అన్వేషించండి

CPGET 2022 Results: సీపీగెట్-2022 ఫలితాలు వెల్లడి, 94.39 శాతం ఉత్తీర్ణత, రిజల్ట్ ఇక్కడ చూసుకోండి!

రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి ఫలితాలు విడుదల చేశారు. సీపీగెట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చు.

CPGET 2022: తెలంగాణలోని యూనివర్సిటీలలో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన‌ సీపీజీఈటీ – 2022 ఫలితాలు మంగళవారం (సెప్టెంబరు 20) విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. సీపీగెట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చు. విద్యార్థులు తమ సీపీగెట్ హాల్‌టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సీపీగెట్ పరీక్షల్లో మొత్తం 94.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షలకు మొత్తం 57,262 మంది విద్యార్థులు హాజరుకాగా 54,050 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 


CPGET - 2022 Results కోసం క్లిక్ చేయండి..


CPGET 2022 Rank Card


ఈ ఏడాది సీపీగెట్ పరీక్షలను ఆగస్టు 11 నుంచి 23 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 67,027 మంది దరఖాస్తు చేసుకోగా.. 57,262 మంది హాజరయ్యారు. మొత్తం 84 సబ్జెక్టులకు రాష్ట్రంలోని 12 జోన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి 11 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో మొత్తం 50 కోర్సుల్లో 112 విభాగాలకు విద్యార్థులు ప్రవేశాలు పొందే వీలుంది. ప్రవేశ పరీక్షలో ర్యాంకును బట్టి తెలంగాణలోని యూనివర్సిటీల పరిధిలో ఉన్న 320 కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.


ప్రవేశాలు కల్పించే కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంసీజే, మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ, పీజీ డిప్లొమా కోర్సులు, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు.


ప్రవేశం కల్పించే యూనివర్సిటీలు: ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) లు సీపీజీఈటీ 2021 ఆధారంగా క్యాంపస్, అనుబంధ కళాశాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి.

 

Also Read:

ఐసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యతేదీలివే!
తెలంగాణ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ సెప్టెంబరు 19న విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబర్‌ 10 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఐసెట్-2022 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 10 నుంచి 13 వరకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. అక్టోబర్‌ 10 నుంచి 15వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు. ఇక వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు అక్టోబరు 18న ఎంబీఏ, ఎంసీఏ అభ్యర్థులకు మొదటి విడుదల సీట్లు కేటాయించనున్నారు.
ఐసెట్ పూర్తి కౌన్సెలింగ్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


Also Read:

జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sri Reddy Arrest?: పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
Telangana Latest News: రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
Posani Krishan Murali Arrest: నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
Ram Pothineni: రైటర్‌గా మారిన రామ్ పోతినేని... మహేష్ బాబు సినిమాలో లవ్ సాంగ్ రాసిన హ్యాండ్సమ్ హీరో
రైటర్‌గా మారిన రామ్ పోతినేని... మహేష్ బాబు సినిమాలో లవ్ సాంగ్ రాసిన హ్యాండ్సమ్ హీరో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TVK Vijay First Anniversary Speech in Telugu | ఒకడు ఫాసిజం..ఇంకోడు పాయసం..మాటల దాడి చేసిన విజయ్ | ABP DesamMS Dhoni Morse Code T Shirt Decoded | చెన్నై అడుగుపెట్టిన ధోని..ఊహించని షాక్ ఇచ్చాడు | ABP DesamSri Mukha Lingam  Temple History | శివుడు లింగం రూపంలో కాకుండా ముఖరూపంలో కనిపించే ఆలయం | ABP DesamTirumala Kshethra Palakudu Rudrudu Temple | కోనేటి రాయుడి క్షేత్రానికి కాపలా ఈయనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sri Reddy Arrest?: పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
Telangana Latest News: రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
Posani Krishan Murali Arrest: నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
Ram Pothineni: రైటర్‌గా మారిన రామ్ పోతినేని... మహేష్ బాబు సినిమాలో లవ్ సాంగ్ రాసిన హ్యాండ్సమ్ హీరో
రైటర్‌గా మారిన రామ్ పోతినేని... మహేష్ బాబు సినిమాలో లవ్ సాంగ్ రాసిన హ్యాండ్సమ్ హీరో
Universal Pension Scheme: సార్వత్రిక పింఛన్‌ పథకంతో ఉన్న స్కీమ్స్‌ పోతాయా? - మోదీ ప్రభుత్వం ఆలోచన ఏంటీ?
సార్వత్రిక పింఛన్‌ పథకంతో ఉన్న స్కీమ్స్‌ పోతాయా? - మోదీ ప్రభుత్వం ఆలోచన ఏంటీ?
Yogi Adityanath Mahakumbh Mela Closing Ceremony: చీపురు పట్టిన సీఎం .. ఊడ్చిపడేశారు!
చీపురు పట్టిన సీఎం .. ఊడ్చిపడేశారు!
Pawan Kalyan News: పార్టీ ప్లీనరీ ముందు ఈ స్టేట్మెంట్ అవసరమా జనసేనానీ
పార్టీ ప్లీనరీ ముందు ఈ స్టేట్మెంట్ అవసరమా జనసేనానీ
Apsara OTT release: 'అప్సర'తో ఆహా కొత్త ప్రయోగం... ఈ టీజర్ చూశారా ? వర్టికల్ వెబ్ సిరీస్ అంటే ఏంటో తెలుసా?
'అప్సర'తో ఆహా కొత్త ప్రయోగం... ఈ టీజర్ చూశారా ? వర్టికల్ వెబ్ సిరీస్ అంటే ఏంటో తెలుసా?
Embed widget