అన్వేషించండి

TS LAWCET: టీఎస్‌ లాసెట్ - 2023 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్య తేదీలివే!

TS LAWCET విడత కౌన్సెలింగ్  డిసెంబరు 11 నుంచి ప్రారంభం కానుంది. డిసెంబరు 13 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి డిసెంబరు 19న సీట్లను కేటాయించనున్నారు.

Telangana LAWCET/PGLCET 2023 Counseling: లాసెట్ చివరి విడత కౌన్సెలింగ్  డిసెంబరు 11 నుంచి ప్రారంభం కానుంది. డిసెంబరు 13 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసినవారు డిసెంబరు 14 నుంచి 16 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి డిసెంబరు 19న సీట్లను కేటాయించనున్నారు. సీటస్లు పొందిన అభ్యర్థులు డిసెంబరు 20 నుంచి 23లోపు నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించిపు రశీదు, విద్యార్హతల సర్టిఫికేట్లతో సంబంధింత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మూడేళ్లు, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లు మొత్తం 6,894 అందుబాటులో ఉండగా 5,912 మందికి తొలి విడతలో సీట్లు దక్కాయి. వారిలో 65 శాతం మంది వరకు కళాశాలల్లో చేరారు. చివరి విడతకు 40 శాతం సీట్లు అందుబాటులో ఉండొచ్చని, రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.

తుదివిడత కౌన్సెలింగ్‌ షెడ్యూలు ఇలా..

➥ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్: 11-12-2023 నుంచి 13-12-2023 వరకు.

➥ అర్హులైన అభ్యర్థుల జాబితా, ఈమెయిల్ ద్వారా అభ్యంతరాల స్వీకరణ: 14-12-2023.

➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు: 14-12-2023 నుండి 16-12-2023 వరకు.

➥ వెబ్‌ ఆప్షన్ల సవరణ: 16-12-2023.

➥ సీట్ల కేటాయింపు: 19-12-2023.

➥  ఫీజు చెల్లించి, సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్, ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన: 20-12-2023 నుంచి 23-12-2023 వరకు.

Counselling Notification
Counselling Website

తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు..
తెలంగాణలోని లా కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తొలివిడత కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు అధికారులు నవంబరు 30న సీట్లను కేటాయించారు. మూడేళ్లు, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ (LLB)తో పాటు ఎల్‌ఎల్‌ఎం (LLM) కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్లు మొత్తం 6,894 అందుబాటులో ఉన్నాయి. వాటి కోసం 12,835 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. అందులో 5,912 మందికి (85.75%) సీట్లు దక్కాయి. సీట్లు పొందిన వారు డిసెంబరు 6లోపు నిర్ణీత ఫీజు చెల్లించి, సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. డిసెంబరు 4 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. 

సీట్ల భర్తీ వివరాలు ఇలా..
➥ మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో మొత్తం 4,064 సీట్లు అందుబాటులో ఉండగా.. 3,589 సీట్లు భర్తీ అయ్యాయి.
➥ అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీలో మొత్తం 1,903 సీట్లు అందుబాటులో ఉండగా.. 1,579 సీట్లు భర్తీ అయ్యాయి.
➥ ఇక రెండేళ్ల పీజీ లాడిగ్రీలో మొత్తం 927 సీట్లు అందుబాటులో ఉండగా.. 744 సీట్లు భర్తీ అయ్యాయి.

సీట్ల వివరాలు ఇలా..
➥ మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు పరీక్షలో మొత్తం 20,234 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. రాష్ట్రంలోని 22 కళాశాలల్లో మొత్తం 4,790 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
➥ అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు పరీక్షలో మొత్తం 6,039 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. రాష్ట్రంలోని 19 కళాశాలల్లో మొత్తం 2,280 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
➥ ఇక రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం పరీక్షలో మొత్తం 2,776 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. రాష్ట్రంలోని 17 కళాశాలల్లో మొత్తం 930 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

టీఎస్‌ లాసెట్‌, పీజీ లాసెట్‌ ప్రవేశ పరీక్ష మే 25న మూడు సెష‌న్లలో నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి సెష‌న్‌ను ఉద‌యం 9:30 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు, రెండో సెష‌న్‌ను మ‌ధ్యాహ్నం 12:30 నుంచి 2 గంట‌ల వ‌ర‌కు నిర్వహించారు. ఐదేండ్ల లా డిగ్రీ కోర్సు విద్యార్థుల‌కు మూడో సెష‌న్‌లో సాయంత్రం 4 నుంచి 5:30 గంట‌ల వ‌ర‌కు నిర్వహించారు. ఈ ఏడాది లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలకు దాదాపు 30 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించనున్నారు. పరీక్షల ఆన్సర్ కీని మే 29న ఆన్సర్ కీని విడుదల చేశారు. ఆన్సర్ కీపై మే 31 వరకు దరఖాస్తులు స్వీకరించారు. లాసెట్ ర్యాంకుల ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. మొద‌టి, రెండో సెష‌న్లకు తెలంగాణ‌లో 60, ఆంధ్రప్రదేశ్‌లో 4 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. మూడో సెష‌న్‌కు తెలంగాణ‌లో 41, ఏపీలో 4 కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. మూడేండ్ల లా డిగ్రీ కోర్సుకు 31,485 మంది, ఐదేండ్ల లా డిగ్రీ కోర్సుల‌కు 8,858 మంది, ఎల్ఎల్ఎంకు 3,349 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. లాసెట్, పీజీ ఎల్‌సెట్‌కు 43,692 మంది హాజ‌రయ్యారు కానున్నారు. పరీక్షకు హాజరైనవారిలో లాసెట్‌ (మూడేళ్ల ఎల్ఎల్‌బీ)లో 78.59 శాతం, లాసెట్ (ఐదేండ్ల ఎల్ఎల్‌బీ)లో 80.21 శాతం, పీజీ ఎల్‌సెట్‌(ఎల్ఎల్ఎం)లో 94.36 శాతం ఉత్తీర్ణత సాధించారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget