అన్వేషించండి

DSC Free Coaching: ఎస్సీ స్టడీ సర్కిల్‌లో 'డీఎస్సీ' అభ్యర్థులకు ఉచిత శిక్షణ, ఎంపిక ఇలా

DSC Free Training: తెలంగాణలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులకు 2నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. అభ్యర్థులు మార్చి 12 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Free Training For DSC Candidates: తెలంగాణలో ఇటీవల 11,062 ఖాళీలతో మెగా డీఎస్సీ/టీఆర్‌టీ (టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్) నోటిఫికేషన్ వెలువడని సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు హైదరాబాద్‌లోని రాష్ట్ర షెడ్యూల్డ్‌కులాల స్డడీ సర్కిల్‌ శనివారం (మార్చి 9న) ఒక ప్రకటనలో తెలిపింది. ఎంపికైనవారికి ఏప్రిల్‌15 నుంచి జూన్‌14 వరకు 2 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 12 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ డైట్‌, బీఈడీకాలేజీలు ఉన్న కేంద్రాలతో పాటు ఎంపిక చేసిన ఇతర కళాశాలతో కలిపి మొత్తం 16 ప్రాంతాల్లో, ప్రతి కేంద్రానికి 100 మందికి చొప్పున ఉచితశిక్షణ ఇవ్వనున్నారు. అభ్యర్థులు డైట్(DIET) లేదా టెట్‌(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు మార్చి 11 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

వివరాలు..

* తెలంగాణ డీఎస్సీ-2024 ఉచిత శిక్షణ

శిక్షణ కాలం: 2 నెలలపాటు శిక్షణ ఉంటుంది.

అర్హత: డిగ్రీతోపాటు అభ్యర్థులు డైట్(DIET) లేదా టెట్‌(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ వర్గానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.

శిక్షణ కేంద్రాలు: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డైట్‌, బీఈడీకాలేజీలు ఉన్న కేంద్రాలతో పాటు ఎంపిక చేసిన ఇతర కళాశాలతో కలిపి మొత్తం 16 ప్రాంతాల్లో శిక్షణ నిర్వహిస్తారు.

సీట్ల సంఖ్య: ఒక్కో కేంద్రంలో 100 సీట్ల చొప్పున మొత్తం 1600 మందికి శిక్షణ ఇస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. 

ముఖ్యమైన తేదీలు..

➥ ప్రవేశ ప్రకటన: 09.03.2024.

➥ ప్రవేశ వివరాలు అందుబాటులో: 11.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 26.03.2024.

➥  శిక్షణ కాలం: 15.04.2024 - 14.06.2024.

Website

తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న 'మెగా డీఎస్సీ-2024' నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్‌ 2లోపు నిర్ణీత ఫీజు చెల్లించి, మార్చి 3న రాత్రి 11.50లోపు దరఖాస్తులు సమర్పించాాలి. దరఖాస్తు ఫీజు కింద అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసిన వాళ్లు ఆయా పోస్టులకు మళ్లీ కొత్తగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదు. పరీక్షల తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. గరిష్ఠ వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచడం, అదనంగా పోస్టులను చేర్చడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణ డీఎస్సీ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

సీటెట్‌ (జులై) - 2024 నోటిఫికేషన్‌ విడుదల, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - పరీక్ష వివరాలు ఇలా
సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (సీటెట్)- జులై 2024 నోటిఫికేషన్‌‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) మార్చి 7న విడుదల చేసింది. అదేసమయంలో సీటెట్ దరఖాస్తు ప్రక్రియను మార్చి 7న ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఒక్క పేపర్‌కు అయితే రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500), రెండు పేపర్లకు అయితే రూ.1200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500) చెల్లించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నవారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ప్రతి ఏడాది రెండుసార్లు (జులై, డిసెంబరు) జాతీయ స్థాయిలో ఈ పరీక్షను సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. 
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ సంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget