(Source: ECI/ABP News/ABP Majha)
Medical Colleges: కొత్త మెడికల్ కాలేజీల్లో సీట్ల పంచాయతీ - బీ, సీ కేటగిరీ సీట్లపై పిటిషన్ దాఖలు
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 50 శాతం సీట్లను బీ, సీ కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం జీవోలు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మంజూరైన ప్రభుత్వ వైద్యకళాశాలల్లో సీట్ల పంచాయతీ కోర్టు మెట్లెక్కింది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 50 శాతం సీట్లను బీ, సీ కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం జీవోలు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై మంగళవారం(ఆగస్టు 8) విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టంచేసింది. తుది ఉత్తర్వులకు లోబడే సీట్ల భర్తీ ఉంటుందని న్యాయస్థానం ఆదేశిస్తూ.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ALSO READ:
ఏపీలో ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు, ఉత్తర్వులు జారీ - కనీస, అత్యధిక ఫీజులు ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని దాదాపు 220 ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులను నిర్ధారిస్తూ ఆదివారం (ఆగస్టు 6) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పును అనుసరించి ఫీజులు నిర్ణయించారు. గతేడాది వసూలు చేసిన ఫీజుకు 10 శాతం అదనంగా పెంచుకునేలా, అదీ కూడా కనీస ఫీజు రూ.43 వేలకు మించకుండా నిర్ణయించారు. కళాశాలల స్థాయిని బట్టి ఫీజు అత్యధిక ఫీజు రూ.77 వేలు ఉండగా, కనీస ఫీజు రూ.43 వేలుగా ఉంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
GATE 2024: 'గేట్-2024' షెడ్యూలు వచ్చేసింది, ఆగస్టు 24 నుంచి దరఖాస్తుల స్వీకరణ
దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2024) దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 24 నుంచి ప్రారంభంకానుంది. ఈసారి గేట్ నిర్వహణ బాధ్యతను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) చేపట్టింది. 'గేట్'లో ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షలో మొత్తం పేపర్ల సంఖ్య 30కి చేరినట్లయింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC: ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి (2024 జులై సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు అక్టోబరు 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి డిసెంబరు 2న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎంపీసీ విద్యార్థులకు 'స్పెషల్ కౌన్సెలింగ్' ద్వారా ఫార్మసీ సీట్ల కేటాయింపు
తెలంగాణలో రెండు విడతల ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 2తో ముగిసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి చివరివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆ తర్వాత ఆగస్టు 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ మొదలుకానుంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు బీఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సాధారణంగా ఏటా ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్‌లో వారికి సీట్లు కేటాయిస్తూ వస్తున్నారు. ఈసారి చివరి విడత తర్వాత ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో అవకాశం ఇచ్చేలా మార్పు చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..