News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TS Polycet Counselling: పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం, 18 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం!

షెడ్యూలు ప్రకారం జూన్ 14న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 18 వరకు కొనసాగనుంది. అభ్యర్థులు నిర్ణీత ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి.. ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

FOLLOW US: 
Share:

తెలంగాణలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 14న ప్రారంభమైంది. షెడ్యూలు ప్రకారం జూన్ 14న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 18 వరకు కొనసాగనుంది. పాలిసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు నిర్ణీత ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి.. ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 16 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభంకానుంది. జూన్ 16 నుంచి 21 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జూన్ 25న సీట్లను కేటాయించనున్నారు. 

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 చెల్లిస్తే సరిపోతుంది.  సీట్లు పొందిన విద్యార్థులకు జూన్ 25 నుంచి 29 మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు జులై 7 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. జులై 7 నుంచి 14 వరకు ఓరియంటేషన తరగతులు, జులై 15 నుంచి క్లాస్ వర్క్ ప్రారంభంకానుంది. 

Counselling Notification

Counselling Website

ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ ఇలా..

➥ కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు: 14.06.2023 - 18.06.2023.

➥ ధ్రువపత్రాల పరిశీలన: 16.06.2023 - 19.06.2023.

➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 16.06.2023 - 21.06.2023.

➥ వెబ్‌ఆప్షన్ల ఫ్రీజింగ్: 21.06.2023.

➥ సీట్ల కేటాయింపు: 25.06.2023.

➥ కళాశాలలో రిపోర్టింగ్: 25.06.2023 - 29.06.2023.

➥ అకడమిక్ సెషన్ ప్రారంభం: 07.07.2023.

తుది విడత కౌన్సెలింగ్ ఇలా..

➥ కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు: 01.07.2023.

➥ ధ్రువపత్రాల పరిశీలన: 02.07.2023.

➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 01.07.2023 - 01.07.2023.

➥ వెబ్‌ఆప్షన్ల ఫ్రీజింగ్: 03.07.2023.

➥ సీట్ల కేటాయింపు: 07.07.2023.

➥ కళాశాలలో రిపోర్టింగ్: 07.07.2023 - 10.07.2023.

➥ తరగతుల ప్రారంభం: 07.07.2023.

➥ ఓరియంటేషన్ తరగతులు: 07.07.2023 - 14.07.2023.

➥ పూర్తిస్థాయి తరగతులు ప్రారంభం: 15.07.2023.

స్పాట్ అడ్మిషన్లు..

➥ నోటిఫికేషన్: 07.07.2023.

➥ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ల అప్‌లోడ్: 08.07.2023 -  09.07.2023.

➥ ర్యాంక్ జనరేషన్: 10.07.2023.

➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 08.07.2023 - 11.07.2023.

➥ వెబ్‌ఆప్షన్ల ఫ్రీజింగ్: 11.07.2023.

➥ సీట్ల కేటాయింపు: 14.07.2023.

➥ ఫీజు చెల్లింపు, కళాశాలలో రిపోర్టింగ్: 14.07.2023 - 15.07.2023.

➥ కళాశాలలు స్పాట్ కౌన్సెలింగ్ పూర్తిచేయడానికి చివరితేది: 17.07.2023.

ఈ సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోండి..

ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించిన అభ్యర్థులు దగ్గరలోని హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం హాజరుకాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతోపాటు రెండు జతల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తమ తీసుకెళ్లా్ల్సి ఉంటుంది.

➥ పాలిసెట్ హాల్‌టికెట్

➥ పాలిసెట్ ర్యాంకు కార్డు

➥ ఆధార్ కార్డు

➥ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు రసీదు

➥ పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతల మార్కుల మెమో (ఒరిజినల్/ఇంటర్నెట్ కాపీ)

➥ 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు.

➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (2023-24) మీసేవా నుంచి పొంది ఉండాలి. 

➥ 01.01.2023 తర్వాత పొందిన ఆధాయ ధ్రువీకరణ పత్రం ఉండాలి. ఇది ఉంటేనే ఫీజు రీయింబెర్స్‌మెంట్ పొందడానికి అర్హులు.

➥ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.

➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ).

➥ రెసిడెన్స్ సర్టిఫికేట్ 

➥ అవసరమైన అభ్యర్థులకు పీహెచ్ (PH)/క్యాప్(CAP)/ఎన్‌సీసీ)(NCC)/స్పోర్ట్స్(Sports)/స్కౌట్స్ & గైడ్స్(Scouts & Guides)/ మైనారిటీ (Minority)/ ఆంగ్లో ఇండియన్ (Anglo-Indian) సర్టిఫికేట్లు అవసరం అవుతాయి. నిబంధనల ప్రకారం ఆయా సర్టిఫికేట్లు ఉండాలి. 

ALso Read:

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 18న నోటిఫికేషన్‌, ఇతర తేదీలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి జూన్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో అన్‌లైన్‌ విధానంలో ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. విద్యార్థులు ప్రవేశాల కోసం జూన్ 19 నుండి 24 వరకు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇక జూన్ 21 నుండి 23 వరకు స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన చేపడతారు. తదనంతరం జూన్ 26 నుండి 30 వరకు వెబ్‌ అప్షన్లకు అవకాశం కల్పిస్తారు. వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు జులై 3న  సీట్లను కేటాయిస్తారు. డిగ్రీ కళాశాలల్లో జులై 4 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 15 Jun 2023 11:06 AM (IST) Tags: Education News in Telugu TS Polycet 2023 Counselling TS Polycet 2023 Counselling Schedule TS Polycet 2023 Counselling Dates

ఇవి కూడా చూడండి

UGC NET 2023: యూజీసీనెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?

UGC NET 2023: యూజీసీనెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?

Merit Scholarship: వెబ్‌సైట్‌లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష హాల్‌టికెట్లు, ఎగ్జామ్ ఎప్పుడంటే?

Merit Scholarship: వెబ్‌సైట్‌లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష హాల్‌టికెట్లు, ఎగ్జామ్ ఎప్పుడంటే?

TS Polytechnic Syllabus: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో సరికొత్త సిలబస్‌, వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి

TS Polytechnic Syllabus: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో సరికొత్త సిలబస్‌, వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి

CBSE: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కులపై బోర్డు కీలక నిర్ణయం, ఇకపై అవి ఉండవు

CBSE: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కులపై బోర్డు కీలక నిర్ణయం, ఇకపై అవి ఉండవు

LAWCET: లాసెట్‌ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు

LAWCET: లాసెట్‌ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత