అన్వేషించండి

TGTET: 'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం

TG TET: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల‌కు సన్నద్ధమయ్యే అభ్య‌ర్థుల‌కు ప్ర‌భుత్వం వెసులుబాటు క‌ల్పించింది. ఇకపై ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వ‌హించాలని నిర్ణ‌యించింది.

Telanagana TET Exam: తెలంగాణలోని ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహించనున్నట్లు నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్​ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ జులై 6న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఏటా జూన్, డిసెంబ‌ర్ నెల‌ల్లో టెట్ పరీక్ష నిర్వహించ‌నున్నారు. ఇక ఒక అభ్యర్థి ఎన్నిసార్లు అయినా టెట్ పరీక్ష రాయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే డీఎస్సీ రాసుకునేందుకు మాత్రం.. టెట్‌లో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించిన వారికే అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. టెట్ మార్కుల‌ను డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వనున్నారు.

సీబీఎస్‌ఈ ఏటా రెండుసార్లు సీటెట్ పరీక్ష నిర్వహిస్తోంది. అదే తరహాలో నేషనల్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఫర్‌‌‌‌ టీచర్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ (NCTE) ఏటా రెండుసార్లు టెట్‌‌‌‌ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా టెట్ గడువును జీవితకాలానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఒక్కసారి క్వాలిఫై అయితే, మరోసారి రాయాల్సిన అవసరం లేదు. టెట్ మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఉండటంతో కేవలం ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్కోర్ పెంచుకునేందుకు మాత్రమే రాసుకునే వెసులుబాటు కల్పించారు.

ఏటా ఒకసారి టెట్‌ నిర్వహిస్తామని 2015లో జీఓ 36 జారీ చేసినప్పటికీ.. ఇప్పటి వరకు కేవలం 5 సార్లు మాత్రమే టెట్ పరీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2016, 2017లో టెట్ నిర్వహించారు. అనంతరం 2018 నుంచి 2021 వరకు చేపట్టలేదు. మళ్లీ 2022, 2023, 2024లో వరుసగా నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011, 2012(రెండుసార్లు), 2014లో టెట్‌ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. 

TGTET: 'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్రంలో ఈ ఏడాది మే 20 నుంచి జూన 2 వరకు టెట్-2024 పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 జిల్లా కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. టెట్‌ పరీక్షలకు మొత్తం 2,86,381 దరఖాస్తు చేసుకోగా.. వారిలో పరీక్షలకు 2,36,487 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో పేపర్‌-1 పరీక్షకు మొత్తం 99,958 మంది దరఖాస్తు చేసుకోగా 86.03 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా పేపర్‌-2 పరీక్షకు 1,86,423 మంది దరఖాస్తులు చేసుకోగా.. 82.58 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 

మొదటి సారిగా ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని జూన్ 3న అధికారులు విడుదల చేశారు. దానిపై అభ్యంతరాలు స్వీకరించి తుది ఆన్సర్‌ కీని రూపొందించింది. జూన్ 12న ఫైనల్‌ ఆన్సర్‌ కీతోపాటు ఫలితాలను విద్యాశాఖ వెల్లడించింది. టెట్-2024 ఫలితాలకు సంబంధించి మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13% అర్హత నమోదుకాగా.. పేపర్-2లో 34.18 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్-2023 ఫలితాలతో పోల్చితే పేపర్-1లో 30.24 శాతం, పేపర్-2లో 18.88 శాతం అర్హత పెరగడం గమనార్హం. 

డీఎస్సీ నియామకాల్లో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఉపాధ్యాయ ఉద్యోగార్థులు టెట్ పరీక్షకు ప్రాధాన్యమిస్తారు. ప్రభుత్వ టీచర్‌ పోస్టుల నియామకాలకు నిర్వహించే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) రాసేందుకు టెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. కాబట్టి బీఎడ్, డీఎడ్‌ పూర్తిచేసిన అభ్యర్థులు టెట్‌ పరీక్షలో మంచి స్కోర్ సాధించేందుకు పోటీపడుతుంటారు. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress : తెలంగాణలో గాంధీ ఘరం ఘరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ ఘరం ఘరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress : తెలంగాణలో గాంధీ ఘరం ఘరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ ఘరం ఘరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
Embed widget