By: ABP Desam | Updated at : 03 Jan 2023 11:15 PM (IST)
Edited By: omeprakash
ప్రధాని మోదీతో పరీక్షాపే చర్చా
విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి తేదీ ఖరారైంది. జనవరి 27న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రధాని ముఖాముఖి చర్చిస్తారని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమం ఢిల్లీలోని తల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరుగుతుందని పేర్కొంది. పరీక్షలు రాసే విద్యార్థులతో మోదీ మాట్లాడతారని తెలిపింది.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 9 నుంచి 12 తరగతులు చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రిజిస్టర్ చేసుకొనేందుకు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 30 వరకు అవకాశం కల్పించారు. మైగవ్ వెబ్‌సైట్‌లో పోటీల ద్వారా ఎంపికైన సుమారు 2,050 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు పీపీసీ కిట్‌లను బహుమతిగా అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తొలిసారి ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 16న నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఒత్తిడిని జయించి పరీక్షలను ఎలా రాయాలి.. భయాందోళనను దూరం చేసి ఎలా సన్నద్ధమవ్వాలి అనే విషయాలపై ప్రధాని మోదీ విద్యార్థులకు పలు సలహాలు సూచనలు చేస్తారు.
Also Read:
గేట్-2023 అడ్మిట్ కార్డుల వెల్లడి వాయిదా, ఎప్పుడంటే?
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 పరీక్ష హాల్‌టికెట్ల వెల్లడి వాయిదాపడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 3న అడ్మిట్ కార్డులు విడుదల చేయాల్సి ఉంది. అయితే నిర్వహణపరమైన కారణాల వల్ల వాయిదా వేసినట్లు ఐఐటీ కాన్పూర్ ఒక ప్రకటకనలో తెలిపింది. పరీక్ష అడ్మిట్ కార్డులను జనవరి 9 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో గేట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 16న గేట్ ఫలితాలను వెల్లడించనున్నారు.
పరీక్ష హాల్‌టికెట్, పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
TS SET - 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్) - 2022 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 30న ప్రారంభమైంది. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు, ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు జనవరి 20 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, ఫిబ్రవరి 5 వరకు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పరీక్ష ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.2000; బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్‌ఐ, ఓహెచ్, ట్రాన్స్‌జెండర్‌లు రూ.1000 చెల్లించాలి. 2023 మార్చి మొదటి లేదా రెండోవారంలో ఆన్‌లైన్ విధానంలో టీఎస్ సెట్-2022 పరీక్షలను నిర్వహించనున్నారు.
దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
యూజీసీనెట్ 2022 దరఖాస్తు ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోండి! చివరితేది ఇదే!
దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (డిసెంబరు)-2022 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 29న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు జనవరి 17 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
CBSE Hall Tickets: సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
NEET PG 2023: ఎంబీబీఎస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్, నీట్ పీజీ పరీక్షకు ఇంటర్న్‌షిప్ కటాఫ్ గడువు పెంపు
AP RCET: ఫిబ్రవరి 9 నుంచి 'ఏపీఆర్‌సెట్' రెండో విడత కౌన్సెలింగ్! సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
NEET PG 2023: నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్లో మార్పు - తప్పుడు వార్తల్ని నమ్మొద్దంటూ కేంద్రం క్లారిటీ!
KNRUHS: ఆయూష్ పీజీ వైద్యసీట్ల భర్తీకి వన్‌టైం వెబ్ఆప్షన్లు, షెడ్యూలు ఇదే!
Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
RBI Policy: దాస్ ప్రకటనల్లో స్టాక్ మార్కెట్‌కు పనికొచ్చే విషయాలేంటి?