(Source: Poll of Polls)
AP Engineering colleges: ఏపీలో టాప్ 10 ఇంజినీరింగ్ కళాశాలలు ఇవే!
Top 10 Engineering colleges in AP: ఎన్ ఐ ఆర్ ఎఫ్ జాబితాలో టాప్-200లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 10 ఇంజినీరింగ్ కళాశాలలు స్థానం సంపాదించుకున్నాయి.
Top 10 Engineering colleges in AP: ఏపీలో టాప్ ఇంజినీరింగ్ కళాశాలలు ఇవే!
విద్యార్థులు ఇంటర్ పూర్తి కాగానే ఇంజినీరింగ్, మెడిసిన్, బీ ఫార్మసీ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరుతుంటారు. ప్రస్తుతం ఇంటర్ పూర్తయిన విద్యార్థులు మంచి కాలేజీలు ఏమున్నాయి అని సెర్చ్ చేస్తున్నారా. అయితే వారు ఈ వివరాలపై ఓ లుక్కేస్తే బెటర్. ఎన్ఐఆర్ఎఫ్ జాబితాలో టాప్-200లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 10 ఇంజినీరింగ్ కళాశాలలు చోటు దక్కించుకున్నాయి.
కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ ఐ ఆర్ ఎఫ్) 2023 సంవత్సరానికి గానూ దేశంలోని ఇంజినీరింగ్ కళాశాలల ర్యాంకులను వెల్లడించింది. టాప్ - 200లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 10 కాలేజీలు చోటు దక్కించుకున్నాయి. బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్, ప్రతి ఏడాది విద్యార్థుల ఫలితాలు లాంటి ఎన్నో అంశాలను పరిగణనలోకి ర్యాంకులను కేటాయిస్తుంటారు. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్ ఐ ఆర్ ఎఫ్) 2023 సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాలుగు కాలేజీలు టాప్ -100లో స్థానం పొందాయి.
గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ (కేఎల్ ఇంజినీరింగ్ కాలేజీ) ఎన్ ఐ ఆర్ ఎఫ్ వెల్లడించిన ర్యాంకింగ్‌లో 44వ స్థానం సాధించింది. తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) 59వ స్థానం, గుంటూరులోని విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ 85, విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 94వ ర్యాంకును పొందాయి.
ఇంకా ఈ జాబితాలో టాప్ 200లో విశాఖపట్నానికి చెందిన గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, జేఎన్‌టీయూ కాకినాడ, జేఎన్‌టీయూ అనంతపురం, విజయవాడలోని వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల (141 ర్యాంకు), తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాల (165వ ర్యాంకు), తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, లు చోటు దక్కించుకున్నాయి.