TG ECET 2025 Results: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ కోసం డైరెక్ట్ లింక్
TS ECET Result 2025 Direct Link | ఈ నెల 12న నిర్వహించిన తెలంగాణ ఈసెట్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ర్యాంకు కార్డులను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి.

TS ECET Result 2025 OUT | హైదరాబాద్: బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా చేరేందుకు నిర్వహించిన టీజీ ఈసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో టీజీ ఈసెట్ ఫలితాలు (TG ECET 2025 Results) ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలక్రిష్ణ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ వైస్ ఛాన్సలర్ కుమార్ మొలుగురం, ప్రొఫెసర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. తెలంగాణ ఈసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
పాలిటెక్నిక్, బీఎస్సి మ్యాథ్స్ విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీ ఫార్మసీ, కోర్సుల్లో చేరేందుకు మే 12వ తేదీన టీజీ ఈసెట్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 18 వేల 998 మంది పరీక్షలు రాశారు. టీజీ ఈసెట్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
టీజీ ఈసెట్ 2025 టాపర్స్ వీరే..
- బీఎస్సి మ్యాథ్స్ లో మొదటి ర్యాంక్ సంతోష్ కుమార్,
- కెమికల్ ఇంజినీరింగ్ లో మొదటి ర్యాంక్ లెంక తేజ సాయి
- కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ లో శ్రీకాంత్
- సివిల్ ఇంజినీరింగ్ లో గోల్కొండ నిఖిల్ కౌశిక్
- ఎలక్ట్రికల్, ఎలెక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో మొదటి ర్యాంక్ కాసుల శ్రావణి
- ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ మొదటి ర్యాంక్ కట్లే రేవతి
- మెటలర్జికల్ ఇంజినీరింగ్ లో మొదటి ర్యాంక్ తోట సుబ్రహ్మణ్యం
- ఎలెక్ట్రానిక్స్ ,ఇన్స్ట్రునెంటేషన్ ఇంజినీరింగ్ లో రాపర్తి చందన
- మైనింగ్ ఇంజినీరింగ్ లో మొదటి ర్యాంక్ కుర్మా అక్షయ
- మెకానికల్ ఇంజినీరింగ్ లో పోతూ గంటి కార్తిక్,
- ఫార్మసీ లో మొదటి ర్యాంక్ ఐలి చందన...






















