(Source: ECI/ABP News/ABP Majha)
RGUKT Admissions: జులై 1 నుంచి ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు ధ్రువపత్రాల పరిశీలన
RGUKT Certificate Verification: ఏపీలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు జులై 1 నుంచి ధ్రువపత్రాల నిర్వహించనున్నారు.
AP RGUKT Certificate Verification Schedule: ఆంధ్రప్రదేశ్ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులకు జులై 1 నుంచి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు.. ఆర్జీయూకేటీ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య ఎస్.అమరేంద్రకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన విద్యార్థుల జాబితాను కేటగిరీలవారీగా ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారు విద్యార్హతకు సంబంధించిన అన్ని రకాల సర్టిఫికేట్లు, సంబంధిత కేటగిరీ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన జూన్ 25తో దరఖాస్తుల స్వీకరణ ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 53,863 మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 34,154 దరఖాస్తులు, ప్రైవేటు పాఠశాలల నుంచి 19,671 దరఖాస్తులు అందాయి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి 38 దరఖాస్తులు అందాయి. మొత్తం దరఖాస్తుల్లో బాలికలు 30,857, బాలురు 23,006 మంది ఉన్నారు. ఇక స్పెషల్ కేటిగిరీ కింద మొత్తం 6176 దరఖాస్తులు అందాయి. ఇందులో క్యాప్-2,582; ఎన్‌సీసీ-1,830; స్పోర్ట్స్-1,162; దివ్యాంగులు-332, స్కౌట్స్ & గైడ్స్-270 మంది ఉన్నారు. వీరికి జులై 1 నుంచి 5 వరకు కేటగిరీలవారీగా నూజివీడు క్యాంపస్‌లో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు.
విద్యార్థులు వారికి నిర్ణయించిన తేదీల్లో అన్ని సర్టిఫికేట్లను తీసుకొని ఉదయం 9 గంటల వరకు సంబంధిత కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక క్యాంపస్‌ల వారీగా ఎంపికైన విద్యార్థుల తుది జాబితాను జులై 11న విడుదల చేయనున్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ఈమెయిల్: admissions@rgukt.in, ఫోన్: 97035 42597/ 97054 72597 నెంబర్లలో సంప్రదించవచ్చు.
ఏ క్యాంపస్‌కు ఎంపికైన విద్యార్థులకు అదే క్యాంపస్‌లో నిర్ధేశించిన తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. శ్రీకాకుళం క్యాంపస్‌లో జులై 26,27 తేదీల్లో; నూజివీడు, ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ) క్యాంపస్‌లకు ఎంపికైన వారికి ఆయా క్యాంపస్‌లోనే జులై 22,23 తేదీల్లో; ఒంగోలు క్యాంపస్‌లో జులై 24,25 తేదీల్లో సర్టిఫికెట్లు పరిశీలన చేపట్టనున్నారు.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ వేదిక: RGUKT-Nuzvid Campus, Eluru Dist
స్పెషల్ కేటిగిరీ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన..
➥ క్యాప్: 01.07.2024 - 03.07.2024.
➥ బీఎస్‌జీ: 02.07.2024 - 03.07.2024.
➥ దివ్యాంగులు(PH): 03.07.2024.
➥ ఎన్‌సీసీ (NCC): 03.07.2024 - 05.07.2024.
➥ స్పోర్ట్స్: 03.07.2024 - 05.07.2024.
ధ్రువపత్రాల పరీశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలు (కేటగిరీల వారీగా)..
➥ List of candidates called for CAP category certificate verification from 1st July to 3rd July 2024
➥ List of candidates called for BSG category certificate verification on 2nd and 3rd July 2024
➥ List of candidates called for NCC category certificate verification from 3rd July to 5th July 2024
➥ List of candidates called for PH category certificate verification on 03-07-2024
ఏపీ ఆర్జీయూకేటీ (RGUKT) పరిధిలోని నాలుగు క్యాంపస్‌లలో(నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు) ట్రిపుల్ ఐటీలలో మొత్తం 4,400 సీట్లలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అధికారిక వెబ్‌సైట్ నుంచి కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆయా తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్ధులు రెండేళ్ల పీయూసీ (PUC), నాలుగేళ్ల బీటెక్ (4-yrs Btech Programme) కోర్సుతో కలిపి మొత్తం ఆరేళ్ల కోర్సులో ప్రవేశాలు పొందుతారు. ప్రవేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అదనంగా నాలుగు శాతం మార్కులు కేటాయిస్తారు. నాలుగు క్యాంపస్‌లలో కలిపి 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 85 శాతం సీట్లు ఏపీ అభ్యర్థులకు, 15 శాతం సీట్లు తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ఓపెన్ మెరిట్ కింద కేటాయిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదివిన విద్యార్థులకు 4 % డిప్రివేషన్ స్కోర్‌ను జోడించి మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.