అన్వేషించండి

TG PECET 2024: తెలంగాణ పీఈసెట్‌ హాల్‌టికెట్లు విడుదల - ఫిజికల్, స్కిల్ టెస్టులు ఎప్పటినుంచంటే?

TG PECET 2024: తెలంగాణ పీఈసెట్-2024 హాల్‌టికెట్లను శాతావాహన యూనివర్సిటీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. జూన్ 10 నుంచి 13 వరకు ఈవెంట్లు నిర్వహించనున్నారు.

Telangana PECET 2024 Halltickets: తెలంగాణలోని వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న 'టీజీ పీఈసెట్ (TG PECET)- 2024' హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 10 నుంచి 13 వరకు ఫిజికల్ టెస్ట్, స్కిల్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ ఏడాది టీఎస్ పీఈసెట్‌ను శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ పరీక్షల బాధ్యతను స్వీకరించిన సంగతి తెలిసిందే. పీఈసెట్ పరీక్షల ద్వారా రాష్ట్రంలోని 20 వ్యాయామ కళాశాలల్లో బీపీఎడ్‌(B.PEd), డీపీఎడ్(D.PEd) కోర్సుల్లో సీట్లను భర్తీచేయనున్నారు. వీటిలో 16 బీపీఎడ్ కాలేజీల్లో 1660 సీట్లు, నాలుగు డీపీఎడ్ కాలేజీల్లో 350 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

Download PECET 2024 Halltickets..

ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ విధానం..

➥  మొత్తం 400 మార్కులకు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (ఫిజికల్ ఈవెంట్లు) నిర్వహిస్తారు. ఇందులో మొత్తం నాలుగు ఈవెంట్లు ఉంటాయి. ఒక్కో ఈవెంట్‌కు 100 మార్కులు కేటాయించారు.

➥ వీటిలో పురుషులకు 100 మీటర్ల పరుగు-100 మార్కులు, 800 మీటర్ల పరుగు-100 మార్కులు, షాట్‌పుట్(6 కేజీలు)-100 మార్కులు, లాంగ్ జంప్/హైజంప్-100 మార్కులు ఉంటాయి.

➥ ఇక మహిళలకు 100 మీటర్ల పరుగు-100 మార్కులు, 400 మీటర్ల పరుగు-100 మార్కులు, షాట్‌పుట్(4 కేజీలు)-100 మార్కులు, లాంగ్ జంప్/హైజంప్-100 మార్కులు ఉంటాయి.

➥ గర్భిణీ స్త్రీలు ఫిజికల్ ఈవెంట్లకు అనర్హులు.

స్కిల్ టెస్ట్ (Skill Test) ఇలా..

ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కింది స్పోర్ట్స్ విభాగాల్లో నైపుణ్యాలు పరీక్షిస్తారు. 

అవి: బాల్ బ్యాడ్మిండన్, బాస్కెట్ బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్, వాలీబాల్.

Scheme of Examination

వివరాలు...

* టీఎస్‌పీఈసెట్ (TS PECET)- 2024 

⫸ బీపీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్)

⫸ డీపీఈడీ (డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్)

అర్హతలు..

➥ బీపీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సుకు ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

➥ డీపీఈడీ (డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సుకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

వయోపరిమితి..

➥ బీపీఈడీ కోర్సుకు అభ్యర్థుల వయసు 2024, జులై 1 నాటికి 19 సంవత్సరాలు నిండి ఉండాలి.

➥ డీపీఈడీ కోర్సుకు అభ్యర్థుల వయసు 2024, జులై 1 నాటికి 16 సంవత్సరాలు నిండి ఉండాలి.

తెలంగాణలోని వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ పీఈసెట్- 2024 నోటిఫికేషన్ శాతావాహన యూనివర్సిటీ ఏపీ ఉన్నతవిద్యామండలి పక్షాన మార్చి 12న వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిద్వారా బీపీఎడ్‌(B.PEd), డీపీఎడ్(D.PEd) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 14న ప్రారంభంకాగా.. ఎలాంటి ఆలస్య రుసుములేకుండా మే  25 వరకు ఆన్‌లైన్‌ ద‌రఖాస్తులు స్వీకరించారు. అయితే రూ.500 ఆల‌స్య రుసుముతో మే 31 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ు స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 10 నుంచి 13 వ‌ర‌కు పరీక్షలు నిర్వహించ‌నున్నారు. జూన్ నాలుగో వారంలో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. 

WEBSITE

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget