అన్వేషించండి

Sankranti Holidays:ఏపీలో నేటి నుంచి సంక్రాంతి సెలవులు, స్కూల్స్ తిరిగి తెరచుకునేది అప్పుడే? తెలంగాణలో సెలవులు ఇలా!

ఏపీలోని అన్ని స్కూళ్లకు 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులను (Sankranti Holidays) ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాఠశాలలకు జనవరి 9 నుంచి సంక్రాంతి సెలవులు అమల్లోకి వచ్చాయి.

Sankranti Holidays in AP: ఏపీలోని అన్ని స్కూళ్లకు 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులను (Sankranti Holidays) ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాఠశాలలకు మంగళవారం (జనవరి 9) నుంచి సంక్రాంతి సెలవులు అమల్లోకి వచ్చాయి. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని స్కూళ్లను విద్యాశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే.. రాష్ట్రంలో సంక్రాంతి సెలవుల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి జనవరి 16 వరకూ సెలవులుంటాయని ప్రకటించారు.. కానీ ఆ తరువాత మార్పులు చేసిన సర్కార్.. జనవరి 9 నుంచి 18 వరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు 10 రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. పాఠశాలలు తిరిగి జనవరి 19న పునఃప్రారంభం కానున్నాయి. ఇక, ఈసారి జనవరి 13న రెండో శనివారం, 14న భోగి పండుగ, జనవరి 15న సంక్రాంతి పండుగలున్నాయి. రెండ్రోజులు సాధారణ పబ్లిక్ సెలవులు రావడంతో జనవరి 18 వరకు సెలవులు పొడిగించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక కాలేజీలకు జనవరి 11 నుంచి  జనవరి 17 వరకు సెలవులు ఉన్నాయి.

తెలంగాణలో సెలవులు ఇలా..
తెలంగాణలోని పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు (Sankranthi Holidays) ఉంటాయని ప్రభుత్వం జనవరి 3న ఒక ప్రకటనలో తెలిపింది. కాగా జనవరి 13న 2వ శనివారం కాగా.. జనవరి 14న భోగి, జనవరి 15న సంక్రాంతి, జనవరి 16న కనుమ పండుగలు ఉన్నాయి. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. 

సంక్రాంతి సెలువులు జనవరి 12 నుంచి ప్రారంభం కానున్నాయి.. జనవరి 13న రెండో శనివారం, తర్వాత జనవరి 14న ఆదివారం భోగి పండుగ కాగా.. జనవరి 15న సోమవారం సంక్రాంతి పర్వదిన వస్తోంది. ఇక,  జనవరి16న కనుమ పండగ ఉంది. కాగా, జనవరి 17న ప్రభుత్వం పాఠశాలలకు అదనంగా సెలవు ఇచ్చింది. దీంతో ఆరు రోజుల పాటు స్కూల్స్‌కు హాలీడేస్ వస్తున్నాయి.

ప్రైవేటు విద్యాసంస్థలు సిలబస్ పేరిట పండుగ హాలీడేస్‌లలో క్లాసులు నిర్వహిస్తే ఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తెలిపింది. కాగా.. జనవరి 25న ఆదివారం, జనవరి 26న రిపబ్లిక్ డే రావడంతో మరోసారి వరుస సెలవులు విద్యార్థులకు రానున్నాయి.

జూనియర్ కాలేజీలకు 4 రోజులు..
తెలంగాణలో జూనియర్ కాలేజీలకు (Telangana Inter Colleges) సంక్రాంతి సెలవులను ఇంటర్ బోర్డు (TS Inter Board) ప్రకటించింది. ఈమేరకు జనవరి 6న అధికారిక ప్రకటన జారీచేసింది. ఈసారి మొత్తం ఇంటర్ కాలేజీలకు 4 రోజులపాటు సంక్రాంతి సెలవులు (Sankranthi Holidays) ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలతోపాటు, అన్ని కాలేజీలకు జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. కాలేజీలు తిరిగి జనవరి 17న తెరచుకోనున్నాయి. సంక్రాంతి సెలవుల సమయంలో ఎలాంటి తరగతులు నిర్వహించరాదని స్పష్టం చేసిన అధికారులు. ఒకవేళ నిర్వహిస్తే కఠినచర్యలు తప్పవని బోర్డు హెచ్చరించింది.

జనవరి నెలలో సాధారణ సెలవులివే!

➥ జనవరి నెల‌లో భారీగా సెలవులు రానున్నాయి. సాధారణ సెలవుల్లో జనవరి 1వ తేదీని ప్రభుత్వం పేర్కొంది. కాకపోతే ఈ సారి జనవరి 1న‌ ఆదివారం రోజు రావడంతో విద్యార్థులు ఉద్యోగులు అదనపు సెలవును పొందే ఛాన్స్ మిస్ అయ్యింది.

➥ ఇక జనవరి నెల అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతి సెలవులు. భోగి పండుగా జనవరి 14న వచ్చింది. ఆ రోజు సైతం సాధారణ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఆ రోజు రెండో శనివారం. దీంతో విద్యార్థులు మరో సెలవును కోల్పోతున్నారు.

➥ ఇంకా భోగి మరుసటి రోజు జనవరి 15న సంక్రాంతి ఉంటుంది. అయితే.. సంక్రాంతి కూడా సెలవుదినమైన ఆదివారం రోజే రావడం మరో నిరాశ కలిగించే అంశం. జనవరి 16న సోమవారం కనుమ పండుగకు ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేను ప్రకటించింది. 

➥ ఆదివారాలు, రెండో శనివారం కలిపితే జనవరిలో బోలెడు సెలవులు వస్తాయి. ఆయా తేదీల్లో విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయి.

➥ రిపబ్లిక్ డే జనవరి 26వ తేదీన‌ గురువారం రోజు వచ్చింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ఉంటుంది.

➥ జనవరి 8, 22, 29 తేదీల్లో ఆదివారం ఉంటుంది. దీంతో ఆయా రోజుల్లో సెలవు ఎలాగూ ఉంటుంది. ఇంకా జనవరి 28న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు ఆ రోజు సెలవు ఉంటుంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
BRS MLC Kavitha: జైలు నుంచి వచ్చాక తొలిసారి ఇందూరుకు కవిత, గజమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
జైలు నుంచి వచ్చాక తొలిసారి ఇందూరుకు కవిత, గజమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Embed widget