అన్వేషించండి

TG EAPCET 2026 Toppers List: తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే

eapcet.tgche.ac.in TG EAPCET Results 2026 | ఈ ఏడాది తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగంలో రుషి టాపర్‌గా నిలవగా, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో ముకర్రం అహ్మద్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణ EAPCET ఇంజినీరింగ్ ఫలితాలు విడుదలయ్యాయి.
  • మేడ్చల్ జిల్లా విద్యార్థి ఎం. రుషి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు.
  • ఇంజినీరింగ్ విభాగంలో 73% మంది విద్యార్థులు అర్హత సాధించారు.
  • అగ్రికల్చర్, ఫార్మసీలో హైదరాబాద్ విద్యార్థి ముకర్రం అహ్మద్ టాప్ మార్కులు పొందాడు.

Telangana EAPCET 2026 Results | హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యామండలి (TGCHE) ఆదివారం ఉదయం విడుదల చేసిన టీజీ ఎప్‌సెట్ (TG EAPCET - ఇంజినీరింగ్) ఫలితాలలో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. జేఎన్‌టీయూ హైదరాబాద్ (JNTU-H) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా,  ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి ఆదివారం విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://eapcet.tgche.ac.in/ లో ఫలితాలు చెక్ చేసుకోవడంతో పాటు ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇంజనీరింగ్ అభ్యర్థులు ఫలితాల కోసం క్లిక్ చేయండి 

అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులు ఫలితాల కోసం క్లిక్ చేయండి

ఈ ఏడాది విడుదలైన ఇంజినీరింగ్ ఫలితాలలో మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన ఎం. రుషి (M. Rushi) 156.63 మార్కులతో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచారు. ఈ ఫలితాలలో ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 1.44 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించి 73% ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో హైదరాబాద్ జిల్లాకు చెందిన ముకర్రం అహ్మద్ 150.17 మార్కులతో టాపర్‌గా నిలిచాడు.

 

తెలంగాణ టీజీ ఎప్‌సెట్ (TG EAPCET - 2026) ఇంజినీరింగ్ విభాగం టాప్-10 ర్యాంకర్ల వివరాలు 

మొదటి ర్యాంకు: ఎం. రుషి – మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా (మార్కులు: 156.63)

రెండో ర్యాంకు: బేజుగమ అన్షుల్ – హైదరాబాద్ జిల్లా (మార్కులు: 148.70)

మూడో ర్యాంకు: మారక వంశీధర్ రెడ్డి – కడప జిల్లా (ఆంధ్రప్రదేశ్) (మార్కులు: 147.05)

నాలుగో ర్యాంకు: జొన్నల రోషన్ మణదీప్ రెడ్డి – గుంటూరు జిల్లా (ఆంధ్రప్రదేశ్) (మార్కులు: 144.44)

ఐదో ర్యాంకు: ఆడుల సాయి నికిత్  – మహబూబ్‌నగర్ జిల్లా (మార్కులు: 143.307)

ఆరో ర్యాంకు: మల్లవరపు ఆస్న  – మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా (మార్కులు: 143.289)

ఏడో ర్యాంకు: వివస్ శరద్ మహేశ్వరి  – హైదరాబాద్ జిల్లా (మార్కులు: 142.92)

ఎనిమిదో ర్యాంకు: తెల్లూరి శ్రేయస్ రెడ్డి  – హైదరాబాద్ జిల్లా (మార్కులు: 140.24)

తొమ్మిదో ర్యాంకు: బొమ్మిరెడ్డి సమీర్ రాజ్ రెడ్డి  – రంగారెడ్డి జిల్లా (మార్కులు: 139.85) 

పదో ర్యాంకు: రాపోలు జయంత్ శేఖర్ – మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా (మార్కులు: 139.78)

Also Read: CBSE New Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి

తెలంగాణ టీజీ ఎప్‌సెట్ (TG EAPCET - 2026) అగ్రికల్చర్, ఫార్మసీ (Agriculture & Pharmacy) విభాగం టాప్-10 ర్యాంకర్ల వివరాలు.. 

మొదటి ర్యాంకు: ముకర్రం అహ్మద్ – హైదరాబాద్ జిల్లా (మార్కులు: 150.17)  

రెండో ర్యాంకు: తాడూరి నివృత్ సాయి వెంకట్ – హైదరాబాద్ జిల్లా (మార్కులు: 143.43)  

మూడో ర్యాంకు: సాహితి గీతిక గునితి  – రంగారెడ్డి జిల్లా (మార్కులు: 142.35)  

నాలుగో ర్యాంకు: మయూక్ జయసింహ  – హైదరాబాద్ జిల్లా (మార్కులు: 139.78)  

ఐదో ర్యాంకు: అమైర్ అనాస్  – హైదరాబాద్ జిల్లా (మార్కులు: 137.40)

ఆరో ర్యాంకు: నాథన్ షెబా జెరూషా  – శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్ (మార్కులు: 137.24)

ఏడో ర్యాంకు: పెరికేటి అనురాగ్  – తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ (మార్కులు: 136.67)

ఎనిమిదో ర్యాంకు: బూర సాయి శరణ్  – సూర్యాపేట జిల్లా (మార్కులు: 135.21)

తొమ్మిదో ర్యాంకు: మారుతి సత్య శ్రీకర్  – తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ (మార్కులు: 134.97)

పదో ర్యాంకు: రుతుంబిక మొహంతి  – మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా (మార్కులు: 134.57)

Frequently Asked Questions

టీజీ ఎప్‌సెట్ 2026 ఇంజినీరింగ్ ఫలితాలను ఎక్కడ చూడవచ్చు?

టీజీ ఎప్‌సెట్ 2026 ఇంజినీరింగ్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://eapcet.tgche.ac.in/ లో చూడవచ్చు మరియు ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టీజీ ఎప్‌సెట్ 2026 ఇంజినీరింగ్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఎవరు?

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన ఎం. రుషి 156.63 మార్కులతో ఇంజినీరింగ్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచారు.

టీజీ ఎప్‌సెట్ 2026 అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో టాపర్ ఎవరు?

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో హైదరాబాద్ జిల్లాకు చెందిన ముకర్రం అహ్మద్ 150.17 మార్కులతో టాపర్‌గా నిలిచారు.

ఈ ఏడాది టీజీ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ ఫలితాలలో ఉత్తీర్ణత శాతం ఎంత?

ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో 1.44 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించి, 73% ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget