అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

TS SSC Exams: పదోతరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక నుంచి ఎన్ని పేపర్లంటే?

కరోనా కారణంగా రెండేళ్ళ పాటు విద్యార్ధులకు పరీక్షల నిర్వహణలో రకరకాల సమస్యలు తలెత్తాయి. దీంతో గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా ఆరు పేపర్ల విధానాన్ని అమలు చేశారు. ఇకపై ఇదే విధానాన్ని కొనసాగించనున్నారు.

తెలంగాణలో పదోతరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పదోతరగతి పరీక్షలను 6 పేపర్లతోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 పేపర్లతో పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. హిందీ మినహా మిగతా సబ్జెక్టులకు రెండు పేపర్లు చొప్పున పరీక్షలు ఉంటున్నాయి. అయితే గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా ఆరు పేపర్ల విధానాన్ని అమలు చేశారు. కరోనా కారణంగా రెండేళ్ళ పాటు విద్యార్ధులకు పరీక్షల నిర్వహణలో రకరకాల సమస్యలు తలెత్తాయి. విద్యార్ధులు ఎలాంటి పరీక్షలు లేకుండానే 8,9 తరగతుల నుంచి ఉత్తీర్ణులై పదిలోకి వచ్చేశారు.

పదోతరగతి పరీక్ష విధానంపై సమీక్ష జరిపిన NCERT విద్యార్థులకు 11 రోజుల పాటు పరీక్షలు నిర్వహించడం వల్ల వారిపై ఒత్తిడి పెరుగుతోందని, వాటిని ఆరు పేపర్లకు కుదించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 6 పేపర్ల విధానానికే మొగ్గు చూపింది. పదో తరగతి విధి విధానాలను మారుస్తూ త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. నవంబర్1 నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ఎస్‌ఏ-1 పరీక్షలు జరగనున్నాయి. ఎస్‌ఏ-1 కూడా పదోతరగతికి 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించేలా అధికారులు షెడ్యూలు రూపొందించారు.


తెలంగాణలో ఈసారి పదోతరగతి వార్షిక పరీక్షలకు ఎప్పటిలాగా 11 పేపర్లే ఉంటాయని సెప్టెంబరులో పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంటే ఒక్క హిందీకి తప్ప మిగిలిన అయిదు సబ్జెక్టులకు రెండు పేపర్లు (పరీక్షలు) ఉంటాయి. ఈసారి సాధారణ పరిస్థితులే ఉన్నందున సిలబస్ కూడా తగ్గించలేదని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నుంచి సిలబస్ పేపర్లను తగ్గించాలని తమకు ఆదేశాలు లేవని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఆదేశాలతో ఇకపై పదోతరగతి పరీక్షలను 6 పేపర్లతోనే నిర్వహించనున్నారు. గత మే నెలలో జరిగిన వార్షిక పరీక్షలను ఆరు పేపర్లతోనే నిర్వహించిన విషయం తెలిసిందే.


ఏపీలో ఈ ఒక్క ఏడాదికే 6 పేపర్లు..
మరోవైపు ఏపీలో పదో తరగతి పబ్లిక్‌పరీక్షల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ 11 పేపర్లుగా నిర్వహిస్తున్న పదోతరగతి పరీక్షలను ఆరు పేపర్లకు కుదించింది. రెండేళ్ల కిందటి వరకు 11 పేపర్ల విధానమే అమలైంది. కొవిడ్‌అనంతరం 2021-22 విద్యాసంవత్సరానికి పరీక్షలను ఏడు పేపర్లతో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 22న పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కొవిడ్‌నేపథ్యంలో 11 పేపర్ల స్థానంలో ఏడు పేపర్ల విధానం అమలు చేస్తున్నామని ఎస్‌సీఈఆర్‌టీ తన ప్రతిపాదనలో పేర్కొంది. ఇప్పటి నుంచే విద్యార్థులు ఆరు పేపర్ల విధానానికి అలవాటు పడేలా ఈ విద్యా సంవత్సరం నుంచే ఆరు పేపర్ల విధానం తేనున్నట్లు పేర్కొంది. గతేడాది సైన్స్‌లో రెండు పేపర్లు(ఫిజిక్స్‌, బయాలజీ) ఉండగా, ఇకపై రెండిటికీ కలిపి ఒకే పరీక్ష ఉంటుందని తెలిపింది. అయితే, సైన్స్‌కు ప్రశ్నపత్రం ఒకటే అయినా, జవాబు పత్రాలు వేర్వేరుగా ఇస్తారని పేర్కొంది.  


Also Read:  వెబ్‌సైట్‌లో ఏపీ పదోతరగతి మోడల్ పేపర్లు - బ్లూప్రింట్స్, చెక్ చేసుకోండి!!



సప్లిమెంటరీ పరీక్షలకూ 7 పేపర్లు
అడ్వాన్స్‌డ్‌సప్లిమెంటరీ పరీక్షలను కూడా ఏడు పేపర్లతోనే నిర్వహిస్తారు. సామాన్య శాస్త్రం మినహా అన్ని సబ్జెక్టులకూ ఒకే పేపరు నిర్వహిస్తారు. ప్రతీ పేపర్ లో మొత్తం 33 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. సామాన్య శాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలు ఒకటిగా, జీవశాస్త్రం పేపర్లు ఒకటిగా ఇస్తారు. 100 మార్కుల పరీక్షకు 3.15 గంటల సమయం ఇవ్వగా... ప్రశ్నపత్రం చదువుకోవడానికి, రాసింది సరి చూసుకోవడానికి 15 నిమిషాలు, పరీక్ష రాయడానికి 3 గంటల సమయం ఉంటుంది. 7 పేపర్ల విధానాన్ని ఈ ఒక్క ఏడాదే అమలు మాత్రమే చేయనున్నారు. 2023 మార్చి నుంచి తిరిగి 11 పేపర్ల విధానం అమల్లోకి వస్తుంది.


:: Read Also ::

TS NMMS: తెలంగాణ ఎన్‌ఎంఎంఎస్ నోటిఫికేషన్ వచ్చేసింది! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను  నేషనల్‌ మీన్స్  కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్ష డిసెంబరు 12న నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబ‌రు 28 వరకు గడువు ఉంది. తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్ష ప్రశ్నపత్రాలు ఉంటాయి. ప్రతి రెవెన్యూ డివిజన్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి, దరఖాస్తు చేసుకోవచ్చు.
స్కాలర్‌షిప్, దరఖాస్తు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

AP NMMS: ఏపీ ఎన్ఎంఎంఎస్ నోటిఫికేషన్ విడుదల, ఎంపిక ఇలా!
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రకటనను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం తాజాగా విడుదల చేసింది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్‌షిప్ అందుతుంది.
స్కాలర్‌షిప్, దరఖాస్తు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

COVID Scholarships: కొవిడ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్, వీరికి ప్రత్యేకం!!
ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ ఫౌండేషన్‌ సామాజిక బాధ్యతలో భాగంగా కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల కోసం ‘కొవిడ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ను ప్రకటించింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌, డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ చదివే వారు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల నుంచి విద్యార్థుల పరిస్థితిని అంచనావేసి షార్ట్‌లిస్ట్‌ రూపొందిస్తారు. తర్వాత వీరికి టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ నిర్వహించి, ఎంపికైనవారికి స్కాలర్‌షిప్ అందజేస్తారు.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోకూడదంటే.. జాగ్రత్తలు ఇవే!Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Pamkuntla Sai Reddy: 'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Game Changer: ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
Embed widget