TS ECET: టీఎస్ఈసెట్ షెడ్యూలు ఖరారు, ముఖ్యమైన తేదీలివే! పరీక్ష ఎప్పుడంటే?
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 2 నుంచి మే 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.500 ఆలస్యం రుసుంతో మే 8 వరకు, రూ.2500తో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు డిప్లొమా విద్యార్థులకు నిర్వహించే టీఎస్ ఈసెట్-2023 షెడ్యూలును రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈసెట్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్. లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డి రవీందర్, ఈసెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేశ్ ఫిబ్రవరి 27న విడుదల చేశారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 2 నుంచి మే 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.500 ఆలస్యం రుసుంతో మే 8 వరకు, రూ.2500తో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 8 నుంచి మే 12 వరకు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 15 నుంచి అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 20న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ఈసెట్ షెడ్యూలు..
➥ మార్చి 1న ఈసెట్ నోటిఫికేషన్ విడుదల
➥ మార్చి 2 నుంచి మే 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ.
➥ రూ.500 ఆలస్యం రుసుంతో మే 8 వరకు, రూ.2500తో మే 12 వరకు దరఖాస్తుకు అవకాశం.
➥ మే 8 నుంచి మే 12 వరకు దరఖాస్తు సవరణకు అవకాశం.
➥ మే 15 నుంచి వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్.
➥ మే 20న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ.
మార్చి 2 నుంచి లాసెట్ దరఖాస్తులు...
మార్చి 2 నుంచి మే 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. రూ.500 ఆలస్య రుసుముతో మే 8 వరకు గడువిచ్చారు. రూ.2500తో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 8 నుంచి 12 వరకు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 15 నుంచి అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 20న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు. తదితర వివరాల కోసం టీఎస్ ఈసెట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు కోరారు.
లాసెట్, పీజీఎల్‌సెట్ షెడ్యూలు ఇలా..
➥ మార్చి 1న టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్ విడుదల.
➥ మార్చి 2 నుంచి ఏప్రిల్ 6 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ.
➥ రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 12 వరకు, రూ.1000తో ఏప్రిల్ 19 వరకు దరఖాస్తుకు అవకాశం.
➥ మే 5 నుంచి 10 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం.
➥ మే 16 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్.
➥ మే 25న టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్‌సెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహణ.
➥ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు రూ.900గా; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.600గా నిర్ణయించారు.
Also Read:
నీట్ పీజీ-2023 అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ పీజీ)-2023 అడ్మిట్ కార్డులను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) ఫిబ్రవరి 27న విడుదల చేసింది. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నీట్ పీజీ-2023 పరీక్ష యథాతదంగా మార్చి 5న కంప్యూటర్ ఆధారిత విధానంలో జరగనుంది.
నీట్ పీజీ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేట్ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..