AP SSC Exams: పదోతరగతి పరీక్షలకు ఈ ఏడాది 6 లక్షలకు పైగా విద్యార్థులు, రాష్ట్రవ్యాప్తంగా 3,350 పరీక్ష కేంద్రాలు!
ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు రాష్ట్రంలో 6,10,000 మంది రెగ్యులర్, 55వేల మంది ప్రైవేటు విద్యార్థులు హాజరవుతారన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3,350 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు రాష్ట్రంలో 6,10,000 మంది రెగ్యులర్, 55వేల మంది ప్రైవేటు విద్యార్థులు హాజరవుతారన్నారని ఆయన తెలిపారు.
Also Read: టెన్త్ క్లాస్ 'ప్రీ ఫైనల్' పరీక్షల షెడ్యూలు విడుదల! ఇతర తరగతులకు 'ఎఫ్ఏ-4' పరీక్షలు ఎప్పుడంటే?
ఏపీలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీలో 6 పేపర్లతో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త విధానం ప్రకారం పది పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్, ప్రశ్నల వారీగా వెయిటేజీ వివరాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంచింది. మరోవైపు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకెడమిక్ క్యాలెండర్ ప్రకారం.. 1 నుంచి 9 తరగతులకు సమ్మెటివ్ 2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగియనున్నాయి.
మాదిరి పశ్నాపత్రాలు, బ్లూప్రింట్స్ లింక్ కోసం క్లిక్ చేయండి..
ఏపీ పదోతరగతి పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
పరీక్షల షెడ్యూలు ఇలా..
పరీక్ష తేదీ | పేపరు |
ఏప్రిల్ 3 | ఫస్ట్ లాంగ్వేజ్ |
ఏప్రిల్ 6 | సెకండ్ లాంగ్వేజ్ |
ఏప్రిల్ 8 | ఇంగ్లిష్ |
ఏప్రిల్ 10 | మ్యాథమెటిక్స్ |
ఏప్రిల్ 13 | సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ) |
ఏప్రిల్ 15 | సోషల్ స్టడీస్ |
ఏప్రిల్ 17 | కాంపోజిట్ కోర్సు |
ఏప్రిల్ 18 | ఒకేషనల్ కోర్సు |
Also Read:
TSRJC CET - 2023: టీఎస్ఆర్జేసీ సెట్–2023 నోటిఫికేషన్ వెల్లడి, ప్రవేశపరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023–24 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్ఆర్జేసీ సెట్–2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 25 గురుకుల జూనియర్ కాలేజీలు ఉన్నాయి. పదోతరగతి అర్హత ఉన్న విద్యార్థులతోపాటు, ప్రస్తుతం టెన్త్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మహాత్మాజ్యోతిబాపులే ఆర్‌జేసీ, ఆర్‌డీసీ సెట్-2023 నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా!
మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) రాష్ట్రంలోని వివిధ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్‌లో ప్రవేశాలకు పదోతరగతి, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్ అర్హత ఉండాలి. ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఏప్రిల్ 29న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్ 20 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Model School: 'మోడల్ స్కూల్స్' దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు! చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని 194 ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్‌లో) ప్రవేశానికి దరఖాస్తుల గడువును మార్చి వరకు పొడిగించారు. ఇప్పటికే దరఖాస్తు గడువును రెండుసార్లు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి పొడిగించారు. ఈ మేరకు విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ ఉషారాణి ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి దరఖాస్తు గడువు మార్చి 1తో ముగిసిన గడువును, మరో వారంరోజులపాటు పొడిగించారు. మార్చి 8 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..