అన్వేషించండి

TS SSC Results 2022: తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకు అంతా సిద్ధం, రిజల్ట్స్ Step బై Step ఇలా చెక్ చేసుకోండి

TS 10th Results 2022: టెన్త్ ఫలితాల విడుదలకు ముందే రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలలో ప్రవేశాలు మొదలయ్యాయి. దాంతో లక్షల మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

TS SSC Results 2022: తెలంగాణలో 10 తరగతి పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. టెన్త్ ఫలితాల విడుదలకు ముందే రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలలో ప్రవేశాలు మొదలయ్యాయి. దాంతో లక్షల మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 2021-22 విద్యా సంవత్సరం టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ మే 28న జరిగిన సాంఘిక పరీక్షతో ముగిశాయి. ఒకేషనల్ విద్యార్థులకు జూన్‌ 1 న చివరి పరీక్ష జరిగింది.

జూన్ 30లోపు టీఎస్ టెన్త్ రిజల్ట్స్..
తెలంగాణలో మే 23న ప్రారంభమైన టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ మే 28తో ముగిశాయి. అయితే జూన్ 1న ఒకేషనల్ విద్యార్థులకు టెన్త్ పరీక్షలు ముగియగా.. ఆ మరుసటి రోజు జూన్‌ 2 నుంచి తెలంగాణ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ ప్రారంభించారు. ఈ ఏడాది 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 99 శాతం మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. 2,861 కేంద్రాలను ఏర్పాటు చేసి కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించారు. జూన్‌ 30న టెన్త్ రిజల్ట్స్ ప్రకటించాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది.

తెలంగాణ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి (How To Check TS SSC Results 2022)
Step 1: టెన్త్ క్లాస్ విద్యార్థులు మొదట తెలంగాణ టెన్త్ క్లాస్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ bse.telangana.gov.in సందర్శించాలి
Step 2: హోం పేజీలో టీఎస్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ (TS SSC Results 2022) లింక్ మీద క్లిక్ చేయండి 
Step 3: విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేయండి
Step 4: వివరాలు నమోదు చేసిన తరువాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ ఇవ్వండి
Step 5: మీ స్క్రీన్ మీద విద్యార్థి 10వ తరగతి ఫలితాలు కనిపిస్తాయి. TS SSC Results 2022 Marks మెమోను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి
Step 6: డౌన్‌లోడ్ చేసుకున్న టెన్త్ రిజల్ట్ పీడీఎఫ్‌ను భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసి పెట్టుకోవడం బెటర్.

ఈ ఏడాది తగ్గిన పేపర్లు, సిలబస్..
గతేడాది వరకు పదో తరగతి బోర్డు పరీక్షల్లో 11 పేపర్లు ఉండేవి. కరోనా వ్యాప్తి తర్వాత విద్యా సంవత్సరం కాస్త ఆలస్యంగా మొదలుకావడం, గత రెండేళ్లు పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. అప్పుడు నేరుగా విద్యార్థులను తరువాత తరగతులకు ప్రమోట్ చేశారు. ఈ ఏడాది పదకొండు పేపర్లకు బదులుగా 6 పేపర్లకు పరిమితం చేసి వారంలో పరీక్షలు పూర్తి చేశారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు పేపర్లతో పాటు సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ పెంచారు. తెలంగాణ పదవ తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 30లోగా విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన అనంతరం టెక్నికల్‌గా అన్ని అంశాలను త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Also Read: Telangana Inter Results: ఈ 26న తెలంగాణా ఇంటర్ ఫలితాల వెల్లడి! 15 రోజుల్లోనే సప్లమెంటరీ పరీక్షలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ind Vs Aus Test Series; మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Yadagirigutta: గ్రిల్స్ మధ్య ఇరుక్కున్న బాలుని తల - చాకచక్యంగా బయటకు తీసిన భక్తులు, యాదాద్రి ఆలయంలో ఘటన
గ్రిల్స్ మధ్య ఇరుక్కున్న బాలుని తల - చాకచక్యంగా బయటకు తీసిన భక్తులు, యాదాద్రి ఆలయంలో ఘటన
Embed widget