TS Inter Supplementary Exams: నేటి నుంచి తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
షెడ్యూలు ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
TS Inter Supplementary Exams: తెలంగాణలో ఆగస్టు 1 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,34,329 మంది, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,13,267 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఫస్టియర్‌లో 2,94,378 మంది, సెకండ్ ఇయర్‌లో 4,63,370 మంది..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9.28 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. మే 6 నుంచి 23 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మే 7 నుంచి 24వ వరకు సెంకడ్ ఇయర్ పరీక్షలను నిర్వహించారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో మొత్తం 2,94,378 మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండ్ ఇయర్‌లో 4,63,370 మంది ఉత్తీర్ణులయ్యారు. రెగ్యూలర్ పరీక్షల్లో ఫెయిలైన వారికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
హాల్‌టిక్కెట్లు అందుబాటులో..
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల (TS Inter Supplementary Exams 2022)కు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన సంగతి విదితమే. ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల (Telangana Inter Supplementary Exams 2022 ) హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ పదోతరగతి హాల్‌టికెట్ నెంబర్ లేదా పాత హాల్‌టికెట్ నెంబర్ లేదా రూల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ పొందవచ్చు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు
మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్:
- ఆగస్టు 1 - సెకండ్ లాంగ్వేజ్
- ఆగస్టు 2 - ఇంగ్లిష్
- ఆగస్టు 3 - మ్యాథ్స్ పేపర్–1ఎ, బోటనీ, పొలిటికల్ సైన్స్
- ఆగస్టు 4 - మ్యాథ్స్–1బి, హిస్టరీ, జువాలజీ
- ఆగస్టు 5 - ఫిజిక్స్, ఎకనావిుక్స్
- ఆగస్టు 6 - కెవిుస్ట్రీ, కామర్స్
- ఆగస్టు 8 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ (బైపీసీ విద్యార్థులకు)
- ఆగస్టు 10 - మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ.
సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్:
- ఆగస్టు 1 - సెకండ్ లాంగ్వేజ్
- ఆగస్టు 2 - ఇంగ్లిష్
- ఆగస్టు 3 - మ్యాథ్స్ పేపర్–2ఎ, బోటనీ, పొలిటికల్ సైన్స్
- ఆగస్టు 4 - మ్యాథ్స్–2బి, హిస్టరీ, జువాలజీ
- ఆగస్టు 5 - ఫిజిక్స్, ఎకనావిుక్స్
- ఆగస్టు 6 - కెవిుస్ట్రీ, కామర్స్
- ఆగస్టు 8 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ (బైపీసీ విద్యార్థులకు)
- ఆగస్టు 10 - మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