(Source: ECI/ABP News/ABP Majha)
TG PGECT 2024: నేటి నుంచి 'టీజీ పీజీఈసెట్-2024' పరీక్షలు, హాజరుకానున్న 22 వేలకుపైగా అభ్యర్థులు
TG PGECET-2024 పరీక్షలు జూన్ 10 నుంచి ప్రారంభంకానున్నాయి. జూన్ 13 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు 22,712 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
TG PGECET - 2024: తెలంగాణలోని పీజీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలకు'TG PGECET-2024' పరీక్షలు జూన్ 10 నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 13 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పరీక్ష హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పీజీఈసెట్ పరీక్షకు సంబంధించి మొత్తం 19 సబ్జెక్టులకు 22,712 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అమ్మాయిలు 12,532 మంది, అబ్బాయిలు 10,180 మంది ఉన్నారు. వీరిలో ఫార్మసీకి 7,376 మంది, కంప్యూటర్ సైన్స్-ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీకి 4,903 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే 10 సబ్జెక్టులకు 100 మంది లోపు మాత్రమే దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
పరీక్ష షెడ్యూలు ఇలా..
➥ జూన్ 10న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జియో ఇంజినీరింగ్ అండ్ జియోఇన్‌ఫర్మాటిక్స్, ఫార్మసీ విభాగాలకు; మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు.
➥ జూన్ 11న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలకు; మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు.
➥ జూన్ 12న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజినీరింగ్ విభాగాలకు; మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, మెటలర్జిక్ ఇంజినీరింగ్ విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు.
➥ జూన్ 13న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ విభాగానికి; మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నానోటెక్నాలజీ విభాగానికి పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్ష విధానం:
మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు, పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతం (30 మార్కులు)గా నిర్నయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్.
తెలంగాణలోని పీజీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'TS PGECET-2024' నోటిఫికేషన్ మార్చి 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 16న ప్రారంభమైంది. అభ్యర్థుల నుంచి ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మే 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఇక రూ.250 ఆలస్య రుసుంతో మే 14 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అదేవిధంగా రూ. 1000 ఆలస్య రుసుముతో మే 17 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రూ.2,500 ఆలస్య రుసుముతో మే 21 వరకు, రూ.5,000 ఆలస్య రుసుంతో మే 25 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 10 నుంచి 13 వరకు టీఎస్‌పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ముఖ్యమైన తేదీలు..
➥ పీజీసెట్ నోటిఫికేషన్: 12-03-2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16-03-2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ (అపరాధ రుసుము లేకుండా): 10-05-2024.
➥ దరఖాస్తుల సవరణ: 14-05-2024 - 16-05-2024.
➥ రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 14-05-2024.
➥ రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 17-05-2024.
➥ రూ.2500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 21-05-2024.
➥ రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 25-05-2024.
➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 28-05-2024 నుంచి.
➥ పరీక్ష తేదీలు: 10-06-2024 - 13-06-2024 వరకు.