ఓయూ 'దూరవిద్య'లో కొత్త కోర్సులు, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు!
ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య ద్వారా ఈ ఏడాది నుంచి 70 కోర్సులను నిర్వహించనుంది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా అనుమతినిచ్చింది.
ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య ద్వారా ఈ ఏడాది నుంచి 70 కోర్సులను నిర్వహించనుంది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా అనుమతినిచ్చింది. ఓయూ దూరవిద్య విభాగం పీజీఆర్‌ఆర్‌సీడీఈ ద్వారా ఈ కోర్సులను నిర్వహించనుంది. వాస్తవానికి క్యాటగిరీ-1 విద్యాసంస్థలు యూజీసీ నుంచి ఎలాంటి అనుమతి పొందకుండానే దూర విద్య కోర్సులను నిర్వహించవచ్చు.
ఓయూ క్యాటగిరీ-1 విద్యా సంస్థ అయినా తమ నుంచి అనుమతి పొందాలని యూజీసీ లేఖ రాసింది. ఈ మేరకు ఓయూ అధికారులు 70 కోర్సులకు అనుమతి కోరుతూ యూజీసీకి దరఖాస్తు చేశారు. దీంతో యూజీసీ ఓయూతోపాటు క్యాటగిరీ-1 వర్సిటీల్లో కోర్సులకు అనుమతి ఇచ్చింది. ఆంధ్రా వర్సిటీ, కురుక్షేత్రవర్సిటీల్లో 21 కోర్సుల చొప్పున అనుమతిని జారీచేసింది. ఓయూకు ఐదేండ్ల పాటు గుర్తింపునివ్వడం విశేషం.
పీజీఆర్‌ఆర్‌సీడీఈలో మరో ఐదు కోర్సులు ప్రవేశపెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటిలో ఒక పీజీ, ఒక డిగ్రీ కోర్సులుండగా, మరో మూడు కోర్సులకు రూపకల్పన చేస్తున్నారు. కొత్తగా ఈ ఏడాది పీజీ డిప్లొమా ఇన్ డాటాసైన్స్, వేదిక్ ఆస్ట్రాలజి డిప్లొమా కోర్సు, ఆంత్రోపెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్, యోగా సర్టిఫికెట్ కోర్సులు నడుస్తున్నాయి.
వర్సిటీల వారీగా అనుమతిచ్చిన కోర్సులు..
యూనివర్సిటీ | కోర్సుల సంఖ్య |
ఉస్మానియా యూనివర్సిటీ (తెలంగాణ) | 70 |
ఆంధ్రాయూనివర్సిటీ (ఏపీ) | 21 |
కురుక్షేత్ర యూనివర్సిటీ (హర్యానా) | 21 |
భారతివిద్యాపీఠ్ (మహారాష్ట్ర) | 09 |
ఉత్కల్ యూనివర్సిటీ (ఒడిశా) | 17 |
గురునానక్‌దేవ్ యూనివర్సిటీ (పంజాబ్) | 08 |
Also Read:
బెంగళూరు ఐఐఎస్సీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(రిసెర్చ్) ప్రోగ్రాంలో ప్రవేశాలు, వివరాలు ఇలా!
బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) 2023-24 విద్యా సంవత్సరానికి బీఎస్సీ రిసెర్చ్ ప్రోగ్రాం కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు కేవీపీవై/ ఇన్‌స్పైర్/ ఐఐఎస్సీ ఉపకార వేతనం అందుతుంది. ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు, అర్హతలివే!
కాన్పూర్‌లోని నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పదవతరగతి, ఇంటర్, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
'బయోటెక్నాలజీ'లో పీజీ, జేఆర్‌ఎఫ్ ప్రవేశాలకు నోటిఫికేషన్, పరీక్షలు ఎప్పుడంటే?
బయోటెక్నాలజీ, దాని అనుబంధ విభాగాల్లో పీజీ కోర్సుల్లో 2023 -24 ప్రవేశాలకు సంబంధించి 'గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - బయోటెక్నాలజీ (GAT-B) 2023' నోటిఫికేషన్ వెలువడింది. అదేవిధంగా జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం నిర్వహించే 'బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (BET)-2023' నోటిఫికేషన్‌ను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలో సాధించిన మెరిట్ ద్వారా వివిధ విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ప్రవేశపరీక్షల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..