అన్వేషించండి

NEET PG Exam: నీట్ పీజీ ఎగ్జామ్, మారథాన్ నిర్వహణ.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

నీట్ పీజీ ఎగ్జామ్స్ దృష్ట్యా హైదరాబాద్‌లోని పలు కీలక జంక్షన్లలో ఆదివారం ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశముందని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నీట్ పీజీ పరీక్షతో హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ రద్దీ ఉంటుందని హెచ్చరిక.
  • మారథాన్ కారణంగా పరీక్షార్థులకు ప్రత్యేక ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచించారు.
  • రద్దీ, అత్యవసర సమాచారం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ప్రకటించారు.
  • పరీక్షల ఒత్తిడితో ఎంబీబీఎస్ విద్యార్థిని విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్: నీట్ పీజీ (NEET PG 2026) పరీక్ష జరగనున్న నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 30న) హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ రద్దీ ఉండే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. నేటి ఉదయం 7 గంటల నుంచే మెయిన్ జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలు పెరిగే అవకాశం ఉండటంతో నగరంలోని 4 కీలక పరీక్షా కేంద్రాల సమీపంలో ప్రత్యేక ట్రాఫిక్ నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్యారడైజ్ సర్కిల్, తాజ్‌మహల్ జంక్షన్, కింగ్ కోఠి, బండ్లగూడలతో పాటు రేతిబౌలి, నానల్‌నగర్, దుర్గానగర్, కేఎఫ్‌సీ జంక్షన్ల మార్గాల్లో వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్ మారథాన్ రన్

మరోవైపు ఆదివారం ఉదయాన్నే నిర్వహించే "హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ రన్-2026" దృష్ట్యా షేక్‌పేట్‌లోని జి. నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజ్ కేంద్రానికి వెళ్లే విద్యార్థుల కోసం పోలీసులు ప్రత్యేక ప్రత్యామ్నాయ మార్గాలను కేటాయించారు. బోరబండ, మధురానగర్, కల్యాణ్‌నగర్, యూసుఫ్‌గూడ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు జూబ్లీహిల్స్ మీదుగా చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాగే సైబరాబాద్ వైపు నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి (Cable Bridge) మీదుగా వచ్చే వాహనదారులు రోడ్ నంబర్ 45- 51 రూట్ ఎంచుకోవాలని, బంజారాహిల్స్ రోడ్ నంబర్లు 14, 10, 12 నుంచి ప్రయాణించే వారు అగ్రసేన్ ఐలాండ్ - ఫిల్మ్‌నగర్ రోడ్డును ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.

ట్రాఫిక్ హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు

ఏదైనా అత్యవసర ప్రయాణం లేదా సమాచారం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్‌ 9010203626ను సంప్రదించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా పరీక్ష రాసే విద్యార్థులు కాస్త ముందుగానే ఇళ్ల నుంచి బయలుదేరాలన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలను కాకుండా సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి ఎగ్జామ్ సెంటర్లకు ముందుగానే చేరేకోవాలని పోలీసులు విజప్తి చేశారు.

ఎంబీబీఎస్ విద్యార్థిని విషం తాగి ఆత్మహత్య

హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలో ఉన్న అపరాజిత హాస్టల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. కొన్ని గంటల్లో నీట్ పీజీ ఎగ్జామ్ ఉండగా, తీవ్ర మానసిక ఒత్తిడి తట్టుకోలేక కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్ రెడ్డి ఏకైక కుమార్తె, ఎంబీబీఎస్ విద్యార్థిని యశ్విత విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. గత 6నెలలుగా ఆమె హైదరాబాద్‌లోనే ఉంటూ పరీక్షకు సిద్ధమవుతోంది. పరీక్షల భయమే కారణమని భావిస్తున్నారు.

Frequently Asked Questions

నీట్ పీజీ పరీక్ష కారణంగా ఏ రోజు ట్రాఫిక్ రద్దీ ఉంటుంది?

నీట్ పీజీ పరీక్ష ఆగస్టు 30న ఆదివారం నాడు జరగనుంది. ఈ రోజున హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ రద్దీ ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచే రద్దీ పెరిగే అవకాశం ఉంది.

నీట్ పీజీ పరీక్ష సమయంలో ట్రాఫిక్ రద్దీ ఉండే కీలక ప్రాంతాలు ఏవి?

ప్యారడైజ్ సర్కిల్, తాజ్‌మహల్ జంక్షన్, కింగ్ కోఠి, బండ్లగూడలతో పాటు రేతిబౌలి, నానల్‌నగర్, దుర్గానగర్, కేఎఫ్‌సీ జంక్షన్ల మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలలో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలి.

హైదరాబాద్ మారథాన్ కారణంగా జి. నారాయణమ్మ కాలేజీకి వెళ్లే విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏవి?

బోరబండ, మధురానగర్, కల్యాణ్‌నగర్, యూసుఫ్‌గూడ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు జూబ్లీహిల్స్ మీదుగా చేరుకోవాలి. సైబరాబాద్ వైపు నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా వచ్చే వాహనదారులు రోడ్ నంబర్ 45- 51 రూట్ ఎంచుకోవాలి.

ట్రాఫిక్ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశారా?

అవును, ఏదైనా అత్యవసర ప్రయాణం లేదా సమాచారం కోసం 9010203626 అనే ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చని పోలీసులు సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Fake Transgenders Extortion: గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల అరాచకాలు - నకిలీ హిజ్రాల మాఫియా - పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు?
గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల అరాచకాలు - నకిలీ హిజ్రాల మాఫియా - పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు?
Clash at Jubilee Hills Pub: జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు
జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు
Harish Rao: గతంలో ఎంజీఆర్ నుంచి చంద్రబాబు వరకు చేసిందిదే.. కేసీఆర్ విషయంలోనూ అదే తప్పు: హరీష్ రావు
గతంలో ఎంజీఆర్ నుంచి చంద్రబాబు వరకు జరిగిందిదే.. కేసీఆర్ విషయంలోనూ అదే తప్పు: హరీష్ రావు
TRS Chief Kavitha: పరీక్ష పాసై డీజీపీ అయ్యారా? రికమండేషన్‌తో జాబ్‌లోకి వచ్చారా?- టీఆర్ఎస్ చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు
పరీక్ష పాసై డీజీపీ అయ్యారా? రికమండేషన్‌తో జాబ్‌లోకి వచ్చారా?- టీఆర్ఎస్ చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
Konda Surekha Political Future: బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం ఉండదు - బీజేపీలో ఇమడలేరు - కొండా దంపతులకు దారేది?
బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం ఉండదు - బీజేపీలో ఇమడలేరు - కొండా దంపతులకు దారేది?
Basara Temple Master Plan: రూ.354 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన
రూ.354 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన
Vangaveeti Radha: నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
Harish Rao: గతంలో ఎంజీఆర్ నుంచి చంద్రబాబు వరకు చేసిందిదే.. కేసీఆర్ విషయంలోనూ అదే తప్పు: హరీష్ రావు
గతంలో ఎంజీఆర్ నుంచి చంద్రబాబు వరకు జరిగిందిదే.. కేసీఆర్ విషయంలోనూ అదే తప్పు: హరీష్ రావు
Bigg Boss Telugu 10 House : బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
Clash at Jubilee Hills Pub: జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు
జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు
Duleep Trophy Final:  షాకింగ్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన‌ తిలక్ వర్మ .. దులీప్ ట్రోఫీ ఫైనల్లో హై ఓల్టేజ్ డ్రామా
షాకింగ్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన‌ తిలక్ వర్మ .. దులీప్ ట్రోఫీ ఫైనల్లో హై ఓల్టేజ్ డ్రామా
Embed widget