అన్వేషించండి

NEET PG Exam 2026: మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది

నీట్ పీజీ 2026 పరీక్ష ప్రారంభం కాగా, రంగారెడ్డి జిల్లా శేరిగూడ కేంద్రంలో మద్యం తాగి వచ్చిన విద్యార్థిని ఎగ్జామ్ సెంటర్ లోపలికి అనుమతించలేదు. ఈ పరీక్ష కారణంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ సమస్య తలెత్తింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్షలు ప్రారంభం; తాగివచ్చిన అభ్యర్థికి నిరాకరణ.
  • పరీక్ష పారదర్శకత, భద్రతకు అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు నడ్డా వెల్లడి.
  • సీసీటీవీ, బయోమెట్రిక్, జామర్లతో పటిష్ట భద్రతా చర్యలు అమలుచేసారు.
  • అభ్యర్థుల సౌలభ్యం కోసం పరీక్ష సమయం పెంచారు; ఆధార్ తప్పనిసరి.

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక నీట్ పీజీ 2026 ఎంట్రన్స్ టెస్ట్ ఆదివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. అయితే, రంగారెడ్డి జిల్లా శేరిగూడలోని ఒక పరీక్షా కేంద్రం వద్ద ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఒక అభ్యర్థి మద్యం సేవించి నీట్ పీజీ పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చాడు. అతని ప్రవర్తన గమనించిన పరీక్షా కేంద్ర సిబ్బంది, మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి ఆ విద్యార్థిని లోపలికి అనుమతించకుండా వెనక్కి పంపించివేశారు.

ఈ ఏడాది నీట్ పీజీ పరీక్షను దేశవ్యాప్తంగా మొత్తం 1,300 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 56  కేంద్రాలను ఏర్పాటు చేసి ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో ఈ పరీక్ష జరుగుతుంది. ఇక పరీక్షా సమయానికి అభ్యర్థులు సకాలంలో చేరుకోవడానికి ప్రయత్నించడంతో పలు ప్రధాన మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు, విద్యార్థులు కొంత అసౌకర్యానికి గురయ్యారు.

నీట్ పీజీ ఎగ్జామ్.. అక్రమాలకు తావులేకుండా పటిష్ట భద్రత, సంస్కరణలు

పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఎన్‌బీఈఎంఎస్, టెక్నాలజీ భాగస్వాముల సంసిద్ధతను సమీక్షించిన ఆయన, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో వచ్చే పేపర్ లీక్ వదంతులను నమ్మవద్దని, పరీక్షకు కొద్ది సమయం ముందు మాత్రమే అత్యంత సురక్షితమైన, ఎన్‌క్రిప్టెడ్ విధానంలో ఫైనల్ ఎగ్జామ్ పేపర్ ఎంపిక చేస్తామని తెలిపారు. కేవలం అధికారిక ప్రకటనలనే విశ్వసించాలని అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు.

ఈసారి పరీక్షల సమగ్రతను కాపాడేందుకు పటిష్ఠమైన భద్రతా ఫ్రేమ్‌వర్క్‌ను అధికారులు అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, సిగ్నల్ జ్యామర్లు, డైనమిక్ కంప్యూటర్ కేటాయింపు వంటి చర్యలు చేపట్టారు. పరీక్షల ప్రత్యక్ష పర్యవేక్షణకు సెంట్రల్, రీజనల్ కమాండ్ సెంటర్లను ఏర్పాటు చేసి, 60,000 మందికి పైగా సిబ్బందిని నియమించారు. వేలిముద్రలు సరిపోలని పక్షంలో ఐరిస్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను ప్రత్యామ్నాయంగా తీసుకుంటూ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు.

టైమ్ పెంచి నీట్ పీజీ నిర్వహణ

విద్యార్థుల సౌలభ్యం కోసం సొంత రాష్ట్రంతో పాటు మరో రెండు రాష్ట్రాలను పరీక్షా కేంద్రాలుగా ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. పరీక్ష జరిగే నగరం వివరాలను 3 వారాల ముందే తెలియజేయడంతో ప్రయాణ ఏర్పాట్లకు తగినంత సమయం లభించింది. పరీక్షా విధానంలో మార్పులు చేసి 210 నిమిషాల్లో 180 ప్రశ్నలకు సమాధానమిచ్చేలా సమయాన్ని పెంచారు. రిజిస్ట్రేషన్, పరీక్ష నిర్వహణలో ఆధార్ ఆధారిత గుర్తింపును నిర్వాహకులు తప్పనిసరి చేశారు.

Frequently Asked Questions

నీట్ పీజీ పరీక్షా కేంద్రంలో జరిగిన విచిత్ర సంఘటన ఏమిటి?

రంగారెడ్డి జిల్లాలోని శేరిగూడ పరీక్షా కేంద్రంలో ఒక అభ్యర్థి మద్యం సేవించి పరీక్ష రాయడానికి వచ్చాడు. సిబ్బంది గుర్తించి అతన్ని లోపలికి అనుమతించకుండా వెనక్కి పంపించారు.

ఈ ఏడాది నీట్ పీజీ పరీక్షను ఎన్ని కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు?

దేశవ్యాప్తంగా మొత్తం 1,300 కేంద్రాల్లో నీట్ పీజీ పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

నీట్ పీజీ పరీక్షల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

పటిష్టమైన భద్రతా ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేస్తున్నారు. సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, సిగ్నల్ జ్యామర్లు వంటి చర్యలు చేపట్టారు. ప్రత్యక్ష పర్యవేక్షణకు కమాండ్ సెంటర్‌లు ఏర్పాటు చేశారు.

నీట్ పీజీ పరీక్ష విధానంలో ఈసారి చేసిన ముఖ్యమైన మార్పులు ఏమిటి?

పరీక్షా సమయాన్ని 210 నిమిషాలకు పెంచి 180 ప్రశ్నలకు సమాధానమిచ్చేలా మార్పు చేశారు. రిజిస్ట్రేషన్, పరీక్ష నిర్వహణలో ఆధార్ ఆధారిత గుర్తింపును తప్పనిసరి చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandus World Nandu : ఫేమస్ యూట్యూబర్ నందన అరెస్ట్ - ఉద్యోగాల పేరిట భారీ వసూళ్ల ఆరోపణలు!
ఫేమస్ యూట్యూబర్ నందన అరెస్ట్ - ఉద్యోగాల పేరిట భారీ వసూళ్ల ఆరోపణలు!
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
Section 22A Land Controversy: 22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
BRS Calls for Statewide Protests: అసెంబ్లీ వద్ద పోలీసుల అత్యుత్సాహం.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్‌ పిలుపు
అసెంబ్లీ వద్ద పోలీసుల అత్యుత్సాహం.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్‌ పిలుపు
Advertisement

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
Section 22A Land Controversy: 22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
Vijayasai Reddy Political Party: కమ్మ, కాపులే సీఎం అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
కమ్మ, కాపులే సీఎం అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
Asia Cup Deadlock: ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
AP Local Body Elections: ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
Embed widget