Telangana EAMCET Allotment Result 2025: తెలంగాణ EAMCET 2025 సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల! మీ సీటు వచ్చిందో లేదో తెలుసుకోండి!
Telangana EAMCET Allotment Result 2025:తెలంగాణలోని ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేయాలనుకునే విద్యార్థులకు బిగ్ అలర్ట్. మొన్న అప్లై చేసుకున్న వారికి సీట్ల కేటాయింపు పూర్తి అయింది.

Telangana EAMCET Allotment Result 2025:తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీలకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. విద్యార్థులు సెలెక్ట్ చేసుకున్న కాలేజీల్లో వారి ర్యాంకు ఆధారంగా సీట్ల కేటాయింపు ప్రక్రియను ఉన్నత విద్యాశాఖ పూర్తిచేసింది. ఏ ర్యాంకు విద్యార్థికి ఏ కాలేజీలో సీటు వచ్చిందో చెప్పే ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఆ రిజల్ట్స్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు.
ఫేజ్ 1లో విడుదల చేసిన సీట్ల కేటాయింపు ఫలితాలు ఎలా చూడాలి
తెలంగాణలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ లాంటి మెడికల్ కాలేజీల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం EAMCET ను నిర్వహిస్తారు. ఈసారి కూడా లక్షల మంది ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేశారు.అందులో విజయం సాధించిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. విద్యార్థులు ఇంటర్ ఫలితాల వివరాలు, కెటగిరీ వివరాలు, కుటుంబ ఆదాయంతోపాటు ఏ కాలేజీలో సీటు కావాలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఏ కోర్సు కావాలో కూడా తెలియజేశారు. ఆన్‌లైన్‌లో చేపట్టిన ప్రక్రియలో నిర్దేశించిన ఫీజు చెల్లించిన విద్యార్థులు ఇప్పుడు సీట్లు కేటాయిస్తూ ఉన్నత విద్యాశాఖాధికారులు వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టారు. వాటిని పరీశీలించాలంటే మీరు ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
- స్టెప్-1: EAMCET కు హాజరై, ఆన్‌లైన్ కౌన్సిలింగ్‌లో పాల్గొన్న విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ tgeapcet.nic.inకు వెళ్లాల్సి ఉంటుంది.
- స్టెప్-2: వెబ్‌సైట్‌లో ఈఎంసెట్ ప్రొవిజినల్ అలాట్‌మెంట్ రిజల్ట్స్ అనే లింక్ ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి.
- స్టెప్-3: వేరే పేజ్ ఓపెన్ అవుతుంది అందులో మీ లాగిన్ అడుగుతుంది. మీరు ఐడీ,పాస్‌వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది.
- స్టెప్-3: తర్వాత మీకు కేటాయించిన కాలేజి లిస్ట్ కోర్టు లిస్ట్ కనిపిస్తుంది.
- స్టెప్-4: ఆ అలాట్‌మెంట్ వివరాలను మీరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
కాలేజీ అలాట్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలి ?
మొదటి ఫేజ్ కౌన్సెలింగ్‌లో మీకు కేటాయించిన కాలేజ్, కోర్సు నచ్చినట్టైతే మీరు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ కాలేజీకి నిర్దేశించిన ఫీజును చెల్లించాలి. ఈ ఫీజు చెల్లింపు ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల్లో పూర్తి చేయాలి. అంటే జులై 22 సాయంత్ర లోపు ప్రక్రియ పూర్తి చేసిన వాళ్ల సీట్లు మాత్రమే కన్ఫామ్ అవుతాయి. ఆ తర్వాత చేయడానికి ఉండదు. వారి సీట్లను తర్వాత కౌన్సెలింగ్‌లో చూపిస్తారు.
మొదటి ఫేజ్‌లో సీట్లు పొందిన వారికి ఆగస్టులో క్లాస్‌లు ప్రారంభంకానున్నాయి. సీట్లు పొందిన అభ్యర్థులు వారికి కేటాయించిన కాలేజీకి వెళ్లి రిపోర్ట్ చేయాలి. ఈ కౌన్సెలింగ్‌లో సీటు రాకుంటే మరో దఫ కౌన్సెలింగ్ ఉంటుంది. అందులో పాల్గొని సీటు పొందవచ్చు. ఈసారి వచ్చిన కాలేజ్ కానీ కోర్సు కానీ నచ్చకుంటే కూడా రిజెక్ట్ చేసి మరోసారి జరిగే కౌన్సెలింగ్‌లో విద్యార్థులు పాల్గొనవచ్చు.





















