OUCDE: ఓయూలో దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్ జి.రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వివిధ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఫేజ్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది.
OUCDE Phase 2 Admissions: హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్ జి.రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (PGRRCDE) 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఫేజ్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు టీఎస్‌ఐసెట్/ఏపీ ఐసెట్ అర్హత తప్పనిసరి. వేదిక్ ఆస్ట్రాలజీ కోర్సుకు సంబంధిత విభాగంలో డిప్లొమా/పీజీ డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా మార్చి 31 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద రూ.300 చెల్లించాల్సి ఉంటుంది.
కోర్సుల వివరాలు..
* ఓయూ దూరవిద్య ప్రవేశాలు
పీజీ కోర్సులు..
➥ ఎంబీఏ
➥ ఎంసీఏ
➥ ఎంఏ
విభాగాలు: హిందీ, ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్, ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్ పర్సనల్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ.
➥ ఎంఎస్సీ: మ్యాథ్స్, స్టాటిస్టిక్స్
➥ ఎంకాం
అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు టీఎస్‌ఐసెట్/ఏపీ ఐసెట్ అర్హత తప్పనిసరి.
డిగ్రీ కోర్సులు..
➥ బీఏ
➥ బీకాం
➥ బీబీఏ
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
➥ అడ్వాన్స్‌డ్ పీజీ డిప్లొమా
విభాగం: వేదిక్ ఆస్ట్రాలజీ.
అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.
➥ అడ్‌వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు
విభాగాలు: మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మేటిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, డేటా సైన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్, వేదిక్ ఆస్ట్రాలజీ.
అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. వేదిక్ ఆస్ట్రాలజీ కోర్సుకు సంబంధిత విభాగంలో డిప్లొమా/పీజీ డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
➥ సర్టిఫికేట్ కోర్సు
విభాగం: యోగా.
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
బోధనా మాధ్యమం: కోర్సును బట్టి ఇంగ్లిష్ లేదా తెలుగు లేదా ఉర్దూ రెండు మాధ్యమాలు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: రూ.300.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఫేజ్-II ప్రవేశాలకు చివరితేది: 31.03.2024.
ALSO READ:
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ, పీజీ కోర్సులు - చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం జనవరి-ఫిబ్రవరి 2024 సెషన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్), డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఆసక్తి, సరైన అర్హతలున్నవారు జనవరి 31లోగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600, 040-23680290/ 291/294/295 నంబర్లలో సంప్రదించవచ్చు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..