News
News
X

TS Govt Schools: అలా చేరారు, ఇలా వెళ్లిపోయారు - సర్కారు బడుల్లో ప్రవేశాల తీరిది!

కరోనా పరిస్థితుల కారణంగా సర్కారు బడుల్లో ప్రైవేటు బడుల నుంచి వచ్చి చేరిన విద్యార్థులు మళ్లీ తిరుగుబాట పట్టారు. గతేడాాది (2021-22) ప్రైవేటు పాఠశాలల నుంచి ఏకంగా 2,78,470 మంది ప్రవేశాలు పొందారు.

FOLLOW US: 
Share:

➥ గతేడాది 2.78 లక్షల మంది విద్యార్థులు చేరారు
➥ వారిలో 1.80 లక్షల మంది వీడారు 

కరోనా పరిస్థితుల కారణంగా సర్కారు బడుల్లో ప్రైవేటు బడుల నుంచి వచ్చి చేరిన విద్యార్థులు మళ్లీ తిరుగుబాట పట్టారు. గత విద్యా సంవత్సరం (2021-22) ప్రైవేటు పాఠశాలల నుంచి ఏకంగా 2,78,470 మంది సర్కారు బడుల్లో ప్రవేశాలు పొందారు. ఈ ఏడాది వారిలో 1,80,697 మంది పిల్లలు తిరిగి ప్రైవేటు బాట పట్టారు. ప్రభుత్వం ఫిబ్రవరి 10న పాఠశాల విద్యాశాఖ ఫలితాల బడ్జెట్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టింది. అందులో 2020-21, 2021-22, 2022-23 విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో నమోదైన విద్యార్థుల సంఖ్య, ఇతర గణాంకాలను పొందుపరిచారు. అందులో 1,80,697 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి వెనక్కు వెళ్లిన విషయం స్పష్టమైంది. అది 65 శాతంతో సమానం. 

కరోనా పరిస్థితుల్లో కొద్దికాలానికి కూడా పూర్తి ఫీజులు చెల్లించాల్సి వస్తుందని, దానికితోడు ఆదాయాలు తగ్గిపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొనడంతో ఎక్కువ మంది మళ్లీ ప్రైవేటు స్కూల్స్ బాట పట్టారు. అయితే 6 నుంచి 10 తరగతులకు విద్యనందించే ఉన్నత పాఠశాలల్లో మాత్రం విద్యార్థుల సంఖ్య తగ్గకపోవడం గమనార్హం. మొత్తంమీద గత విద్యా సంవత్సరం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య 30,78,189 ఉండగా...ప్రస్తుత విద్యాసంవత్సరం(2022-23)లో అది 28,97,492కు తగ్గిపోయింది.

నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..
➦ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బాలికల సంఖ్య తగ్గుతోంది. 2019-20 విద్యా సంవత్సరంలో 28,63,422 మంది ఉంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో వారి సంఖ్య 28,08,334 మాత్రమే. అంటే 55,088 మంది తగ్గారు.

➦ 6-10 తరగతుల్లోని 5.42 లక్షల బాలికలకు హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లను అందించనున్నారు.

➦ 50 ఆదర్శ పాఠశాలల్లో అసంపూర్తి భవనాల నిర్మాణాలకు రూ.4.88 కోట్లు ఖర్చుచేయనున్నారు. రాష్ట్రంలోని 194 ఆదర్శ పాఠశాలల్లో 1040 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

➦ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రూ.2 కోట్లతో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేస్తారు. రెండు వేల డ్యూయల్ డెస్క్‌లను కొనుగోలు చేశారు.

➦ కొత్తగా 50 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తెలంగాణ నైపుణ్య, విజ్ఞాన కేంద్రాలను నెలకొల్పుతారు. రూసా పథకంలో భాగంగా రాష్ట్ర వాటాగా రూ.33.34 కోట్లు కేటాయించనున్నారు.

Also Read:

ఏప్రిల్ 12 నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు, వేసవి సెలవులు ఎప్పుటినుంచంటే?
తెలంగాణలోని పాఠశాలల్లో 1-9 తరగతుల విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-2(ఎస్ఏ) పరీక్షల తేదీల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్న విధంగా ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఏప్రిల్ 12 నుంచి ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఏప్రిల్ 3 - 13 వరకు 10వ తరగతి పరీక్షలు  జరుగుతుండటంతో మిగిలిన తరగతులకు ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించాలని తాజాగా విద్యాశాఖ నిర్ణయించింది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఇతర వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 11 Feb 2023 07:14 PM (IST) Tags: telangana govt schools Education News in Telugu School drop outs TS Schools Drop Outs TS Govt Schools Drop Outs Telangana Pvt Schools

సంబంధిత కథనాలు

AP Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!

AP Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!

APPECET - 2023: ఏపీ పీఈసెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పడంటే?

APPECET - 2023: ఏపీ పీఈసెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పడంటే?

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

APEdCET-2023 Notification: ఏపీ ఎడ్‌సెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

APEdCET-2023 Notification: ఏపీ ఎడ్‌సెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన