అన్వేషించండి

ICFAI Director Sudhakar Rao Tips For Youth: బెస్ట్ కెరీర్, ఎంటర్‌ప్రెన్యూర్లగా మారడంపై విద్యార్థులకు ఇక్ఫాయ్ డైరెక్టర్ సుధాకర్ రావు టిప్స్

ABP DESAM SmartEd Conclave 2025 | విద్యార్థులు చదువుకునే రోజుల్లో ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారడంపై ఫోకస్ చేయాలని, కొన్ని లక్షణాలు అలవరుచుకుంటే అంతా సాధ్యమని ICFAI డైరెక్టర్ సుధాకర్ రావు సూచించారు.

హైదరాబాద్: విద్యార్థులు చదువుకునే రోజుల్లోనే ఎంటర్‌ప్రెన్యూర్‌ అవ్వాలని ప్లాన్ చేసుకుని, అందుకు తగినట్లుగా తమను మలుచుకోవాలని ICFAI గ్రూప్ డైరెక్టర్ (బ్రాండింగ్) సుధాకర్ రావు సూచించారు. ఏబీపీ దేశం మీడియా హైదరాబాద్ వేదికగా నిర్వహించిన స్మార్ట్ ఎడ్ కాన్‌క్లేవ్ 2025 (ABP DESAM SmartEd Conclave)లో పాల్గొన్న సుధాకర్ రావు ‘క్యాంపస్ టు స్టార్టప్: గ్రోయింగ్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ (From Campus to Startup: Growing the Entrepreneurial Mindset) అంశంపై విద్యార్థులు, యువతకు సంబంధించి పలు విలువైన విషయాలు షేర్ చేసుకున్నారు. టెక్నాలజీ, టూల్స్ వాడుకుని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుకోవాలని, నిరంతరం నేర్చుకోవడం, కొత్త ఆవిష్కరణల కోసం యత్నిస్తే లైఫ్‌లో సక్సెస్ సాధించవచ్చు అని సలహా ఇచ్చారు.  

ప్రైవేట్ సంస్థలు తమ టీచింగ్ మెథడ్‌ను ఎలా మార్చేశాయి. విద్యార్థుల మైండ్ సెట్‌పై అది ప్రభావం చూపుతుందా?
ICFAI సుధాకర్ రావు: మంచి తల్లిదండ్రులు తమ పిల్లలను మంచిగా ఉండాలని చెప్పారు. వారు చేసే మంచిని, వారు ఫాలో అయ్యే జీవన విధానం నుంచి పిల్లలు మంచి లక్షణాలు అవరచుకుంటారు. మీరు ఎవరితో గొడవ పడొద్దు, అరవొద్దు అని చెప్పడం కాదు. తల్లిదండ్రులు ఏ విషయాలు పాటిస్తున్నారో పిల్లలు వాటిని మీ నుంచి గ్రహిస్తారు. విద్యార్థులకు టీచర్లు ఏం చెబుతారో వారు దానికి తగ్గట్లుగా మారతారు. మీరు వారిని Entrepreneurగా చూసేలా తీర్చిదిద్దకపోతే.. విద్యార్థుల నుంచి మీరు ఎన్నటికీ ఆశించలేం. టైం టేబుల్ పెట్టి అది పాటించకపోతే విద్యార్థులు దాన్నుంచి ఏం నేర్చుకుంటారు. ఏదైనా సమస్య ఎదురైతే తప్పుకుని వెళ్లడం కాదు, దానికి పరిష్కారం ఆలోచించే మనస్తత్వం ఉంటే కంపెనీ, సంస్థలు స్థాపించగలరు. 

విద్య, శిక్షణకు చాలా వ్యత్యాసం ఉంటుంది. శిక్ష అంటే విషయాలు తెలుసుకోవడం, ఆ నాలెడ్జ్‌ను క్లాస్‌రూంకు తీసుకురావాలి. ఓవరాల్‌గా విద్యార్థులను పరీక్షించడం జరుగుతుంది. విద్య అంటే మీరు నేర్చుకున్న చదువు ఎక్కడ ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవడం. కనుక విద్యార్థులకు విద్యను అందిస్తే వారి చదువుకు ఓ గమ్యం ఏర్పడుతుంది. 

