అన్వేషించండి

ECET: టీఎస్ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, జులై 29 నుంచి రిజిస్ట్రేషన్!

ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన 'టీఎస్ ఈసెట్‌-2023' కౌన్సెలింగ్‌ షెడ్యూలును అధికారులు ప్రకటించారు.

తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన 'టీఎస్ ఈసెట్‌-2023' కౌన్సెలింగ్‌ షెడ్యూలును అధికారులు ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం జులై 29 నుంచి రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్‌ ప్రారంభంకానుంది. ఆగస్టు 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన అభ్యర్థులకు జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇక ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినవారు జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఆగస్టు 8న తొలి విడత సీట్లను కేటాయిస్తారు. తదనంతరం మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఆగస్టు 20 నుంచి తుది విడత ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. ఆగస్టు 26న తుది విడత సీట్లను కేటాయిస్తారు. ఇక చివరగా.. ఆగస్టు 28న అభ్యర్థులకు స్పాట్ ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు..

➥ జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు: రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్‌.

➥ జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు: ధ్రువపత్రాల పరిశీలన. 

➥ జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు. 

➥ ఆగస్టు 8న: తొలి విడత సీట్ల కేటాయింపు.

➥ ఆగస్టు 20: తుది విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం. 

➥ ఆగస్టు 26: తుది విడత సీట్ల కేటాయింపు. 

➥ ఆగస్టు 28న: స్పాట్ ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల 

ALSO READ:

టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూలు జులై 13న విడుదలైంది. ఆగస్టు 14 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. ఆగస్టు 16 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 16 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 25న తొలి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి తుది విడత ఐసెట్ కౌన్సెలింగ్ ఉంటుంది. సెప్టెంబరు 1 నుంచి 3 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు, 7న తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 8న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

జోసా కౌన్సెలింగ్-2023 మూడో రౌండ్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ 2023 మూడో రౌండ్ ఫలితాలు జులై 13న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో సీట్ల కేటాయింపు ఫలితాలను అందుబాటులో ఉంచారు. మూడో రౌండ్ కౌన్సెలింగ్‌లో జేఈఈ ర్యాంకు వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో సీటు కేటాయింపు చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ జేఈఈ మెయిన్ అప్లికేషన్ నెంబరు, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు ఇతర విద్యా సంస్థల్లో బీటెక్‌ సీట్లు జోసా కౌన్సెలింగ్‌తో భర్తీ చేస్తారు. మూడో రౌండ్ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన అభ్యర్థులు సీట్ ప్రాసెసింగ్ ఫీజును జమ చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Embed widget