అన్వేషించండి

Telangana Inter Results: ఈ 26న తెలంగాణా ఇంటర్ ఫలితాల వెల్లడి! 15 రోజుల్లోనే సప్లమెంటరీ పరీక్షలు!

ఎట్టకేలకు తెలంగాణ ఇంటర్, టెన్త్ ఫలితాల తేదీ ఖరారైనట్టు తెలుస్తోంది. ఏబీపీ దేశం ప్రతినిధికి అందిన సమాచారం మేరకు రెండు రోజుల్లో ఇంటర్‌ రిజల్ట్స్‌ విడుదల చేస్తున్నట్టు సమాచారం.

తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఈ నెల 26న వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఫలితాలను విడుదల చేయడానికి తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఇంటర్ బోర్డు అధికారులు అనుమతి కోరినట్లు సమాచారం.

ఇప్పటకే ఇంటర్ ఫలితాల ప్రకటనపై అధికారులు ట్రయల్‌ రన్‌ చేస్తున్నారు. ఈ నెల 25నే ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని మొదట అధికారులు భావించారు. అయితే, కొంతమంది విద్యార్థుల మార్కులను కంప్యూటర్‌ ద్వారా ఫీడ్ చేయడంలో తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. దీంతో వాటిని సరిచేసేందుకు అధికారులు ప్రయత్నాలు జరిపారు. కాగా, ఇంటర్ పరీక్షల ఫలితాల వెల్లడి ఆలస్యమైనా ఫర్వాలేదని, తప్పులు మాత్రం దొర్లకూడదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారలుకు తెలిపినట్లు సమాచారం. 

గత ఏడాది కరోనా నేపథ్యంలో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 49 శాతం మాత్రమే రావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. చివరకు కనీస మార్కులతో అందరినీ పాస్ చేశారు. ఇలాంటి పరిస్థితి మరోసారి రాకూడదని అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఫలితాలను పరిశీలించి సక్రమంగా ప్రక్రియ ముగిసిందని నిర్థారించుకుంటేనే ఈ నెల 26వ తేదీన ఫలితాలను విడుదల చేయాలని మంత్రి చెప్పినట్లు తెలిసింది. 

ఇంటర్‌ ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని తల్లిదండ్రులు, విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మొత్తం ఈ సంవత్సరం ఇంటర్‌ పరీక్షలను 9,07,393 మంది రాశారు. ఇందులో 4,42,768 మంది సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు ఉన్నారు. మిగిలిన వాళ్లు మొదటి సంవత్సరం విద్యార్థులు.

ఇంటర్‌ పరీక్షలు మే 6న ప్రారంభమై 24 నాటికి పూర్తయ్యాయి. పరీక్షలు పూర్తైన ఇరవై రోజుల్లో ఫలితాలు ఇస్తామని గతంలోనే తెలంగాణ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. దీనిబట్టి జూన్‌ 25 లోపు ఫలితాలు వస్తాయని అంతా భావించారు కానీ.. ఇంత వరకు ఇంటర్‌బోర్డు మాత్రం అధికారికంగా ఎలాంటి తేదీ ప్రకటించలేదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వచ్చిన తేదీలను కూడా బోర్డు ఖండించింది. 

ఫలితాలు విడుదలయ్యాక కేవలం 15 రోజుల్లోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. తద్వారా ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Amit Shah In Hyderabad: తెలంగాణలో కాంగ్రెస్‌ను గద్దె దించాల్సిన టైమొచ్చింది, రాహుల్ ప్రధాని కాలేరు: అమిత్ షా
తెలంగాణలో కాంగ్రెస్‌ను గద్దె దించాల్సిన టైమొచ్చింది, రాహుల్ ప్రధాని కాలేరు: అమిత్ షా
Hyderabad Baby Dies: ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
Congress Politics: జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
Amit Shah In Hyderabad: చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా, సాయంత్రం హైదరాబాద్‌లో పాదయాత్ర
చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా, సాయంత్రం హైదరాబాద్‌లో పాదయాత్ర

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Urban Local Bodies Polling: ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీపోలింగ్.. ఈ 3న ఓట్ల లెక్కింపు
ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీపోలింగ్.. ఈ 3న ఓట్ల లెక్కింపు
Cyclone Musuru Helpline Numbers: ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
Hyderabad Baby Dies: ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
Congress Politics: జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
Upcoming Cars: ఈ నెలలో రాబోతున్న 4 కార్లు.. లగ్జరీ EVల నుంచి తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్' వరకు!
ఈ నెలలో లాంచ్‌ కానున్న 4 కొత్త కార్లు.. ఒక్కో కారుది ఒక్కో ప్రత్యేకత
Viral News: అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
Diwali Home Decoration : దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
Embed widget