News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TS EAMCET Counselling: ఎంసెట్‌లో ఏ ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు వ‌స్తుందో తెలుసుకోండి! గతేడాది సీట్ల కేటాయింపు ఇలా!

ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు వెల్లడించిన నేప‌థ్యంలో గత విద్యాసంవ‌త్స‌రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో క‌టాఫ్ ర్యాంకుల వివ‌రాలు పరిశీలిస్తే..

FOLLOW US: 
Share:

తెలంగాణలో  టీఎస్ ఎంసెట్ 2023 ఫ‌లితాలు మే 25న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. దీంతోపాటు ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూలు మే 27న విడుద‌లైంది. ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి అధ్యక్షత‌న జ‌రిగిన స‌మావేశంలో ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖ‌రారు చేశారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్  కోర్సుల్లో ప్రవేశాలు చేప‌ట్టనున్నారు. ఇప్పటికే ఎంసెట్ ఫ‌లితాలు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 26 నుంచి జులై 19 మొదటివిడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తర్వాత జులై 21 నుంచి 31 వరకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇక చివరగా మిగిలిన సీట్ల భర్తీకి  ఆగస్టు 2 నుంచి 9 వరకు చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అదేవిధంగా స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను ఆగస్టు 8న విడుదల చేయనున్నారు.

ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు వెల్లడించిన నేప‌థ్యంలో ఏ కాలేజీ అయితే బాగుంటుంది. ఏ కోర్సులో చేరితే లైఫ్ ఉంటుంది. అస‌లు మ‌న ర్యాంక్‌కు ఏ కాలేజీలో, ఏ కోర్సులో సీటు వ‌స్తుంద‌నే అంశంపై ఇంజినీరింగ్ విద్యార్థులు ఆందోళన పడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో ఏ కాలేజీలో, ఏ కోర్సులో ఏ ర్యాంకు వ‌ర‌కు సీట్లు వ‌చ్చాయో తెలుసుకుందాం. 2022-23 విద్యాసంవ‌త్స‌రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో క‌టాఫ్ ర్యాంకుల వివ‌రాలు పరిశీలిస్తే..

గతేడాది ఇంజినీరింగ్ కళాశాలల్లో మొదటి విడత కౌన్సెలింగ్  కటాఫ్‌ ర్యాంకుల వివరాలు..

గతేడాది ఇంజినీరింగ్ కళాశాలల్లో చివరి విడత కౌన్సెలింగ్  కటాఫ్‌ ర్యాంకుల వివరాలు..

 

టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥ జూన్ 26: ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది.

 

➥ జూన్ 28 – జులై 7: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.

➥ జూన్ 28 – జులై 8: స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్త‌యిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్ష‌న్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

➥ జులై 8: ఆప్ష‌న్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.

➥ జులై 12: సీట్ల కేటాయింపు.

➥ జులై 12 – 19: సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥ జులై 21 – 27: ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫ‌స్ట్ ఫేజ్‌లో ఈ వివ‌రాలు నింప‌ని విద్యార్థులు మాత్ర‌మే).

➥ జులై 23: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.

➥ జులై 21 – జులై 24: స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్త‌యిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్ష‌న్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

➥ జులై 24: ఆప్ష‌న్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.

➥ జులై 28: సీట్ల కేటాయింపు

➥ జులై 28 – 31: సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥ ఆగ‌స్టు 2: ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫ‌స్ట్, సెకండ్ ఫేజ్‌లో ఈ వివ‌రాలు నింప‌ని విద్యార్థులు మాత్ర‌మే).

➥ ఆగ‌స్టు 3: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.

➥ ఆగ‌స్టు 2: ఆగ‌స్టు 4 – స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్త‌యిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్ష‌న్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

➥ ఆగ‌స్టు 4: ఆప్ష‌న్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.

➥ ఆగ‌స్టు 7: సీట్ల కేటాయింపు.

➥ ఆగ‌స్టు 7 – ఆగ‌స్టు 9: సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

Related Articles:

➥ టీఎస్ ఎంసెట్‌-2023లో మూడు మార్కులు కలిశాయోచ్! వీరికి మాత్రమే వర్తింపు!

➥ వెబ్‌సైట్‌లో టీఎస్ ఎంసెట్-2023 ర్యాంకు కార్డులు, వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి - డైరెక్ట్ లింక్ ఇదే!

➥ తెలంగాణ ఎంసెట్ అగ్రిక‌ల్చర్, మెడిసిన్ టాప్-10 ర్యాంక‌ర్లు వీరే!

 తెలంగాణ ఎంసెట్ ఫలితాలు - ఇంజినీరింగ్‌లో టాప్-10 ర్యాంక‌ర్లు వీరే!

➥ తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో 83 శాతం ఉత్తీర్ణత నమోదు!

➥ తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి!

Published at : 28 May 2023 09:03 AM (IST) Tags: TS Eamcet counselling Education News in Telugu TS EAMCET Cutoff Ranks TS EAMCET College wise Cutoff Ranks

ఇవి కూడా చూడండి

PGECET Seats: పీజీఈసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు

PGECET Seats: పీజీఈసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు

UK Visa Fee Hike: యూకే వీసా ఫీజు పెంపు విద్యార్థులు, కార్మికులపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

UK Visa Fee Hike: యూకే వీసా ఫీజు పెంపు విద్యార్థులు, కార్మికులపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

Inter Admissions: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఇక ఇదే చివరి అవకాశం!

Inter Admissions: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఇక ఇదే చివరి అవకాశం!

SA Exams: సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షల సమయాల్లో మార్పులు, మారిన షెడ్యూలు ఇలా

SA Exams: సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షల సమయాల్లో మార్పులు, మారిన షెడ్యూలు ఇలా

IWST: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరులో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్

IWST: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరులో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్

టాప్ స్టోరీస్

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్

Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్