రేపటి నుంచే విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు, ఎన్నిరోజులంటే?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు శుక్రవారం (జనవరి 13) నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు శుక్రవారం (జనవరి 13) నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.
తెలంగాణలో సంక్రాంతి సెలవులు శుక్రవారం (జనవరి 13) నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు శుక్రవారం (జనవరి 13) నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. 5 రోజులు పండుగ సెలవులు రానుండగా తిరిగి స్కూళ్లు జనవరి 18న పున:ప్రారంభంకానున్నాయి. అయితే, ఇంటర్ కాలేజీలకు మాత్రం జనవరి 14 నుంచి 16 వరకు కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులను ప్రకటించింది. తిరిగి జనవరి 17వ తేదీన కాలేజీలు తెరుచుకోనున్నాయి. సెలవు రోజుల్లో క్లాసులు నిర్వహిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది. జనవరి 13 నుంచి సంక్రాంతి సెలవుల నేపథ్యంలో జనవరి 12న పాఠశాలల్లో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ముగ్గుల పోటీలు, పతంగుల కోలాహలంతో స్కూల్స్ ముగిశాయి.
ఒక్కరోజే సెలవు..
ఇక తెలంగాణలో మాత్రం కేవలం 3 రోజులు (భోగి, సంక్రాంతి, కనుమ) మాత్రమే సెలవులు మంజూరుచేశారు. వాటిలో జనవరి 14 రెండో శనివారం కాగా, జనవరి 15 ఆదివారం వచ్చింది. అంతే విద్యార్థులకు జనవరి 16 ఒక్కరోజు మాత్రమే సెలవు ఇచ్చినట్లయింది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు జనవరి 14 నుంచి 16 వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ఇచ్చింది. తిరిగి జనవరి 17న తరగతులు పునః ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యామండలి సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. సెలవుల్లో జూనియర్ కాలేజీల్లో తరగతులు నిర్వహించొద్దని ఆదేశించారు. ఎక్కడైనా తరగతులు నిర్వహించినట్లు దృష్టికి వస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
ట్రిపుల్ ఐటీకి 17 వరకు సెలవులు..
కాగా, బాసర ట్రిపుల్ ఐటీలో విద్యర్థులకు బుధవారం నుంచే (జనవరి 11 నుంచి జనవరి 17 వరకు) వారం రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు ఇంచార్జ్ వీసీ వెంకట రమణ తెలిపారు. తిరిగి జనవరి 18న క్లాసులు పునఃప్రారంభం కానున్నాయి. ఇక, పండుగ సందర్భంగా ఇప్పటికే నగరవాసులు ఊళ్ల బాట పట్టారు. దీంతో, గురువారం జాతీయ రహదారులపై వాహనాల రద్దీ అధికంగా ఏర్పడింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. అంతేకాకుండా, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఇక రేపటి నుంచి సెలవులు కావడంతో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
డిప్లొమా, ఇంజినీరింగ్ కాలేజీలకు 4 రోజులు..
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలకు కూడా జనవరి 13 నుంచి 16 వరకు నాలుగు రోజులపాటు సెలవులు ఇచ్చారు. 17న విద్యాసంస్థలు తిరిగి తెరచుకోనున్నాయి.
Also Read: ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రారంభం, వివరాలు ఇలా..!
జనవరి నెలలో సాధారణ సెలవులివే!
➥ జనవరి నెలలో భారీగా సెలవులు ఉన్నాయి.జనవరి 1న ఆదివారం రోజు రావడంతో విద్యార్థులు ఉద్యోగులు అదనపు సెలవును పొందే ఛాన్స్ మిస్ అయ్యింది.
➥ ఇక జనవరి నెల అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతి సెలవులు. భోగి పండుగా జనవరి 14న వచ్చింది. ఆ రోజు సైతం సాధారణ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఆ రోజు రెండో శనివారం. దీంతో విద్యార్థులు మరో సెలవును కోల్పోతున్నారు.
➥ ఇంకా భోగి మరుసటి రోజు జనవరి 15న సంక్రాంతి ఉంటుంది. అయితే.. సంక్రాంతి కూడా సెలవుదినమైన ఆదివారం రోజే రావడం మరో నిరాశ కలిగించే అంశం. జనవరి 16న సోమవారం కనుమ పండుగకు ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేను ప్రకటించింది.
➥ ఆదివారాలు, రెండో శనివారం కలిపితే జనవరిలో బోలెడు సెలవులు వస్తాయి. ఆయా తేదీల్లో విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయి.
➥ రిపబ్లిక్ డే జనవరి 26వ తేదీన గురువారం రోజు వచ్చింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ఉంటుంది.
➥ జనవరి 8, 22, 29 తేదీల్లో ఆదివారం ఉంటుంది. దీంతో ఆయా రోజుల్లో సెలవు ఎలాగూ ఉంటుంది. ఇంకా జనవరి 28న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు ఆ రోజు సెలవు ఉంటుంది.