By: ABP Desam | Updated at : 16 Apr 2023 12:04 AM (IST)
Edited By: omeprakash
మోడల్ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామ్
తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) ప్రవేశాలకు ఆదివారం (ఏప్రిల్ 15) ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. 6వ తరగతి నుంచి 10వ తరగతుల వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 194 స్కూళ్లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆయా పాఠశాలల్లో 6వ తరగతిలో 19,400 సీట్లకుగాను 40,137 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 7 నుంచి 10 తరగతులకు కూడా భారీగానే దరఖాస్తులు వచ్చాయి.
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. 6వ తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థులకు ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
మే 24న ఫలితాలు..
ఇక మే 24న మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు. మెరిట్ జాబితాలో ఉన్న విద్యార్థులకు మే 25 నుంచి 31 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నారు. హాల్‌టికెట్లు సహా ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే 040 -23120335, 23120336 నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
ఈ పరీక్షల కోసం జనవరి 10 నుంచి మార్చి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 70,041 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు తమ రిఫరెన్స్ ఐడీ/ పేరు/ మొబైల్ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Also Read:
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!
తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ క్యాలెండర్‌ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలు జూన్ 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు ఏప్రిల్ 1న వెల్లడించారు. జూన్ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, 2024, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల-పరీక్ష ఎప్పుడంటే?
ఎన్‌డీఏ, ఎస్‌ఎస్‌బీ తదితర సైనిక దళాల్లో అధికారుల నియామకాల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ సైనిక పాఠశాలను బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. పాఠశాలలో సైనిక శిక్షణే ప్రధానాంశంగా ఉంటుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)... 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో బాలుర సైనిక స్కూల్ ఆరో తరగతి (సీబీఎస్‌ఈ సిలబస్), ఇంటర్మీడియట్(ఎంపీసీ- సీబీఎస్ఈ సిలబస్)లో ప్రవేశాలకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే!
ఏపీలోని కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయం బాలికల ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 352 కేజీబీవీ పాఠశాలల్లో 2023 - 2024 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి, ఇంటర్మీడియట్‌తో పాటు 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన బ్యాక్‌లాగ్ సీట్లలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సరైన అర్హతలు గల బాలికలు ఏప్రిల్ 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలోని కేజీవీబి పాఠశాలల్లో దాదాపు 8600 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తారు. అడ్మిషన్లు పొందిన వారి వివరాలను అయా పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో ప్రదర్శిస్తారు.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..
AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ఎంపిక ఇలా!
AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!
VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!
CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్ షీట్స్ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?
CMAT Result 2023: సీమ్యాట్-2023 ఫలితాలు విడుదల, స్కోరు కార్డు ఇలా పొందండి!
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Coromandel Express Accident: రాంగ్ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్
Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్