News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TS ICET: ఐసెట్ చివరివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం - అందుబాటులో 10,762 సీట్లు

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం (సెప్టెంబరు 22) నుంచి ప్రారంభంకానుంది.

FOLLOW US: 
Share:

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం (సెప్టెంబరు 22) నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. కౌన్సెలింగ్‌లో పాల్గొనదలచినవారు ఐసెట్ హాల్‌టికెట్, ర్యాంకు కార్డు, ఆధార్ కార్డు, విద్యార్హతకు సంబంధించిన అన్ని సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఇతర అవసరమైన అన్ని ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మొదటి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనలేకపోయినవారికి సెప్టెంబరు 22న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. అభ్యర్థులకు సెప్టెంబరు 23న ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినవారికి సెప్టెంబరు 22 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. వీరికి సెప్టెంబరు 28న సీట్లను కేటాయిస్తారు.

సీట్లు పొందినవారు సెప్టెంబరు 28 నుంచి 30 లోపు నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించి, సంబంధిత కళాశాలకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సెప్టెంబరు 29, 30 తేదీల్లో నేరుగా కళాశాలకు వెళ్లి మరోమారు ధ్రువపత్రాల పరిశీలన చేయించుకొని సీటు కేటాయింపును నిర్దారించుకోవాలి. ఇక సెప్టెంబర్ 29న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. 
 
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 26, 27 తేదీల్లో నిర్వహించిన 'టీఎస్ ఐసెట్‌-2023' పరీక్ష ఫలితాలు జూన్ 29న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రవేశపరీక్షలో మొత్తం 61,092 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సెప్టెంబరు 6న ఐసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకాగా..  సెప్టెంబ‌రు 15న‌ సీట్లను కేటాయించారు. ఎంబీఏలో 87.33 శాతం కన్వీనర్‌ కోటా సీట్లు భర్తీకాగా, ఎంసీఏలో అన్ని సీట్లు నిండాయి. ఐసెట్‌లో 61,092 మంది ఉత్తీర్ణులుకాగా.. ధ్రువపత్రాల పరిశీలనకు కేవలం 31,552 మందే హాజరయ్యారు.

ఎంబీఏలో 24,029 సీట్లకు 20,985, ఎంసీఏలో 3,009 సీట్లకు అన్నీ భర్తీ అయ్యాయి. వాటిల్లో 902 మంది ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద సీట్లు పొందారు. మొత్తం 255 కళాశాలల్లో 80 చోట్ల అన్నీ సీట్లు నిండాయి. సీట్లు పొందిన వారు సెప్టెంబ‌రు 20వ తేదీలోపు ఫీజు చెల్లించి, 29, 30 తేదీల్లో కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలని అధికారులు సూచించారు. ఐసెట్ చివరి విడత కౌన్సెలింగ్‌కు 10,762 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 729 ఎంసీఏ, మిగిలినవి ఎంబీఏ సీట్లు. 

తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్: 22.09.2023.

➥ స్లాట్ బుకింగ్ చేసుకున్నవారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్: 23.09.2023.

➥ వెబ్ ఆప్షన్ల నమోదు: 22.09.2023 - 24.09.2023.

➥ ఫ్రీజింగ్ ఆప్షన్లు: 24.09.2023.

➥ సీట్ల కేటాయింపు: 28.09.2023.

➥ ట్యూషన్ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: 28.09.2023 - 30.09.2023.

➥ సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 29.09.2023 - 30.09.2023.

Counselling Website

ALSO READ:

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు, సీట్ల వివరాలు ఇలా!
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, అహ్మదాబాద్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోంలో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సు, వివరాలు ఇలా
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల మాస్టర్ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అహ్మదాబాద్‌, బెంగళూరు, గాంధీనగర్‌‌లో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 22 Sep 2023 11:28 AM (IST) Tags: Education News in Telugu TS ICET Counselling TS ICET 2023 Final Counselling TS ICET 2023 Final Counselling Schedule TS ICET 2023 Final Counselling dates

ఇవి కూడా చూడండి

CLAT Answer Key: క్లాట్-2024 ఫైనల్ ఆన్సర్ 'కీ' విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

CLAT Answer Key: క్లాట్-2024 ఫైనల్ ఆన్సర్ 'కీ' విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

JEE Main 2024: జేఈఈ మెయిన్-2024 తొలిదశకు 12.30 లక్షల దరఖాస్తులు, తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నంటే?

JEE Main 2024: జేఈఈ మెయిన్-2024 తొలిదశకు 12.30 లక్షల దరఖాస్తులు, తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నంటే?

AP Tenth: 'టెన్త్‌' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!

AP Tenth: 'టెన్త్‌' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!

TS SET: టీఎస్‌ సెట్‌ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

TS SET: టీఎస్‌ సెట్‌ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే

GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే

టాప్ స్టోరీస్

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం