TS EDCET 2022 : తెలంగాణ ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల, ఎగ్జామ్ ఎప్పుడంటే?
TS EDCET 2022 : తెలంగాణ ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఏప్రిల్ 7 నుంచి జూన్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జులై 26, 27 తేదీల్లో ఎడ్ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
TS EDCET 2022 : తెలంగాణ ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్ షెడ్యూలు విడుదల చేసినట్లు కన్వీనర్ రామకృష్ణ తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి జూన్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీలు రూ.450, ఇతరులు రూ.650 చెల్లించాలని పేర్కొన్నారు. లేట్ ఫీజు రూ.250తో జులై 1 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో జులై 15వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు. జులై 26, 27 తేదీల్లో తెలంగాణ, ఏపీలో ఎడ్‌సెట్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ తెలిపారు.
ఎంబీబీఎస్, బీఫార్మసీ, అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థులు అనర్హులు
తెలంగాణలో మొత్తం 220 బీఈడీ కాలేజీల్లో 19,600 సీట్లు ఉన్నాయి. డిగ్రీ, ఇంజినీరింగ్ లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎడ్‌సెట్ రాసేందుకు అర్హులు అవుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు సాధిస్తేచాలు. డిగ్రీ, ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చని కన్వీనర్ రామకృష్ణ పేర్కొన్నారు. ఎంబీబీఎస్, బీఫార్మసీ, అగ్రికల్చర్ బీఎస్సీ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివిన వారు బీఈడీ చేసేందుకు అనర్హులని వెల్లడించారు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం https://edcet.tsche.ac.in http://www.tsche.ac.in వెబ్‌సైట్‌లను చూడవచ్చు.
లా సెట్ నోటిఫికేషన్ విడుదల
టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. మూడు, ఐదేండ్ల లా కోర్సులతో పాటు ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశాలకు టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఏప్రిల్ 6 నుంచి జూన్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్‌ఎల్‌బీకి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500, ఇతరులకు రూ.1000 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జులై 12 వరకు రూ.500 నుంచి రూ.2 వేల వరకు ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 21, 22 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఎల్‌ఎల్‌బీలో ప్రవేశానికి డిగ్రీ లేదా ఇంటర్‌లో జనరల్, బీసీ, ఎస్సీ/ఎస్టీలకు వరుసగా 45, 42, 40 శాతంతో ఉత్తీర్ణత సాధించాలి. లా సెట్ షెడ్యూల్‌ను శుక్రవారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కేయూ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్‌రావు, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి ప్రకటించారు. పూర్తివివరాలకు https://lawcet.tsche.ac in వెట్‌సైట్‌లో చూడవచ్చు.