అన్వేషించండి

TG LAWCET: తెలంగాణ లాసెట్ చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, రిజిస్ట్రేషన్ ఎప్పటినుంచంటే?

LAWCET: తెలంగాణలో లా కాలేజీల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానుంది. సెప్టెంబరు 30న కళాశాలలవారీగా సీట్లను కేటాయించనున్నారు.

TG LAWCET Counselling Schedule: తెలంగాణలోని న్యాయకళాశాలల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో, చివరి విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వెలువడింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. సెప్టెంబరు 17 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను సెప్టెంబరు 22న ప్రకటించనున్నారు. అభ్యర్థులకు సెప్టెంబరు 23, 24 తేదీల్లో వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. వెబ్‌‌ఆప్షన్లు మార్చుకునేందుకు సెప్టెంబరు 25న అవకాశం కల్పించారు. ఇక సెప్టెంబరు 30న కళాశాలలవారీగా సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందినవారు అక్టోబరు 1 నుంచి 4 వరకు ఆయా కళాశాలల్లో నిర్ణీత ట్యూషన్ ఫీజు రసీదుతో, ఒరిజినల్ ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 

మొదటి విడతలో 5,363 మందికి సీట్ల కేటాయింపు..
తెలంగాణలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా డిగ్రీ కోర్సుతోపాటు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సులో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియలో మొదటి విడత సీట్లను సెప్టెంబరు 3న కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సులో 4,285 సీట్లు, ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల కోర్సులో 2,039 సీట్లు కలిపి మొత్తం 6,324 సీట్లు కన్వీనర్‌ కోటాలో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 14,817 మంది వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోగా.. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు ల్లో 3,901 మంది, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో 1,462 మంది కలిపి మొత్తం 5,363 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు.  

ALSO READ: ఏపీ 'టెట్' అభ్యర్థులకు అలర్ట్, హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్- డౌన్‌లోడింగ్ ఎప్పటినుంచంటే?

లాసెట్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు..

➤  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ పేమెంట్, వెరిఫికేషన్ కోసం సర్టిఫికేట్ల అప్‌లోడ్: 17.09.2024 - 21.09.2024.

➤  కౌన్సెలింగ్‌ అర్హుల జాబితా ప్రకటన: 22.09.2024.

➤  వెబ్‌ఆప్షన్ల నమోదు: 23.09.2024 - 24.09.2024.

➤  వెబ్‌ఆప్షన్ల సవరణకు అవకాశం: 25.09.2024.

➤  సీట్ల కేటాయింపు: 30.09.2024.

➤  సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్: 01.10.2024 - 04.10.2024.

LLB Counselling Notification
LLM Counselling Notification
Website

రాష్ట్రంలో ఈ ఏడాది లాసెట్/పీజీఎల్‌సెట్ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ జూన్‌ 3న నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించింది. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు రెండో సెషన్‌లో, సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్‌లో పరీక్షలు జరిగాయి. టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలు తొలి రెండు సెషన్లు కలిపి మొత్తం 68 కేంద్రాల్లో నిర్వహించారు. ఇందులో తెలంగాణలో 64 కేంద్రాలు, ఏపీలో 4 కేంద్రాలు ఉన్నాయి. ఇక మూడో సెషన్‌ పరీక్షలను మొత్తం 50 కేంద్రాల్లో నిర్వహించారు. ఇందులో తెలంగాణలో 46 కేంద్రాలను, ఏపీలో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ప్రవేశ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50,684 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మూడేళ్ల లా కోర్సు కోసం 36,079 మంది, ఐదేళ్ల లా కోర్సు కోసం 10,197 మంది, ఎల్‌ఎల్‌ఎం పరీక్ష కోసం 4,408 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 50,684 మంది అభ్యర్థులకు గాను.. 40,268 మంది  పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలో మొత్తం 79.45 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
Embed widget