School Timings Change: చలి ఎఫెక్ట్, జిల్లాల్లో స్కూల్ టైమింగ్స్ మార్చిన కలెక్టర్ - ఉత్తర్వులు జారీ
ABP Desam Effect | చలి తీవ్రత పెరగడంతో స్కూల్ టైమింగ్స్ మార్చుతూ ఆదిలాబాద్ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
School Timings Change In Adilabad District | ఆదిలాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు, అన్ని వర్గాల వారిని ఏబీపీ దేశం పలకరించి వారి సమస్యలు తెలుసుకుంది. చలి తీవ్రతతో ఇబ్బంది పడుతున్నామని, స్కూల్ టైమింగ్స్ మార్చాలని విద్యార్థులు కోరారు. ఈ క్రమంలో ఆదిలాబాద్‌లో చలి తీవ్రత అధికంగా ఉందని ప్రైమరీ స్కూల్, హై స్కూల్ పని వేళల్లో మార్పులు చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.
ఉదయం 9.40 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకే పాఠశాల పని వేళలు అని నిర్ణయించారు. ఈ మేరకు ఆదిలాబాద్ కలెక్టర్ ఆదేశాలు జారి చేశారు. సాధారణంగా 9.15 గంటల నుంచి 4.15 వరకు స్కూల్ నిర్వహిస్తారు. అయితే కలెక్టర్ ఉత్తర్వులు డిసెంబర్ 19 నుంచి అమలులోకి రానున్నాయి. దాంతో గురువారం నుంచి చలి తీవ్రత తగ్గే వరకు తదుపరి ఉత్తర్వుల వరకు ప్రైమరీ స్కూల్, హై స్కూల్ పని వేళలు మారనున్నాయి.