  

ముఖ్యమైన ప్రయోజనాలు 

  1. ఈ పథకం కింద ఎంపికైన ప్రతి విద్యార్థికి గరిష్టంగా రూ.20 లక్షల వరకు స్కాలర్‌షిప్ గ్రాంట్‌ ఇస్తారు.  
  2. విదేశాలకు వెళ్లేందుకు వన్-వే ఎకానమీ క్లాస్ విమాన టికెట్ ఛార్జీలు ఇస్తారు.
  3. వీసా ప్రక్రియకు సంబంధించిన ఛార్జీలను రీయింబర్స్ చేస్తారు.
  4. ఈ గ్రాంటును రెండు విడతలుగా విద్యార్థి లేదా విదేశీ వర్సిటీ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తారు. 

Also Read: ఉన్నత చదువుల కోసం రూ.15 లక్షల లోన్.. గురూజీ స్టూడెంట్ క్రెడిట్ కార్డు స్కీమ్ గురించి తెలుసా?

అర్హతలు 

  • దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీసీ లేదా ఈబీసీ వర్గానికి చెందినవారై ఉండాలి.
  • నోటిఫికేషన్ వచ్చే నాటికి 35 ఏళ్లలోపు వయస్సు ఉండాలి.
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు మించకూడదు. 
  • ఒక కుటుంబం నుండి ఒక్క విద్యార్థికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 
  • జీఆర్‌ఈ-260 లేదా జీమ్యాట్‌-500 స్కోర్ ఉండాలి.
  • టోఫెల్‌ -60 మార్కులు లేదా ఐఈఎల్‌టీఎస్‌-6.0 లేదా పీటీఈ-50 మార్కుల స్కోర్ ఏదైనా కలిగి ఉండాలి.
  • పీజీ కోసం: ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, సైన్స్, అగ్రికల్చర్, మెడిసిన్, నర్సింగ్, హ్యుమానిటీస్‌లో 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.  
  • పీహెచ్డీ కోసం: పీజీ కోర్సులో 60% మార్కులు సాధించాలి 
  • యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, జపాన్, న్యూజిలాండ్, ఫ్రాన్స్ వంటి గుర్తింపు పొందిన విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొంది ఉండాలి.
  • జీఆర్ఈ, జీమ్యాట్, TOEFEL/IELTS/PTE స్కోర్లు కలిగి ఉండాలి.  

Also Read: డిగ్రీ, డిప్లొమా విద్యార్థినులకు రూ.30 వేలు.. అజీమ్ ప్రేమ్ జీ స్కాలర్‌షిప్ అప్లై ప్రాసెస్ ఇదే!

కావలసిన డాక్యుమెంట్స్

  1. ఆధార్ కార్డు, నేటివిటీ సర్టిఫికెట్  
  2. కుల ధ్రువీకరణ పత్రం  
  3. ఆదాయ ధ్రువీకరణ పత్రం  
  4. SSC, ఇంటర్, డిగ్రీ/పీజీ మార్కుల మెమోలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు
  5. GRE / GMAT, TOEFL / IELTS / PTE స్కోర్ కార్డులు
  6. విదేశీ యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్  
  7. పాస్‌పోర్ట్ కాపీ  
  8. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం
  9. బ్యాంకు పాస్‌బుక్ (తెలంగాణలో)

ఈ విడతలో మొత్తం 350 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. వీరిలో 250 మంది బీసీ విద్యార్థులు, మిగతా 100 మంది ఈబీసీకి చెందినవారు ఉంటారని అధికారులు తెలిపారు.  అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ సూచించింది. మరిన్ని వివరాల కోసం తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.  
Also Read: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS

Frequently Asked Questions

మహాత్మా జ్యోతిబా ఫులే ఓవర్సీస్ విద్యానిధి పథకం దేని గురించి?

ఈ పథకం తెలంగాణలోని బీసీ, ఈబీసీ విద్యార్థులకు విదేశాలలో మాస్టర్స్ లేదా పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. దీని ద్వారా వారు తమ ఉన్నత విద్య కలను నెరవేర్చుకోవచ్చు.

ఈ పథకానికి అర్హతలు ఏమిటి?

దరఖాస్తుదారులు తెలంగాణ బీసీ/ఈబీసీ అయి ఉండాలి, 35 ఏళ్లలోపు వయస్సు ఉండాలి, కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు మించకూడదు. నిర్ణీత GRE/GMAT, TOEFL/IELTS/PTE స్కోర్‌లు కూడా అవసరం.

ఈ పథకం ద్వారా విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి?

ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్‌షిప్ గ్రాంట్, వన్-వే విమాన టిక్కెట్ ఛార్జీలు, వీసా ప్రక్రియ ఖర్చులు రీయింబర్స్ చేయబడతాయి. గ్రాంట్ రెండు విడతల్లో విడుదల అవుతుంది.

మహాత్మా జ్యోతిబా ఫులే ఓవర్సీస్ విద్యానిధికి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు?

ఆగస్టు, సెప్టెంబర్ ఫాల్ సెషన్ కోసం సెప్టెంబర్ 1, 2026 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీ సంక్షేమ శాఖ గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఈ పథకం కింద ఎంత మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు?

ఈ విడతలో మొత్తం 350 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. వీరిలో 250 మంది బీసీ విద్యార్థులు, 100 మంది ఈబీసీ విద్యార్థులు ఉంటారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
Historic IND VS JPN Clash: వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
Telangana Assembly Sessions: నీ తల్లిని కాదు నా తల్లిని అవమానించారు.. దీనికేం చెబుతావు? హరీష్ రావుపై స్పీకర్ మండిపాటు
నీ తల్లిని కాదు నా తల్లిని అవమానించారు.. దీనికేం చెబుతావు? హరీష్ రావుపై స్పీకర్ మండిపాటు
KTR Challenge: 420 హామీలు నెరవేర్చుతామంటే మేమే అరెస్ట్ అవుతాం! అందుకు సిద్ధమా? కేటీఆర్ ఛాలెంజ్
420 హామీలు నెరవేర్చుతామంటే మేమే అరెస్ట్ అవుతాం! అందుకు సిద్ధమా? కేటీఆర్ ఛాలెంజ్
Advertisement

వీడియోలు

Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్
Fatima Sana Women's Asia Cup 2026 | పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ షాక్
Telangana Politics | BRS MLC Arrest | తెల్లవారుజామున BRS ఎమ్మెల్సీల అరెస్ట్.. తాతా మధు, నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
KTR challenges Congress | ఎమ్మెల్సీల అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్.. “మేమంతా అరెస్ట్‌కు సిద్ధం.. మీరు సిద్ధమా?”
Mohsin Naqvi Women's Asia Cup 2026 | టీమిండియా గెలిస్తే ట్రోఫీ ఇస్తారా? నఖ్వీ రాకతో మళ్లీ వివాదం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
Historic IND VS JPN Clash: వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
Telangana Assembly Sessions: నీ తల్లిని కాదు నా తల్లిని అవమానించారు.. దీనికేం చెబుతావు? హరీష్ రావుపై స్పీకర్ మండిపాటు
నీ తల్లిని కాదు నా తల్లిని అవమానించారు.. దీనికేం చెబుతావు? హరీష్ రావుపై స్పీకర్ మండిపాటు
KTR Challenge: 420 హామీలు నెరవేర్చుతామంటే మేమే అరెస్ట్ అవుతాం! అందుకు సిద్ధమా? కేటీఆర్ ఛాలెంజ్
420 హామీలు నెరవేర్చుతామంటే మేమే అరెస్ట్ అవుతాం! అందుకు సిద్ధమా? కేటీఆర్ ఛాలెంజ్
Anaswara Rajan: కాకా కూతురు అమ్ములు పాప... చిరంజీవి సినిమాలో అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ రిలీజ్... బర్త్‌డే స్పెషల్
కాకా కూతురు అమ్ములు పాప... చిరంజీవి సినిమాలో అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ రిలీజ్... బర్త్‌డే స్పెషల్
2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ vs పాత మోడల్‌.. మైలేజ్, పవర్‌లో వచ్చిన మార్పులేంటి?
2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ ఎంత మైలేజ్ ఇస్తుంది? కంపెనీ లెక్కలు చూస్తే షాకే!
Dates Benefits : ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే.. రోజుకు ఎన్ని తింటే మంచిది
ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే.. రోజుకు ఎన్ని తింటే మంచిది
KL Rahul Future Clarity: ట్రేడింగ్ రూమర్లకు చెక్ పెట్టిన రాహుల్..తన ట్వీట్ తో క్లారిటీ , ఇక హార్దిక్ పాండ్యా ఇష్యూలో మ‌రో ట్విస్ట్
ట్రేడింగ్ రూమర్లకు చెక్ పెట్టిన రాహుల్..తన ట్వీట్ తో క్లారిటీ , ఇక హార్దిక్ పాండ్యా ఇష్యూలో మ‌రో ట్విస్ట్
Embed widget