POLYCET: పాలిసెట్ మొదటి విడతలో 21,367 విద్యార్థులకు సీట్ల కేటాయింపు!
తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. మొత్తం 21,367 మంది అభ్యర్థులకు సీట్లను కేటాయించారు.
తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. మొత్తం 116 కళాశాలల్లో 29,396 సీట్లకు గాను 21,367 సీట్లను భర్తీ చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో 87.44 శాతం, ప్రైవేటు కళాశాలల్లో 60.46 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సైబర్ సెక్యూరిటీ డిప్లొమా కోర్సుకు సంబంధించి మొత్తం సీట్లు భర్తీ కాగా, జౌళి సాంకేతిక డిప్లొమా కోర్సులో 64 సీట్లకు గాను కేవలం 9 మంది విద్యార్థులే చేరారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంకా 1,673; ప్రెవేటు కళాశాలల్లో 6,356 చొప్పున మొత్తం 8,029 సీట్లు ఖాళీగా ఉన్నాయని పాలిసెట్ కన్వీనర్ తెలిపారు. ఎన్‌సీసీ, క్రీడల కోటా సీట్లను తుది విడత కౌన్సెలింగ్ అనంతరం కేటాయిస్తామని సీట్లు పొందిన విద్యార్థులు జులై 7 నుంచి 10 వరకు తమ కేటాయించిన కళాశాలల్లో చేరాలని, చేరని వారి సీట్లను రద్దుచేస్తామని తెలిపారు. కళాశాలల్లో జులై 7 నుంచి 14 వరకు పునశ్చరణ జరుగుతుందని, 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు.
College-wise Allotment Details
తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 14న ప్రారంభమైన సంగతి తెలిసిందే. షెడ్యూలు ప్రకారం జూన్ 14న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 18 వరకు కొనసాగింది. పాలిసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు నిర్ణీత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి.. ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. జూన్ 16 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. జూన్ 16 నుంచి 21 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్నారు. వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జూన్ 25న సీట్లను కేటాయించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 చెల్లిస్తే సరిపోతుంది. సీట్లు పొందిన విద్యార్థులకు జూన్ 25 నుంచి 29 మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు జులై 7 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. జులై 7 నుంచి 14 వరకు ఓరియంటేషన తరగతులు, జులై 15 నుంచి క్లాస్ వర్క్ ప్రారంభంకానుంది.
జులై 1 నుంచి రెండోవిడత కౌన్సెలింగ్...
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 1 నుంచి ప్రారంభంకానుంది. షెడ్యూలు ప్రకారం జులై 1న ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు నిర్ణీత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి.. ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులకు జులై 2న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. జులై 1 నుంచి 3వరకు వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జులై 7న సీట్లను కేటాయించనున్నారు.
స్పాట్ అడ్మిషన్లు ఎప్పుడంటే?
రెండో విడత కౌన్సెలింగ్ ముగిసన తర్వాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రకటన జులై 7న విడుదల చేయనున్నారు. అభ్యర్థులు జులై 8,9 తేదీల్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వీరికి జులై 10న ర్యాంకులు కేటాయిస్తారు. జులై 10 నుంచి 11 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జులై 14న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందినవారు జులై 14, 15 తేదీల్లో సంబంధిత కళాశాలల్లో ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ ఇలా..
➥ కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు: 14.06.2023 - 18.06.2023.
➥ ధ్రువపత్రాల పరిశీలన: 16.06.2023 - 19.06.2023.
➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 16.06.2023 - 21.06.2023.
➥ వెబ్‌ఆప్షన్ల ఫ్రీజింగ్: 21.06.2023.
➥ సీట్ల కేటాయింపు: 25.06.2023.
➥ కళాశాలలో రిపోర్టింగ్: 25.06.2023 - 29.06.2023.
➥ అకడమిక్ సెషన్ ప్రారంభం: 07.07.2023.
తుది విడత కౌన్సెలింగ్ ఇలా..
➥ కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు: 01.07.2023.
➥ ధ్రువపత్రాల పరిశీలన: 02.07.2023.
➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 01.07.2023 - 01.07.2023.
➥ వెబ్‌ఆప్షన్ల ఫ్రీజింగ్: 03.07.2023.
➥ సీట్ల కేటాయింపు: 07.07.2023.
➥ కళాశాలలో రిపోర్టింగ్: 07.07.2023 - 10.07.2023.
➥ తరగతుల ప్రారంభం: 07.07.2023.
➥ ఓరియంటేషన్ తరగతులు: 07.07.2023 - 14.07.2023.
➥ పూర్తిస్థాయి తరగతులు ప్రారంభం: 15.07.2023.
స్పాట్ అడ్మిషన్లు..
➥ నోటిఫికేషన్: 07.07.2023.
➥ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ల అప్‌లోడ్: 08.07.2023 - 09.07.2023.
➥ ర్యాంక్ జనరేషన్: 10.07.2023.
➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 08.07.2023 - 11.07.2023.
➥ వెబ్‌ఆప్షన్ల ఫ్రీజింగ్: 11.07.2023.
➥ సీట్ల కేటాయింపు: 14.07.2023.
➥ ఫీజు చెల్లింపు, కళాశాలలో రిపోర్టింగ్: 14.07.2023 - 15.07.2023.
➥ కళాశాలలు స్పాట్ కౌన్సెలింగ్ పూర్తిచేయడానికి చివరితేది: 17.07.2023.
ఈ సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోండి..
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించిన అభ్యర్థులు దగ్గరలోని హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం హాజరుకాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతోపాటు రెండు జతల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తమ తీసుకెళ్లా్ల్సి ఉంటుంది.
➥ పాలిసెట్ హాల్‌టికెట్
➥ పాలిసెట్ ర్యాంకు కార్డు
➥ ఆధార్ కార్డు
➥ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు రసీదు
➥ పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతల మార్కుల మెమో (ఒరిజినల్/ఇంటర్నెట్ కాపీ)
➥ 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు.
➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (2023-24) మీసేవా నుంచి పొంది ఉండాలి.
➥ 01.01.2023 తర్వాత పొందిన ఆధాయ ధ్రువీకరణ పత్రం ఉండాలి. ఇది ఉంటేనే ఫీజు రీయింబెర్స్‌మెంట్ పొందడానికి అర్హులు.
➥ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.
➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ).
➥ రెసిడెన్స్ సర్టిఫికేట్
➥ అవసరమైన అభ్యర్థులకు పీహెచ్ (PH)/క్యాప్(CAP)/ఎన్‌సీసీ)(NCC)/స్పోర్ట్స్(Sports)/స్కౌట్స్ & గైడ్స్(Scouts & Guides)/ మైనారిటీ (Minority)/ ఆంగ్లో ఇండియన్ (Anglo-Indian) సర్టిఫికేట్లు అవసరం అవుతాయి. నిబంధనల ప్రకారం ఆయా సర్టిఫికేట్లు ఉండాలి.