UGC NET 2021 Result: యూజీసీ నెట్ 2021 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్ ఇదే
UGC NET Result 2021 At ugcnet.nta.nic.in: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ 2021 ఎగ్జామ్ రిజల్ట్స్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంచింది.
UGC NET 2021 Result: యూజీసీ నెట్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ ఫలితాల్ని విడుదల చేసింది. అభ్యర్థులు తమ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in లో లేక nta.ac.in లో ఫలితాలు చూసుకోవాలని ఎన్‌టీఏ అధికారులు సూచించారు. డిసెంబర్ 2020, జూన్ 2021 సెషన్ పరీక్షల్ని గత ఏడాది నవంబర్ 20 నుంచి డిసెంబర్ 5 తేదీల మధ్య నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది.
యూజీసీ నెట్ 2021 ఫలితాలు చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్ Direct link to check result here
యూజీసీ నెట్ ఫలితాలు ఇలా చూసుకోండి.
Step 1: మొదటగా యూజీసీ నెట్ అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.nic.in లేక nta.ac.in ఓపెన్ చేయండి
Step 2: హోం పేజీలో ఉన్న యూజీసీ నెట్ రిజల్ట్స్ లింక్ క్లిక్ (UGC NET Results link) చేయాలి
Step 3: లాగిన్ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి
Step 4: అభ్యర్థుల ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి
Step 5: ఆ రిజల్ట్స్‌ను పీడీఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకోండి. భవిష్యత్తులో అవసరాల కోసం పీడీఎఫ్ తీసుకున్న ఫైల్ ను ప్రింట్ తీసుకోవడం బెటర్.
యూజీసీ నెట్ డిసెంబర్ 2020, జూన్ 2021లో నిర్వహించిన ఎగ్జామ్ రిజల్ట్స్ (UGC-NET December 2020 and June 2021 Result) చెక్ చేసుకునేందుకు కింది లింక్స్ మీక క్లిక్ చేయండి. అయితే అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ లాంటి వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేస్తే స్క్రీన్ మీద మీ ఫలితాలు కనిపిస్తాయి.
సర్వర్ 1 లింక్
సర్వర్ 2 లింక్
రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు అర్హత సాధించాలంటే ప్రతి పేపర్‌లో 35 శాతం మార్కులు తెచ్చుకోవాలి. అన్ రిజర్వ్‌డ్ అభ్యర్థులకు ప్రతి పేపర్‌లో 40 శాతం మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు. యూజీసీ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణ సాధించిన వారు అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిష్ (Junior Research Fellowship) కోసం అర్హులు అవుతారు.
నేషనల్ ఫెలోషిప్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టూడెంట్స్ (NFSC)
నేషనల్ ఫెలోషిప్ ఫర్ అదర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (NFOBC)
మౌలానా అజాద్ నేషనల్ ఫెలోషిప్ ఫర్ మైనారిటీ స్టూడెంట్స్ (MANF)కు ఎలిజిబిలిటీ సాధిస్తారు.
Also Read: ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్.. సిబ్బంది కొరత మాటే రాకూడదంటూ హెచ్చరిక