TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్, పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదల - ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 28న విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి.
తెలంగాణలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 28న విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి ఎంసెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 9 వరకు ఇంజినీరింగ్, మే 10 నుంచి 11 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ సారి సెషన్‌కు 40 వేల మంది..?
ప్రస్తుతం ఎంసెట్‌లో ఒక్కో సెషన్‌కు 29 వేల మంది విద్యార్థుల వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఈ సంఖ్యను 40 వేలకు పెంచాలని భావిస్తున్నారు. ఇదే అంశంపై టీసీఎస్ అయాన్ సంస్థతో జేఎన్టీయూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎంసెట్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయడం, ప్రశ్నపత్రాల నార్మలైజేషన్ సమస్యను అధిగమించేందుకు ఈ ఏడాది తక్కువ సెషన్లలో పరీక్షల నిర్వహణకు యోచిస్తున్నారు. ఏటా 2.6 లక్షల మందికిపైగా విద్యార్థులు ఎంసెట్‌కు హాజరవుతున్నారు. ఒక్కో సెషన్‌కు 40 వేల మంది విద్యార్థులు హాజరైతే ఎంసెట్ పరీక్షలను ఐదు రోజుల్లోనే ముగించవచ్చనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు 5 రోజుల పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు.
ఎంసెట్ కన్వీనర్‌గా డీన్‌కుమార్..
ఈ ఏడాది టీఎస్ ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్ సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా ఉన్న ప్రొఫెసర్ బి. డీన్ కుమార్‌ను నియమించారు. గత మూడేళ్లుగా ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్, రెక్టార్ గోవర్ధన్ కొనసాగగా.. ఈసారి డీన్ కుమార్‌ను నియమించారు. ఈయన గతంలో పరీక్షల నియంత్రణ విభాగం కంట్రోలర్‌గా, చీఫ్ ఇంజినీర్‌గా పనిచేశారు.
ఎంసెట్ షెడ్యూల్ ఇలా..
➥ ఎంసెట్ నోటిఫికేషన్ వెల్లడి: 28.02.2023
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2023.
➥ దరఖాస్తుకు చివరితేదీ (అపరాధ రుసుము లేకుండా): 10.04.2023.
➥ రూ.250 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 15.04.2023.
➥ రూ.1000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 20.04.2023.
➥ రూ.2500 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 25.04.2023.
➥ రూ.5000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 02.05.2023.
➥ దరఖాస్తు ఫీజు: రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600
➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 30.04.2023 నుంచి
➥ పరీక్ష తేదీలు: మే 7 నుంచి 11 వరకు
పీజీఈసెట్ షెడ్యూల్..
2023-24 విద్యాసంవత్సరానికి గాను ఇంజినీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్-2023 (PGECET) షెడ్యూల్‌ను కూడా ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 3 నుంచి ఏప్రిల్ 30 వరకు కొనసాగనుంది. పరీక్షలను మే 29 నుంచి జూన్ 1 వరకు నిర్వహిస్తారు.
➥ పీజీసెట్ నోటిఫికేషన్: 28.02.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ (అపరాద రుసుము లేకుండా: 30.04.2023.
➥ రూ.250 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 05.05.2023.
➥ రూ.1000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 10.05.2023.
➥ రూ.2500 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 15.05.2023.
➥ రూ.5000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 24.05.2023.
➥ దరఖాస్తు ఫీజు: రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600
➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 21.05.2023 నుంచి
➥ పరీక్ష తేదీలు: 29.05.2023 - 01.06.2023 వరకు
Also Read:
JNTUH Courses: జేఎన్టీయూలో కొత్త కోర్సులు వస్తున్నాయ్! ఈ ఏడాది నుంచే ప్రవేశాలు!
రానున్న విద్యాసంవత్సరంలో సరికొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు జేఎన్‌టీయూహెచ్ కసరత్తు చేస్తుంది. యూనివర్సిటీ పరిధిలో కొత్తగా అగ్రికల్చర్ టెక్నాలజీ, రేడియేషన్ ఫిజిక్స్ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. వ్యవసాయ యాంత్రీకరణకు పరిశ్రమలను ప్రోత్సహించడమేగాక ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అగ్రికల్చర్ టెక్నాలజీ కోర్సుకు రూపకల్పన చేసింది. దీంతోపాటు రేడియేషన్ ఫిజిక్స్ కోర్సును ప్రవేశపెట్టాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు, వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు!
తెలంగాణలో డిగ్రీ విద్య స్వరూపం పూర్తిగా మారనుంది. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలకు అనుగుణంగా డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొపెసర్ లింబాద్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ బేగంపేట్ లోని సెస్‌లో “అత్యుత్తమ పాఠ్యప్రణాళిక అభివృద్ధి” కోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసిన రెండురోజుల సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..