PSTU CET: పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ప్రవేశ పరీక్షలు వాయిదా, త్వరలోనే కొత్త షెడ్యూలు!
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 27, 28 తేదీల్లో జరగాల్సిన ప్రవేశ పరీక్ష వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 27, 28 తేదీల్లో జరగాల్సిన ప్రవేశ పరీక్ష (PSTUCET-2023) వాయిదా వేస్తున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ జులై 25న ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు కోర్సుల్లో ప్రవేశాలకు జరగాల్సిన పరీక్షలను తర్వాత నిర్వహించనున్నట్టు తెలిపారు. కొత్త షెడ్యూలును త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో జులై 26, 27 తేదీల్లో విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విటర్‌లో తెలిపారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జులై 26, 27 తేదీలను రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెలవు దినాలుగా ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బుధ, గురువారాల్లో అన్ని పాఠశాలలకు సెలవులు అని వెల్లడించారు.
In view of incessant heavy rains in the state, Honourable Chief Minister Sri K Chandrashekhar Rao instructed state Education minister Smt Sabita Indra Reddy to declare holidays for two days tomorrow and day after tomorrow (Wednesday and Thursday) for all educational institutions+
— SabithaReddy (@SabithaindraTRS) July 25, 2023
తెలంగాణలో స్కూల్ టైమింగ్స్ లో మార్పులు, విద్యాశాఖ ఉత్తర్వులు..
విద్యా సంస్థల పనివేళల్లో మార్పులు చేసింది ప్రభుత్వం. ప్రైమరీ స్కూల్ వాళ్లకు (1 నుండి 5వ తరగతి వరకు) ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల స్కూల్ టైమ్ నిర్ణయించారు. ఉన్నత ప్రాథమిక పాఠశాల అంటే 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల స్కూల్ టైమింగ్స్ ను ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటలుగా నిర్ణయించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో మినహా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల పనివేళల్లో మార్పులు అమలులోకి వస్తాయని రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్.జేడీఎస్ఈలకు విద్యాశాఖ ఈ ఉత్తర్వులు పంపించింది. స్కూల్ యాజమాన్యాలకు సూచనలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చిన్నాపిల్లలని ఉదయం త్వరగా నిద్రలేవలేరని వారికి 9.30 గంటలకు తరగతులు మొదలు కావాలని కొందరు ప్రతినిధులు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆలోచించిన విద్యాశాఖ తాజాగా స్కూల్ పనివేళలను మార్చుతూ నిర్ణయం తీసుకుంది.
ఇకపై వారికి సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గత దశాబ్ద కాలానికి పైగా ఉమ్మడి ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులతో పాటు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించిన ఎస్టీ, ఎస్టీ విద్యార్థులకు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఫీజు చెల్లిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించిన బీసీ విద్యార్థులకు మొత్తం ఫీజు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.
పూర్తిసమాచారం కోసం క్లిక్ చేయండి..
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial