అన్వేషించండి

NMMS Notification: 'మెరిట్' స్కాలర్‌షిప్స్ నోటిఫికేషన్ విడుదల, రాతపరీక్ష ఎప్పుడంటే?

NMMS: తెలంగాణలో నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌-2024 నోటిఫికేషన్ వెలువడింది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు సెప్టెంబరు 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

National Means-cum-Merit Scholarship Scheme Notification: తెలంగాణలో 'నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌(NMMS)-2024' పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే దరఖాస్తుకు అర్హులు. అయితే రెసిడెన్షియల్‌ విధానంలో చదువుతున్నవారు మాత్రం దరఖాస్తుకు అనర్హులు. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థుల కోసం నిర్దేశించిన ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు సెప్టెంబరు 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుచేసుకున్నవారికి నవంబరు 24న రాతపరీక్ష నిర్వహించనున్నారు. 

దేశంలోని పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్‌షిప్ అందుతుంది.

వివరాలు

* నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2024-25

అర్హతలు..
✦ ఏడో తరగతిలో కనీసం 55 శాతం మార్కులు పొందిన విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు. తుది  ఎంపిక సమయం నాటికి ఎనిమిదో తరగతిలో 55 శాతం మార్కులు పొంది ఉండాలి. 
✦ ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో చదవుతూ ఉండాలి.
✦ కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం:  రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విద్యార్థుల దరఖాస్తులను ఆయా స్కూళ్లు సమర్పించాలి. అనంతరం ఆ దరఖాస్తుల ప్రింటవుట్లను, ధ్రువీకరణ పత్రాలను డీఈవోలకు పంపాలి. ప్రతి విద్యార్థికి పరీక్ష ఫీజు ఎస్‌బీఐ చలానా రూపంలో జతచేయాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా స్కాలర్‌షిప్‌ కోసం విద్యార్థులను ఎంపిక చేస్తారు. 

రాత పరీక్ష విధానం: ఈ స్కాలర్‌షిప్స్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల రాత పరీక్షలు నిర్వహిస్తారు. 

✦ మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌(మ్యాట్‌): ఈ పేపర్‌లో వెర్బల్, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్, క్రిటికల్‌ థింకింగ్‌ నుంచి 90 ప్రశ్నలు–90 మార్కులకు ఉంటాయి.

✦ స్కాలాస్టిక్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌(శాట్‌): ఈ పేపర్‌లోనూ 90ప్రశ్నలు –90 మార్కులకు ఉంటాయి. ఏడు, ఎనిమిది తరగతుల స్థాయిలో బోధించిన సైన్స్, సోషల్, మ్యాథ్స్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పరీక్ష సమయం: ఒక్కో పేపరుకు 90 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు.

కనీస అర్హత మార్కులు: రెండు పరీక్ష(మ్యాట్, శాట్‌)ల్లో సగటున జనరల్‌ అభ్యర్థులకు 40 శాతం (36) మార్కులు, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 32 శాతం (29)మార్కులను కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు. జిల్లాను యూనిట్‌గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు కేటగిరీల వారీగా ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులకు రిజర్వేషన్‌ ప్రకారం అర్హత పొందిన విద్యార్థుల మెరిట్‌ లిస్ట్‌ తయారు చేస్తారు.

స్కాలర్‌షిప్ మొత్తం: ఎంపికైనవారికి నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసే వరకు ఉపకారవేతనం లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు..

➥ నోటిఫికేషన్ వెల్లడి: 12.08.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.08.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.09.2024.

➥ దరఖాస్తు ప్రింట్ కాపీలు, నామినల్ రోల్స్, ఫీజు రశీదు సంబంధిత ప్రిన్సిపల్స్‌కు సమర్పించడానికి చివరితేది: 13.09.2024.

➥ ప్రిన్సిపల్స్‌ ద్వారా అటేస్టేషన్ చేసిన నామినల్ రోల్స్, ఫీజు రశీదును సంబంధిత డీఈవోలకు సమర్పిండానికి చివరితేది: 18.09.2024.

Notification

Online Application

NMMS Notification: 'మెరిట్' స్కాలర్‌షిప్స్ నోటిఫికేషన్ విడుదల, రాతపరీక్ష ఎప్పుడంటే?

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget