అన్వేషించండి

TS ICET Answer Key: 'టీఎస్ ఐసెట్-2023' ప్రిలిమినరీ 'కీ' విడుద‌ల‌! అభ్యంతరాలకు అవకాశం!

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 26, 27 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐసెట్ పరీక్షకు సంబంధించిన ప్రాథ‌మిక కీని జూన్ 5న విడుద‌ల చేశారు.

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 26, 27 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐసెట్ పరీక్షకు సంబంధించిన ప్రాథ‌మిక కీని జూన్ 5న విడుద‌ల చేశారు. ప్రాథ‌మిక కీపై జూన్ 8 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంత‌రాల‌ను స్వీకరించనున్నారు. ఆన్సర్ కీతోపాటు పరీక్ష ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇక  ఐసెట్ ఫ‌లితాల‌ను జూన్ 20న విడుద‌ల చేయ‌నున్నారు. 

Key Objections format

Download Response Sheets

Preliminary Question Papers

ఈ ఏడాది మే 26, 27 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహించిన ఐసెట్ పరీక్షలకు 75,925 మంది దరఖాస్తు చేసుకోగా.. 70,900 మంది విద్యార్థులు హాజరయ్యారు. అభ్యర్థులు ప్రాథ‌మిక కీపై అభ్యంత‌రాల‌ను convener.icet@tsche.ac.in మెయిల్ ద్వారా స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఇక క్వశ్చన్ పేర్, రెస్సాన్స్ షీట్లను icet.tsche.ac.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 26, 27 తేదీల్లో రెండు సెషన్లలో టీఎస్ ఐసెట్-2023 పరీక్ష నిర్వహించారు. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ఆన్‌లైన్ విధానంలో ఐసెట్ పరీక్ష నిర్వహించారు. 

తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌ పరీక్ష హాల్‌టికెట్లను తెలంగాణ ఉన్నత విద్యామండలి మే 22న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఐసెట్ నిర్వహణ బాధ్యతను చేపట్టిన సంగతి తెలిసిందే. 

పరీక్ష ఇలా జరిగింది..
మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-సి: కమ్యూనికేషన్  ఎబిలిటీ-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి.

ICET - ఈ కోర్సులతో ఉత్తమ భవిత:

ఎంసీఏ:
ఐటీ రంగంలో స్థిరపడాలనుకునేవారికి ఎంసీఏ సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇందుకు మ్యాథ్స్ పై పట్టు ప్రాక్టికల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నవారు ఈ రంగాన్నే ఎంచుకోవచ్చు. ఇందులో ఎక్కువ టెక్నాలజీతో పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి టెక్నాలజీలో వస్తున్న మార్పులకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ దానిపై అవగాహన అధ్యయనం చేయగలగాలి. ప్రస్తుతం మార్కెట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయి. ఎంసీఏ పూర్తి చేసుకున్న వారికి ప్రధానంగా ఉపాధి కల్పించేది సాఫ్ట్ వేర్ రంగమే. ఈ కోర్స్ లో చేరినప్పటి నుంచే ప్రోగ్రామింగ్, నైపుణ్యాలపై దృష్టి సారించాలి. ఈ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి.

జాబ్ మార్కెట్లో బీటెక్‌తో పోటీ పడాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా కావల్సిన నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తూ సైన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ,బ్లాక్ ఛైన్ టెక్నాలజీ, ఆటోమేషన్, రోబోటిక్స్ తదితర టెక్నాలజీల ముందు వరుసలో నిలుస్తాయి. పరిశ్రమలకు అనుగుణంగా ఆర్ ప్రోగ్రామింగ్ సేల్స్ ఫోర్స్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, యాప్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ వంటి కోర్సుల్లో ప్రావీణ్యం అవసరం. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికైతే మంచి జీతంతో పాటు చక్కటి కెరీర్ను పొందవచ్చు.

ఎంబీఏ:
నేటి యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్న కోర్సుల్లో ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్) మొదటి మూడు స్థానాల్లో కచ్చితంగా ఉంటుంది. ఈ కోర్సు చేయడం వల్ల కార్పొరేట్ రంగంలోని కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రంగంపై ఆసక్తితో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్నవారు ఇందులో త్వరగా రాణిస్తారు. బిజినెస్ స్కిల్స్, టీం మేనేజ్‌మెంట్, టీమ్ లీడింగ్ సామర్థ్యం, ప్రణాళిక, భవిష్యత్ పరిణామాలను అంచనా వేయడం, గ్రూప్ డిస్కషన్ పనితీరును మెరుగు పరిచే ఎలా తీర్చిదిద్దడం, సమస్యలు వచ్చినప్పుడు కారణాలు అన్వేషించి, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉన్నవారు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. ఎంబీఏ పూర్తి చేసిన వారు బిజినెస్ మేనేజర్లు, సీఈఓ, అంతేకాకుండా ఎంటర్ప్రెన్యూర్ గా మారవచ్చు.

ఎంబీఏలో మార్కెటింగ్, హెచ్ఆర్ ,ఫైనాన్స్ తదితర స్పెషలైజేషన్లు ఉంటాయి. ఈ కోర్సు రాణించాలంటే కేస్ స్టడీలను పరిశీలించాలి. అంతేకాకుండా మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లిష్ భాషపై పట్టు మెరుగుపరుచుకోవాలి. అంతేకాకుండా ఎంచుకున్న స్పెషలైజేషన్‌పై ప్రత్యేక ప్రావీణ్యం సంతరించుకోవడంతో పాటు, ప్రాజెక్ట్‌వర్క్ చేయాలి. కార్పొరేట్ రంగంలో ఎందుకు వ్యక్తిగత చొరవ కూడా ఉండాలి.

ప్రతి సంవత్సరం ఎంబీఏ పూర్తి చేసుకొని పెద్ద సంఖ్యలో బయటికి వస్తున్నారు. ఉద్యోగాలు మాత్రం కొందరికే లభిస్తున్నాయి. ఎందుకంటే దీని సరిపడా నైపుణ్యాలు కొంతమంది లోనే ఉంటున్నాయి. కాబట్టి అలా నేర్చుకునే వారికి న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. అలా నేర్చుకున్నవారికి బ్యాంకింగ్, ఫార్మ్, అగ్రికల్చర్, ఇన్సూరెన్స్ ,హెల్త్, ఎఫ్ఎంసీజీ వంటి రంగాల్లో వివిధ స్థాయిల్లో అవకాశాలు లభిస్తాయి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Weather: తెలంగాణలో జలవిలయం: మూసీ మహోగ్రరూపం.. నీట మునిగిన ఎంజీబీఎస్‌ రాష్ట్రంలో రెడ్ అలర్ట్!
తెలంగాణలో జలవిలయం: మూసీ మహోగ్రరూపం.. నీట మునిగిన ఎంజీబీఎస్‌ రాష్ట్రంలో రెడ్ అలర్ట్!
Asia Cup 2025 Ind Vs SL Result Update: టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. సూప‌ర్ ఓవ‌ర్లో గ‌ట్టెక్కిన భార‌త్.. స్కోర్లు స‌మం కావ‌డంతో టైగా ముగిసిన మ్యాచ్.. రాణించిన అభిషేక్, తిల‌క్, నిసాంక‌, పెరీరా
టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. సూప‌ర్ ఓవ‌ర్లో గ‌ట్టెక్కిన భార‌త్.. స్కోర్లు స‌మం కావ‌డంతో టైగా ముగిసిన మ్యాచ్.. రాణించిన అభిషేక్, తిల‌క్, నిసాంక‌, పెరీరా
Andhra Pradesh Latest News: 15 నెలల్లో 4,71,574 ఉద్యోగాలు- అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
15 నెలల్లో 4,71,574 ఉద్యోగాలు- అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
Jadcherla Latest News:జడ్చెర్ల కాలుష్యంపై స్పందించకుంటే ఆరబిందో ఫార్మా కూల్చేస్తా- ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్టిమేటం
జడ్చెర్ల కాలుష్యంపై స్పందించకుంటే ఆరబిందో ఫార్మా కూల్చేస్తా- ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్టిమేటం
Advertisement

వీడియోలు

Christopher nolan Movies Decode Telugu | టైమ్ తో ఫుట్ బాల్ ఆడతాడు..సైన్స్ ఫిక్షన్ తో బుర్ర తినేస్తాడు..| ABP Desam
Amalapuram Vasavi Amma 4crore Decoration | అమలాపురంలో వాసవి అమ్మవారికి 4కోట్లతో డెకరేషన్ | ABP Desam
India vs Pakistan First Time in Asia Cup Final | ఆసియాకప్ లో మొదటిసారి ఫైనల్ లో ఆడబోతున్న ఇండియా పాక్
Pakistan Captain Warning to India Asia Cup 2025 Final | ఫైనల్ లో తలపడబోతున్న ఇండియా పాక్
Bangladesh vs Pakistan Preview Asia Cup 2025 | ఫైనల్ కు చేరిన పాకిస్తాన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Weather: తెలంగాణలో జలవిలయం: మూసీ మహోగ్రరూపం.. నీట మునిగిన ఎంజీబీఎస్‌ రాష్ట్రంలో రెడ్ అలర్ట్!
తెలంగాణలో జలవిలయం: మూసీ మహోగ్రరూపం.. నీట మునిగిన ఎంజీబీఎస్‌ రాష్ట్రంలో రెడ్ అలర్ట్!
Asia Cup 2025 Ind Vs SL Result Update: టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. సూప‌ర్ ఓవ‌ర్లో గ‌ట్టెక్కిన భార‌త్.. స్కోర్లు స‌మం కావ‌డంతో టైగా ముగిసిన మ్యాచ్.. రాణించిన అభిషేక్, తిల‌క్, నిసాంక‌, పెరీరా
టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. సూప‌ర్ ఓవ‌ర్లో గ‌ట్టెక్కిన భార‌త్.. స్కోర్లు స‌మం కావ‌డంతో టైగా ముగిసిన మ్యాచ్.. రాణించిన అభిషేక్, తిల‌క్, నిసాంక‌, పెరీరా
Andhra Pradesh Latest News: 15 నెలల్లో 4,71,574 ఉద్యోగాలు- అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
15 నెలల్లో 4,71,574 ఉద్యోగాలు- అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
Jadcherla Latest News:జడ్చెర్ల కాలుష్యంపై స్పందించకుంటే ఆరబిందో ఫార్మా కూల్చేస్తా- ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్టిమేటం
జడ్చెర్ల కాలుష్యంపై స్పందించకుంటే ఆరబిందో ఫార్మా కూల్చేస్తా- ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్టిమేటం
Telangana Local Election Reservation:  తెలంగాణలో BCలకు 42% కోటా - జీవో రిలీజ్ - శనివారం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్  ?
తెలంగాణలో BCలకు 42% కోటా - జీవో రిలీజ్ - శనివారం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ?
Jubilee Hills By-election : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కులాల లెక్కలేంటీ? బీసీ వర్సెస్ ఓసీ పోరుగా మారుతుందా!
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కులాల లెక్కలేంటీ? బీసీ వర్సెస్ ఓసీ పోరుగా మారుతుందా!
Chiranjeevi Vs Balakrishna:: బాలకృష్ణ మాటలకు బాధపడ్డారు సరే...  మరి మూడేళ్లుగా ఎందుకు సైలంట్‌గా ఉన్నారు చిరంజీవి..!
బాలకృష్ణ మాటలకు బాధపడ్డారు సరే... మరి మూడేళ్లుగా ఎందుకు సైలంట్‌గా ఉన్నారు చిరంజీవి..!
Vizag Rain Alert: విశాఖ ప్రజలకు అలర్ట్ - మీరు ఊహించనంత వర్షం కురవబోతోంది - ఈ జాగ్రత్తలు తీసుకోండి !
విశాఖ ప్రజలకు అలర్ట్ - మీరు ఊహించనంత వర్షం కురవబోతోంది - ఈ జాగ్రత్తలు తీసుకోండి !
Embed widget