 

ప్రతి ఏదేళ్లకు ఎడ్యూకేషన్‌లో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఎడ్యుకేషన్ టైం నడుస్తోంది. ఇందులో బెస్ట్ ఏంటీ ?
ICFAI సుధాకర్ రావు: స్మార్ట్ ఎడ్యుకేషన్ అంటే డిజిటల్ టెక్నాలజీ, పరికరాలు వినియోగించడం కాదు. నాలెడ్జ్ ద్వారా సమస్యను పరిష్కరించేలా మారడం. సమస్యను గుర్తించడం, ఎత్తిచూపడం జరుగుతుంది. 30, 35 ఏళ్ల వారు సైతం ఓటీపీ వస్తే సరైన టైంలో దాన్ని సబ్మిట్ చేయలేరు. అలాంటిది ఇంకా పెద్ద వయసు వారు సరిగ్గా పాటించాలని ఏ విధంగా ఆశిస్తాం. మీకు లభించిన టెక్నాలజీ, టూల్స్ వాడి సమస్యలను తేలికగా, తక్కువ సమయంలో పరిష్కరించడం స్మార్ట్ ఎడ్యుకేషన్.

ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు, భారత సంతతికి చెందిన వారు అగ్రసంస్థల్లో సీఈవోలుగా ఉన్నారు. ఇక్కడ టీచింగ్ మెథడ్ అద్భుతంగా ఉందని భావిస్తున్నారా?
ICFAI సుధాకర్ రావు: కంపెనీ వ్యవస్థాపకులుగా మారేలా ఇక్కడ టీచింగ్ జరుగుతుందని నేను భావించడం లేదు. విదేశాలలో పెద్ద సంస్థలకు భారతీయులు సీఈవోలుగా ఉండటం మంచి విషయమే. కానీ కొందరు సక్సెస్ అయిన వారిని చూసి అంతా అలా ఉందని కాదు. ఐఐఎం, ఐఐటీల్లో కొందరికీ కోట్ల ప్యాకేజీతో జాబ్ వచ్చాయని , అదే ఇన్‌స్టిట్యూట్‌లో అందరి పరిస్థితి ఒకేలా ఉండదు. ఎంటర్‌ప్రెన్యూరర్‌గా మారిన వారిలో 80 శాతం మంది చదువుకునే రోజుల్లోనే ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకుంటున్నారు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, బిజినెస్ స్కూల్స్ లాంటి విద్యా సంస్థలు E-Cells (Entrepreneurship Cells) ఏర్పాటు చేశాయి. అది మాత్రమే సరిపోదు. మీ చేతిలో మొబైల్ ఉన్నా, చాలా టూల్స్ ఉపయోగించం. కనుక ‘ఈ సెల్స్’ ద్వారా విద్యార్థులకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఐడియాలను ఓ కేంద్రంగా మార్చడం, కొత్త ఆవిష్కరణలపై చర్చించడం ద్వారా మార్పు వస్తుంది. మనకున్న కరికులమ్ కచ్చితంగా లీడర్స్‌ను డెవలప్ చేసేలా లేదు. కానీ తలుచుకుంటే వాళ్లు చేయగలరు.

కొత్త ఎడ్యుకేషన్ పాలసీ, ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్స్ ద్వారా ఫలితాలు రాబట్టవచ్చా?
ICFAI సుధాకర్ రావు: వాషింగ్ మేషిన్ ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ ఒకేరకంగా ఎలక్ట్రిసిటీ తీసుకుంటాయా. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, మనీ సేవింగ్, ఎనర్జీ సేవ్ చేయడం, సమాజంలో మార్పు తీసుకురావడం, రాజకీయ నాయకులు ఎంత ఇన్నోవేటివ్‌గా ప్రజల జీవితాలు మార్చుతున్నారు లాంటివి అవసరం. కానీ సిలబస్ పూర్తికాలేదు. చదవాల్సింది ఎంతో ఉందనుకుంటారు. అయితే ఎన్ని విషయాలు అర్థం చేసుకున్నామనేది ఆలోచించాలి. 

