అన్వేషించండి

TS PECET - 2024: టీఎస్ పీఈసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

టీఎస్‌లోని బీపీఎడ్‌, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ పీఈసెట్-2024 దరఖాస్తు గడువును మే 25 వరకు పొడిగించారు. ఆల‌స్య రుసుముతో మే 31 వ‌ర‌కు దరఖాస్తులు సమర్పించవచ్చు.

TS PECET - 2024: తెలంగాణలోని వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ పీఈసెట్- 2024 నోటిఫికేషన్ మార్చి 12న విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా బీపీఎడ్‌(B.PEd), డీపీఎడ్(D.PEd) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 14న ప్రారంభమైంది. అయితే దరఖాస్తు గడువు మే 15తో ముగియాల్సి ఉండగా.. మే 25 వరకు పొడిగించారు. ఇక రూ.500 ఆల‌స్య రుసుముతో మే 31 వ‌ర‌కు దరఖాస్తులు సమర్పించవచ్చు.  జూన్ 05 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 10 నుంచి 13 వరకు ఫిజిక‌ల్ టెస్టులు, స్కిల్ టెస్టులు నిర్వహించ‌నున్నారు. జూన్ నాలుగో వారంలో ఫ‌లితాల‌ు విడుద‌ల చేయ‌నున్నారు. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థుల నుంచి రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఏడాది టీఎస్ పీఈసెట్‌ను శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ నిర్వ‌హించనుంది. పీఈసెట్ ద్వారా రాష్ట్రంలోని 16 బీపీఎడ్ కాలేజీల్లో 1660 సీట్లు, నాలుగు డీపీఎడ్ కాలేజీల్లో 350 సీట్లను భర్తీ చేయనున్నారు.  

వివరాలు...

* టీఎస్‌పీఈసెట్ (TS PECET)- 2024 

⫸ బీపీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్)

⫸ డీపీఈడీ (డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్)

అర్హతలు..

➥ బీపీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సుకు ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

➥ డీపీఈడీ (డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సుకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

వయోపరిమితి..

➥ బీపీఈడీ కోర్సుకు అభ్యర్థుల వయసు 2024, జులై 1 నాటికి 19 సంవత్సరాలు నిండి ఉండాలి.

➥ డీపీఈడీ కోర్సుకు అభ్యర్థుల వయసు 2024, జులై 1 నాటికి 16 సంవత్సరాలు నిండి ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.900. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (PET), స్కిల్ టెస్ట్ (Skill Test) ఆధారంగా.

ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ విధానం..

➥  మొత్తం 400 మార్కులకు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (PET) నిర్వహిస్తారు. ఇందులో మొత్తం నాలుగు ఈవెంట్లు ఉంటాయి. ఒక్కో ఈవెంట్‌కు 100 మార్కులు కేటాయించారు.

➥ వీటిలో పురుషులకు 100 మీటర్ల పరుగు-100 మార్కులు, 800 మీటర్ల పరుగు-100 మార్కులు, షాట్‌పుట్(6 కేజీలు)-100 మార్కులు, లాంగ్ జంప్/హైజంప్-100 మార్కులు ఉంటాయి.

➥ ఇక మహళలకు 100 మీటర్ల పరుగు-100 మార్కులు, 400 మీటర్ల పరుగు-100 మార్కులు, షాట్‌పుట్(4 కేజీలు)-100 మార్కులు, లాంగ్ జంప్/హైజంప్-100 మార్కులు ఉంటాయి.

➥ గర్భిణీ స్త్రీలు అనర్హులు.

స్కిల్ టెస్ట్ (Skill Test) ఇలా..

ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కింది స్పోర్ట్స్ విభాగాల్లో నైపుణ్యాలు పరీక్షిస్తారు. 

అవి: బాల్ బ్యాడ్మిండన్, బాస్కెట్ బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్, వాలీబాల్.

Scheme of Examination

ముఖ్యమైన తేదీలు..

➥ పీఈసెట్ -2024 నోటిఫికేషన్ వెల్లడి: 12.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.05.2024.

➥ రూ.500 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.05.2024.

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 05.06.2024 నుంచి.

➥ పరీక్షల నిర్వహణ: జూన్ 10 నుంచి 13 వ‌ర‌కు.

Notification

 Application Fee Payment

 Check your Payment Status

 Application Form

Print Your Filled in Application Form

WEBSITE

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Embed widget