అన్వేషించండి

JEE Main 2024 Application: జేఈఈ మెయిన్స్‌ సెషన్‌-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (JEE Main)-2024 సెషన్‌-2 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 3న ప్రారంభమైంది.

JEE Main 2024 Session 2 Application: దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (JEE Main)-2024 సెషన్‌-2 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 3న ప్రారంభమైంది. కొత్త అభ్యర్దులతోపాటు మొదటి సెషన్‌ రాసిన అభ్యర్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు మార్చి 2న రాత్రి 11 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే  రాత్రి 11.50 గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టిఏ) ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.

జేఈఈ మెయిన్-2024 రెండో విడత పరీక్షలను ఏప్రిల్‌ 4 నుంచి ఏప్రిల్ 15 మధ్య నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. మార్చి మూడో వారంలో పరీక్ష కేంద్రాల వివరాలను ప్రకటించనున్నారు. అడ్మిట్‌ కార్డులను పరీక్షలకు పరీక్షకు మూడు రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఏప్రిల్‌ 25న ఫలితాలు వెల్లడి కానున్నాయి. జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఎన్‌టీఏ నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీటెక్‌ సీట్లను జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో చేరాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయాలి. మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అవకాశముంటుంది.

రెండువారాల్లో ఫలితాలు..
జేఈఈ మెయిన్‌ ద్వారా దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఎన్‌ఐటీ, ఐఐటీలు, సీఎఫ్‌టీఐలలో ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. దీనికోసం ఏటా రెండుసార్లు జేఈఈ మెయిన్‌ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే మొదటి సెషన్‌కు సంబంధించిన పరీక్షలు ముగిశాయి. మరో రెండు వారాల్లో పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి.

పరీక్ష విధానం:

➥ జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సు్లో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు. 

➥ ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.

➥ బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో మంచి స్కోర్‌ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.

జేఈఈ మెయిన్ పరీక్షలకు ఈ ఏడాది 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణలో 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వ హించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌లో పరీక్షలు జరుగనున్నాయి. ఇక ఏపీలోని ప్రధాన నగరాల్లో 30 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 

JEE (Main) - 2023 Notification

Eligibility Criteria

Online Application

Official Website 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Embed widget