ఓ కాలేజీ E-Cellsకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగితే కొంత సమయం తరువాత వారు ఏకంగా 45 ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్‌తో వచ్చారు. కరెంట్ షాక్ కొట్టకుండా వాటర్ హీటర్ ఎలా ఉపయోగించాలి అనేది అందులో ఒకటి. మీరు ఒక సమస్యకు సొల్యూషన్ కనుక్కోవడం మాత్రమే కాదు, దాని గురించి స్టోరీ రాయగలగాలి. ఆ విషయాన్ని అర్థవంతంగా చెప్పేలా తయారవ్వాలి. మీరు కనుక్కున్నది, సాధించిన విషయాన్ని ప్రమోట్ చేసుకునే స్కిల్స్ అవసరం. దేశంలో 20 నగరాలలో మా సంస్థ ఉంది. ICFAI త్రిపుర యూనివర్సిటీలో రేడియోథెరపీ, నర్సింగ్, ఫిజియోథెరపీ లాంటి స్కిల్ బేస్డ్ కోరల్సులున్నాయి. సిక్కిం, నాగాలాండ్, మిజోరం, మేఘాలయాలో టూరిజం, హోటల్ మేనేజ్ మెంట్ లాంటి కోర్సులు కెరీర్‌ను అందిస్తున్నాయి. మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారనే దాన్ని బట్టి వారికి అర్థమయ్యే రీతిలో వివరించాలి. 

ఎంటర్‌ప్రెన్యూర్‌గా, స్కిల్ పర్సన్‌గానే కాదు, మనీ సేవింగ్, CV క్రియేట్ చేయడం నేర్పించడంపై ఏమంటారు? 
ICFAI సుధాకర్ రావు: స్నాప్ ఛాట్, ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ ఫ్లాట్‌ఫామ్‌లలో ఉండొద్దని చెప్పను. విద్యార్థులు ఎక్కువ సమయం LinkedIn లో గడపాలి. మీరు ఏం నేర్చుకున్నారో నిరంతరం అందులో అప్‌డేట్ చేయాలి. ఇతరులు ఏం చేస్తు్న్నారో తెలుసుకోవాలి. వారు ప్రపంచానికి ఏం ఇస్తున్నారనేది గ్రహించి నేర్చుకోవాలి. పబ్లిక్ స్పీకింగ్ అనేది మంచి విషయం. మీరు మీకోసం పనిచేసి ఓనర్ అవుతారా, లేక ఇతరుల కోసం పనిచేస్తూనే ఉంటారా అనేది గ్రహించాలి. రిస్క్ తీసుకుంటేనే మీకు రివార్డ్స్ లభిస్తాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా సొసైటీకి వెన్నెముకగా మారతారు. ఓ విషయంపై పట్టు సాధిస్తే ఎంతవరకైనా పోరాడేతత్వం వస్తుంది. 

పేరెంట్స్ ఇచ్చిన మనీని సరిగ్గా వాడుకోవాలి. కొందరు అనవసర విషయాలకు ఖర్చు చేస్తుంటారు. మీరు సేవ్ చేసిన మనీని పేరెంట్స్ కు తిరిగిస్తే మీకు రివార్డ్స్ వస్తాయి. ఇంకా ఎక్కువ మనీ వచ్చే ఛాన్స్ ఉంది. 

మిడిల్ క్లాస్ వాళ్లు రిస్క్ తీసుకుని ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారగలరా? వారికి ఇలాంటివి ఎలా సాధ్యమవుతాయి?
ICFAI సుధాకర్ రావు: విద్యార్థుల పేరెంట్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆలోచించడం మొదలుపెడితే వారి పిల్లలు ఆ దిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉంది. మన కోసం, మనకంటూ ప్రత్యేకత కోరుకుంటే ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలి. డబ్బు ఇన్వెస్ట్ చేస్తే, రిస్క్ తరువాత రివార్డ్స్ వస్తాయి. 90 శాతం స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే వారు ఎంచుకున్న విధానం సరైనది కాకపోవడం. ఫౌండర్స్ టీం సరిగ్గా లేకపోవడం. వాళ్లు తమకు మెంటార్ ఉండటాన్ని ఇష్టపడరు. వారికి మెంటార్ లేకపోవడం మైనస్. ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే విధానంలో తప్పిదాలు, ఎదురైన సమస్యను సరిగ్గా కన్వే చేయలేని కారణంగా చాలా స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నాయి. కాలేజీలు విద్యార్థులను కంపెనీ వ్యవస్థాపకులుగా మార్చేలా చేయాలి. కానీ జాబ్స్ కోసం మాత్రమే వారిని ప్రిపేర్ చేయకూడదు అని సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
Embed widget