TSRJC CET - 2024 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
TSRJC CET-2024: తెలంగాణలోని 35 సాధారణ గురుకులాల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న TSRJC CET 2024 దరఖాస్తు గడువును మార్చి 31 వరకు పొడిగించారు.
TSRJC Common Entrance Test - 2024 Application: తెలంగాణలోని 35 సాధారణ గురుకులాల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న TSRJC CET 2024 దరఖాస్తు గడువును మార్చి 31 వరకు పొడిగించారు. వాస్తవానికి మార్చి 16తో గడువు ముగియనుంది. అయితే విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు మరో రెండు వారాలపాటు పొడిగించినట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి రమణకుమార్ మార్చి 15న ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 60 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు గడువును పెంచడంతో మరింత మందికి దరఖాస్తుకు అవకాశం లభించినట్లయింది.
గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024–25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్ఆర్జేసీ సెట్–2024 (TSRJC CET-2024) నోటిఫికేషన్ను జనవరి 25న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జనవరి 31 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 20 గురుకుల జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో జరిగే 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్ 21న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో చేరేందుకు అర్హులు. ప్రవేశ పరీక్షలో మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. మే నెలలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
వివరాలు..
* టీఎస్ఆర్జేసీ సెట్–2024
గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ.
సీట్లసంఖ్య: 2,996.
సీట్ల కేటాయింపు: ఎంపీసీ - 1,496, బైపీసీ - 1,440, ఎంఈసీ - 60.
అర్హత: ఈ ఏడాది మార్చిలో జరిగే 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.200.
ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ర్యాంకు, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష విధానం: టీఎస్ఆర్జేసీ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మల్టీపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. విద్యార్థులు ఎంచుకునే గ్రూప్ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలడుగుతారు. ఎంపీసీ విద్యార్థులకు ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్ నుంచి; బైపీసీ విద్యార్థులకు ఇంగ్లిష్, బయోలజికల్ సైన్స్, ఫిజిక్స్ నుంచి అదేవిధంగా ఎంఈసీ గ్రూప్లో చేరేవారికి ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్ సబ్జెక్టుల నుంచి పదోతరగతి స్థాయిలో ఒక్కోసబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు.
పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 31.01.2024.
* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 16.03.2023. (31.03.2023 వరకు పొడిగించారు)
* ప్రవేశ పరీక్ష తేది: 21.04.2023.
* మొదటి విడత కౌన్సెలింగ్: మే 2024లో.
పరీక్ష సమయం: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.