MST: ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్‌షిప్ టెస్ట్, బాలికలకు మాత్రమే ప్రత్యేకం- ఈ అర్హతలుండాలి!
ఎన్టీఆర్ విద్యాసంస్థల ట్రస్టు ద్వారా 'గర్ల్స్ ఎడ్యుకేషనల్ స్కాలర్‌షిప్స్ టెస్టు 2023-24'ను ఆగస్టు 6న నిర్వహించనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్థుల కోసం ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
ఎన్టీఆర్ విద్యాసంస్థల ట్రస్టు ద్వారా 'గర్ల్స్ ఎడ్యుకేషనల్ స్కాలర్‌షిప్స్ టెస్టు 2023-24'ను ఆగస్టు 6న నిర్వహించనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్థుల కోసం ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్టీఆర్ విద్యాసంస్థల ద్వారా రూ.34 లక్షలను ఉపకార వేతనం రూపంలో అందజేయనున్నారు.
పరీక్ష రాసిన వారిలో మొదటి పది ర్యాంకులు పొందిన విద్యార్థులకు నెలకు రూ.5 వేలు చొప్పున, ఆ పై ర్యాంకులు సాధించిన 15 మంది విద్యార్థినులకు రూ.3 వేలు చొప్పున ఉపకారవేతనాలు ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో చేరిన విద్యార్థినులకు డిగ్రీ పూర్తిచేసే వరకు ఉపకార వేతనాలు ఇస్తారు.
ఆసక్తిగల విద్యార్థినులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 76600 02627/28 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. దేశవ్యాప్తంగా ఎవరైనా ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
* గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ టెస్ట్ (GEST)
అర్హత: 2024 మార్చి/ఏప్రిల్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం, సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, కరెంట్ అఫైర్స్, జీకే, రీజినింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్ స్థాయిలోనే పరీక్ష ఉంటుంది.
పరీక్షకు హాజరయ్యేవారు తీసుకురావాల్సినవి: రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, బ్లాక్ పాయింట్ పెన్, రైటింగ్ ప్యాడ్, ఫొటో ఐడీకార్డు లేదా స్కూల్ ఐడీ కార్డు, మాస్కులు, శానిటైజర్.
ముఖ్యమైన తేదీలు..
⫸ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.07.2023.
⫸ దరఖాస్తుకు చివరితేది: 04.08.2023.
⫸ పరీక్ష తేది, సమయం: 06.08.2023 (ఆదివారం), ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.
వేదిక: NTR Junior & Degree College for Women.
Chilukur Balaji Temple Road, Himayath Nagar Village,
Moinabad Mandal, R.R. Dist., Telangana 500075.
ALSO READ:
నల్సార్ యూనివర్సిటీలో ఎంఏ&అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూరవిద్య విధానంలో 2023-2024 విద్యా సంవత్సరానికి ఎంఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో పోస్ట్ బేసిక్ నర్సింగ్ కోర్సు, చివరితేదీ ఎప్పుడంటే?
విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్... 2023-24 విద్యా సంవత్సరానికి వర్సిటీ పరిధిలోని నర్సింగ్ కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద పోస్ట్ బేసిక్ బీఎస్సీ(నర్సింగ్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్‌తో పాటు నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన జీఎన్‌ఎం కోర్సులో ఉత్తీర్ణులై అర్హులైన అభ్యర్థులు కోర్సుకు అర్హులు. సరైన అర్హతున్నవారు ఆగస్టు 17లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నర్సింగ్ కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..