Inter Halltickets: వెబ్‌సైట్‌లో ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Telangana Inter Halltickets: తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు.
![Inter Halltickets: వెబ్‌సైట్‌లో ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి Telangana Intermediate Board has released Inter Exam Halltickets download now Inter Halltickets: వెబ్‌సైట్‌లో ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/24/27611de783b1fc0a1c4ff8d6a3ffe8c91708784975955522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TS Inter Halltickets: తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎస్సెస్సీ లేదా మొదటి ఏడాది హాల్‌టికెట్ నంబరుతో థియరీ పరీక్షల హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెండో ఏడాది వారు మొదటి సంవత్సరం లేదా రెండో ఏడాది హాల్‌టికెట్ నంబరుతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లలో ఫొటోలు, సంతకాలు, ఇతర సవరణలు అవసరమైతే కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లి, సరిచేయించుకునే వెసులుబాటు ఉంటుంది.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు.
ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు (Student Hall Tickets -IPE MARCH 2024) ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
➥ ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- https://tsbie.cgg.gov.in/
➥ అక్కడ హోంపేజీలో 'Student Hall Tickets -IPE MARCH 2024' విభాగంలోకి వెళ్లాలి.
➥ అందులో ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, బ్రిడ్జ్ కోర్సుకు సంబంధించిన హాల్‌టికెట్లకు సంబంధించిన లింక్స్ మీద క్లిక్ చేయాలి.
హాల్‌టికెట్ల కోసం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు పదోతరగతి లేదా గతపరీక్ష హాల్‌టికెట్ నెంబరు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరం లేదా ఇంటర్ రూల్ నెంబరు, బ్రిడ్జ్ కోర్సు విద్యార్థులు పదోతరగతి లేదా రూల్ నెంబరు వివరాలు నమోదుచేసి సమర్పించాల్సి ఉంటుంది.
➥ వివరాలు నమోదుచేయగానే పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు కంప్యూటర్ తెరమీద కనిపిస్తాయి.
➥ విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
➥ హాల్‌టికెట్లు ప్రింట్ తీసుకొని, పరీక్షరోజు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
Inter Bridge Course HallTicket
ఇంటర్ పరీక్షల షెడ్యూలు..
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు..
➥ 28-02-2024: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I
➥ 01-03-2024: ఇంగ్లిష్ పేపర్-I
➥ 04-03-2024: మ్యాథమెటిక్స్ పేపర్-IA, బాటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్-I
➥ 06-03-2024: మ్యాథమేటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్-I
➥ 11-03-2024: ఫిజిక్స్ పేపర్-I, ఎకనామిక్స్ పేపర్-I
➥ 13-03-2024: కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్-I
➥ 15-03-2024: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-I
➥ 18-03-2024: మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-I, జియోగ్రఫీ పేపర్-I
ఇంటర్ సెకండ్ పరీక్షలు..
➥ 29-02-2024: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
➥ 02-03-2024: ఇంగ్లిష్ పేపర్-II
➥ 05-03-2024: మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బాటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II
➥ 07-03-2024: మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II
➥ 12-03-2024: ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ పేపర్-II
➥ 14-03-2024: కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్-II
➥ 16-03-2024: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-II
➥ 19-03-2024: మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-II, జియోగ్రఫీ పేపర్-II
ALSO READ:
Inter Halltickets: ఏపీ ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలక సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రూల్ నంబర్/ ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్ నంబర్‌తో హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)